ఆశావర్కర్లకు స్మార్ట్‌ ఫోన్లు అందచేత


టెక్నాలజీ ఉపయోగించి ముందుకు సాగాలి

ఆశావర్కర్ల జీతాలను భారీగా పెంచిన గనత కెసిఆర్‌దే
స్మార్ట్‌ ఫోన్లు అందచేస్తూ మంత్రి ఎర్రబెల్లి సూచన
వరంగల్‌,ఫిబ్రవరి25 (జనంసాక్షి): రాష్ట్ర వ్యాప్తంగా ఆశావర్కర్ల సేవలను మరింతగా సద్వినియోగం చేసుకునేందుకు 27వేల మంది ఆశావర్కర్లకు 4జీసిమ్‌, స్మార్ట్‌ ఫోన్‌ లను అందిస్తున్నామని పంచాయితీ, గ్రావిూణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు తెలిపారు. ఆశా వర్కర్లు టెక్నాలజీని అందిపుచ్చుకొని ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.గతంలో ఆశావర్కర్లు జీతం కోసం పోరాటాలు చేస్తే నాటి ప్రభుత్వాలు గుర్రాలతో తొక్కించాయని గుర్తు చేశారు.ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాత్రం ఆశాల మనసు తెల్సుకుని జీతాలను రు. 9750 కి పెంచారని అన్నారు. శుక్రవారం ఆయన వరంగల్‌, హన్మకొండ జిల్లాల పరిధిలోని ఆశ వర్కర్లకు స్మార్ట్‌ ఫోన్‌లను పంపిణీ చేశారు. వరంగల్‌ లోని 693 మంది, హనుమకొండలోని 616 మంది ఆశ వర్కర్లకు మంత్రి స్మార్ట్ఫోన్లను హనుమకొండ కలెక్టరేట్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ స్మార్ట్‌ ఫోన్‌ లను అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటుకు ముందు వారి వేతనం కేవలం 15 వందలు మాత్రమే ఉంటే ఇప్పుడు ఆశాల జీతం 9 వేల 750 కి చేరింది.ఏడు ఏళ్లలో ఎంత పెరిగిందో ఆలోచించాలన్నారు. .ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌లో ఆశా వర్కర్లకు ఇచ్చేది కేవలం 4వేలు అయితే మన దగ్గర ఇస్తున్నది 9వేల 750.మరో బీజీపీ రాష్ట్రం మధ్య ప్రదేశ్‌ లో ఇస్తున్నది కేవలం 3 వేలు.కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రం రాజస్థాన్‌ లో ఇస్తున్నది కేవలం 3 వేలు మాత్రమేనని అన్నారు.గతంలో మూడు నెలలకు ఒక్కసారి జీతాలు వచ్చేది గగనమని అన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ప్రతి నెలా ఒకటో తారీకు జీతాలు
ఇస్తున్నది. ముఖ్యమంత్రి మనసున్న మహా మనిషి,పని తీరుతో ముఖ్యమంత్రి మనసు గెలుచుకోవాలని అన్నారు.ఆరోగ్య కార్యక్రమాలు విజయవంతం కావడంతో ఆశాలది కీలక పాత్ర.బాగా పని చేస్తున్నారు.. ఫీవర్‌ సర్వేతో కరోనా కట్టడి చేశారని ప్రశంసించారు.వరంగల్‌, హన్మకొండలోవ్యాక్సినేషన్‌ బాగా చేశారు.వంద శాతం పూర్తి చేసి మంచి పేరు తెచ్చారు.ఇంకా...గర్భిణీ సంక్షేమం పై మరింత దృష్టి పెట్టాలి.ప్రజల ఆరోగ్యం ఆశా వర్కర్లు... విూ అందరి చేతుల్లోనే ఉంది.ప్రభుత్వ దవాఖానల్లో కానుపులు పెరగాలి.దీర్ఘ కాలిక వ్యాధి గ్రస్తులకు త్వరలో ఎన్‌ సి డి (నాన్‌ కమ్యూనికేబుల్‌ డిసీజెస్‌) కిట్లు అందజేస్తాము.ప్రజారోగ్యం లో తెలంగాణ దేశంలో 3 వ స్థానంలో ఉందని తెలిపారు. మోడీ, యోగి ప్రాతినిధ్యం వహించే ఉత్తర ప్రదేశ్‌ చివరి స్థానంలో ఉంది.మనం మూడు నుండి మొదటి స్థానంలోకి వెళ్లేందుకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో లో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ వినయ్‌ భాస్కర్‌,వరంగల్‌ జడ్పీ చైర్మన్‌ సుధీర్‌ కుమార్‌, ఎం పీ పసునూరి దయాకర్‌, ఎమ్మెల్సీ బండ ప్రకాష్‌, ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్‌, సుదర్శన్‌ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, రెండు జిల్లాల కలెక్టర్లు గోపి, రాజీవ్‌ గాంధీ హనుమంతు, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.