భారత రాజ్యాంగం పై కెసిఆర్ అనుచిత వ్యాఖ్యలపై నిరసనగా దిష్టిబొమ్మ దహనం

 


  ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 10 (జనం సాక్షి) రాజ్యాంగం పై కెసిఆర్ చేసిన అనుచిత వాక్యాలకు నిరసన గా బిజెపి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తుంటే ఇది చూసి తట్టుకోలేని కెసిఆర్  ప్రధాని నరేంద్ర మోడీ  పైన చేసిన అనుచిత వాక్యలకు నిరసన గా రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రం లో బిజెపి మండల వ్అధ్యక్షులు తాండ్ర రవీందర్ ఆధ్వర్యంలో లో కెసిఆర్ దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఎస్సి మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు బాష  మాట్లాడుతూ బిడ్డ కెసిఆర్ రాజ్యాంగం కాదు కదా! రాజ్యాంగం పైన ఉన్న దుమ్ము కూడ దులుపవు బిడ్డ,అన్ని వర్గాలు కష్టపడితే దళితున్ని సీఎం చేస్తా అని దొడ్డి దారిన ముఖ్యమంత్రివి అయ్యావు, ఏ ఒక్క వర్గానికి న్యాయం చేయని నివ్వు వెంటనే రాజీనామా చేయాలనీ రాబోయే 2023 లో బిజెపి అధికారం లోకి రావడం ఖాయం మిమ్మల్ని తెలంగాణా రాష్ట్రము లో ఎవరు కూడా నమ్మడం లేదు ని పతనం ఖాయం సర్వేలన్నీ బిజెపి అనుకూలంగా ఉంటే దీన్ని చూసి నివ్వు బిజెపి నాయకులపైనా కార్యకర్తల పైన దాడులు చేపిస్తావా! అంబేద్కర్  రాసిన రాజ్యాంగం పైన నమ్మకం లేదా !అందుకే ఎప్పుడు కూడా జయంతి గాని వర్ధంతి కి రావు అని అన్నారు ఇట్టి కార్యక్రమం లో జిల్లా కార్యవర్గ సభ్యులు ముంత జంగయ్య, గొల్లపల్లి శ్రీధర్ గౌడ్ బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి పగడాల శ్రీశైలం, కార్యదర్శి మారగోని శేఖర్, ఉపాధ్యక్షులు పత్తి రాజు,కోతి మధుకర్ రెడ్డి,  ప్రధాన కార్యదర్శి నడికుడి కృష్ణ, ఎస్సి మోర్చా, ఓబిసి మోర్చా, బీజేవైఎం అధ్యక్షులు దయాకర్, పల్లపు నరేష్, బూతరాజు నాగరాజు, తదితరులు పాల్గొన్నారు