కాంగ్రెస్ సభ్యత్వ నమోదు వేగవంతం చేయాలి : ఏలేటి


నిర్మల్ బ్యూరో, ఫిబ్రవరి,21,, జనంసాక్షి  ,,, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాదుకుంటామ ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. నర్సా పూర్ (జీ) మండల కేంద్రము లో జరిగిన పార్టీ  సమావేశంలో మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు, సభ్యత్వం పొందిన వారికి 2 లక్షాల భీమా సదుపాయం ఉంటుందని తెలిపారు.  


ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఏ తెలంగాణ కోసమైతే ప్రజలు, యువకులు ఆత్మబలిదానాలు చేసుకున్నారో ఇప్పుడూ 8 ఏళ్ళుగా  అన్ని వర్గాలు అవేదన తో ఉన్నారని చెప్పారు. కేంద్ర, రాష్ట ప్రభుత్వాలపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.ఈసమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముత్యం రెడ్డి,తక్కల రమణారెడ్డి,ఇంద్రకరణ్ రెడ్డి,,సర్పంచ్ లు,మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు,పాల్గొన్నారు.