ఎన్టీపిసి బూడిదపై కేంద్రానికి ఎంపి వివరణ

తక్షణ  చర్యలు తీసుకోవాలని వినతి

పెద్దపల్లి,ఫిబ్రవరి21(జ‌నంసాక్షి):  ఎన్టీపీసీ సంస్థ బూడిద కాలుష్యం వల్ల నష్టపోతున్న పెద్దపల్లి జిల్లాలోని కుందన్‌పల్లి గ్రామస్తుల సమస్య పరిష్కారానికి శాశ్వత పరిష్కారం చూపాలని పెద్దపల్లి ఎంపీ ఎంపీ వెంకటేష్‌ నేత అన్నారు. సమస్య పరిష్కారం కోసం రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ తలపెట్టిన పాదయాత్రకు ఎంపీ డాక్టర్‌ బోర్లకుంట వెంకటేష్‌ నేత మద్దతు ప్రకటిస్తూ సోమవారం హుటాహుటిన ఢల్లీి బయల్దేరారు. కేంద్ర కార్యదర్శి గురుదీప్‌ సింగ్‌ను ఆయన కార్యాలయంలో కలిసి ఎన్టీపీసీ వల్ల చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని వివరించారు. నిర్వాసిత గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు మార్చి సహకారం అందించాలని ఎంపీ కోరారు. ఈ సందర్భంగా గురుదీప్‌ సింగ్‌ సానుకూలంగా స్పందించి త్వరలో శాశ్వత పరిష్కారం చూపిస్తామని హావిూ ఇచ్చారని ఎంపీ తెలిపారు.