ప్రశ్నోత్తరాల నడుమ రభసగా కోటగిరి మండల సర్వసభ సమావేశం

 

కోటగిరి ఫిబ్రవరి 26 జనం సాక్షి:-మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయంలో ఎంపీపీ వల్లే పల్లి సునిత శ్రీనివాస్ అధ్యక్షతన కోటగిరి మండల సర్వసభ సమావేశం ప్రశ్నోత్తరాల నడుమ రభసగా కొనసాగింది.మండలంలో పలు శాఖల ఆధ్వర్యంలో జరిగిన,జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి చర్చ జరుగుతున్న సందర్భంలో ఆర్‌‌అండ్‌బీ ప్రస్తావన రాగా ఆర్‌‌అండ్‌బీ ఏఈ తమ పరిధిలోని రోడ్లకు మరమ్మత్తులు చేయించటంలో పూర్తిగా విఫలమౌతున్నారని వైస్ ఎంపీపీ గంగాధర్ పటేల్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.మండలంలోని పొతంగల్ చెక్‌పోస్ట్‌నుండి కొల్లూర్ వరకు వెళ్లే రోడ్డుకు ఇరువైపులా మొరం కొట్టుకుపోయి నిత్యం ప్రమాదాలు జరుగుతన్నాయని.ఇటీవల ఎంపీ బీ.బీ.పాటిల్ సమీప బంధువు ఆరోడ్డుపై ఉన్న గుంతల వల్ల యాక్సిడెంట్‌అయి చనిపోయారని ఇప్పటికే చాలాసార్లు ఆయన దృష్టికి తీసుకెళ్లినా రోడ్డుకు మొరం పోయించటంలేదని మండిపడ్డారు.మండలంలో అధికారులందరూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ ఎంపీటీసీ మండిపడ్డారు, డెవలప్ మెంట్ చార్జీల పేరుతో అమాయకులు పేదలకు కరెంటు డిపార్ట్‌మెంట్ నడ్డి విరుస్తుందని, నాలుగు నెలల క్రితం వేసిన రాంపూర్ రోడ్డులోగల నిజాం సాగర్ కెనాల్ పై నాలుగున్నర లక్షలతో నిర్మించిన బ్రిడ్జ్‌‌ను కూల్చివేసి ఇప్పుడు కొత్త బ్రడిడ్జ్ నిర్మించటం ఏంటని ప్రశ్నించారు. నిజాం సాగర్ కెనాల్‌కు నాణ్యతాలోపంతో నిర్మించిన సైడ్‌వాల్ కూలిపోవటంతో ఇప్పటివరకు కోటగిరి రైతులకు సాగర్ నీళ్లు అందక పంటలు ఎండుతున్నాయని సభ్యులు మండిపడ్డారు.సాగర్ కాల్వల పనులను ఏఈలు పర్యవేక్షిస్తే గోడలు ఎలా కూలుతాయని ప్రశ్నించారు. వెంటనే కోటగిరి రైతులకు సాగునీరు అందేలా చూడాలని కోరారు.లేదంటే రైతులతో రోడ్డుపై ధర్నా చేస్తామన్నారు.మిషన్ భగీరథ నీళ్లు ఇప్పటివరకు చాలా చోట్ల రావటంలేదని,వచ్చిన చోట కలుషిత నీళ్లు వస్తున్నాయని ఆ నీటిని ప్రజలు ఎలా తాగుతారని ప్రశ్నించారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ శంకర్ పటేల్,వైస్ ఎంపీపీ గంగాధర్ పటేల్,జడ్పీ కో ఆప్షన్ మెంబర్ సిరాజ్ ఎంపీటీసీలు, సర్పంచ్‌లు,ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు