జైన్​ కన్​స్ట్రక్షన్స్​ నుంచి కాసా వాటర్​సైడ్ ప్రాజెక్టు


ఖైరతాబాద్ : జనవరి 03 (జనం సాక్షి)  సిటీకి చెందిన జైన్​ కన్​స్ట్రక్షన్స్​మల్కాజ్​గిరి సఫిల్​గూడలో కాసా వాటర్​సైడ్​ పేరుతో గేటెడ్​ కమ్యూనిటీ ప్రాజెక్టును లాంచ్​ చేసింది. మొత్తం ఐదుబ్లాకుల్లో 2, 3, 4 బెడ్​రూమ్​లతో కూడిన 520 లగ్జరీ హోమ్స్​ను  నిర్మిస్తున్నారు. ధరలు రూ.81.5 లక్షల నుంచి రూ.1.9 కోట్ల వరకు ఉంటాయి. బేస్​ ప్రైస్​ చదరపు అడుగుకు రూ.6 వేల నుంచి మొదలవుతుంది. ప్రాజెక్టు ఏరియా 8.49 ఎకరాలు కాగా, ఐదు ఎకరాల్లో అపార్టుమెంట్లను నిర్మించారు. డెలివరీలు వచ్చే ఏడాది డిసెంబరు నుంచి మొదలవుతాయని జైన్​కన్​స్ట్రక్షన్స్​ ప్రకటించింది. కంపెనీ పార్ట్​నర్​ సుబ్రత్​ చౌదరి మీడియాతో మాట్లాడుతూ క్వాలిటీలో ఎక్కడా రాజీపడలేదని, అందుకే ఇప్పటి వరకు 300 యూనిట్లు బుక్​ అయ్యాయని చెప్పారు. వినోదం కోసం గార్డెన్​, స్విమ్మింగ్​ పూల్​, క్లబ్​ హౌజ్​వంటి సదుపాయాలు ఉన్నాయని చెప్పారు. గుడి, మెడిటేషన్​ సెంటర్​, స్పా, సెలూన్​, పార్లర్​, జిమ్​, కాఫీ లాంజ్​, ఇండోర్​ గేమ్​ జోన్​, స్పోర్ట్స్​ కోర్టులు, లైబ్రరీలను కూడా అందుబాటులోకి తెస్తామని చెప్పారు. తమ కస్టమర్లు యాక్సిస్​, హెచ్​డీఎఫ్​సీ, కెనరా, ఐసీఐసీఐ వంటి 13 బ్యాంకుల నుంచి లోన్లు కూడా పొందవచ్చని చౌదరి వివరించారు. ఇప్పటి వరకు తాము 35 ప్రాజెక్టులను పూర్తి చేశామని, మరో నాలుగు నిర్మాణదశలో ఉన్నాయని పేర్కొన్నారు.