జటిలమైన సమస్యలపై దృష్టి సారించాలి


ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి

బిజినేపల్లి. ఫిబ్రవరి.21. జనం సాక్షి. మండల అధికారులు ప్రజా ప్రతినిధులు మమేకమై మండలంలోని ఒక గ్రామాన్ని ఎంచుకొని ఆ గ్రామ సర్పంచ్ ఎంపీటీసీ తో పాటు గ్రామంలో పర్యటించి ఆ గ్రామంలో ఉన్న జటిలమైన సమస్యలపై దృష్టి సారించి అవి పరిష్కారం అయ్యే విధంగా వారు కృషి చేయాలని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి వారికి సూచించారు సోమవారం మండల కేంద్రంలో గల ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపిపి శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వహణలో సమయపాలన తప్పకుండా పాటించి మన పరిధిలో ఉన్న సమస్యలు సత్వరమే పరిష్కరించాలని మండల అధికారులకు సూచించారు మూడు నెలలకు ఒకసారి నిర్వహించే సర్వసభ్య సమావేశంలో పాత అంశాలే మళ్లీ మళ్లీ చదివి వినిపించడం సరైన పద్ధతి కాదని అధికారులను హెచ్చరించారు ఏ ఏ శాఖలలో ఏ విధమైన సమస్యలు ఉన్నాయో  మీ పరిధిలో ఉంటే పరిష్కరించాలని ఆయన అన్నారు ఒక ఉద్యోగి ప్రభుత్వం నుండి  వేతనం తీసుకుంటే ఆ కుటుంబమే బాగుపడుతుంది తప్ప ప్రజలకు ఎలాంటి  ఉపయోగం ఉండదని అందుకే ప్రతి ఉద్యోగి ప్రజాపతినిధులతో ప్రజలతో కలిసిమెలిసి ఉండి గ్రామాలలో ఉన్న సమస్యలను పరిష్కరించుకునేందుకు గ్రామ సభలు ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు తెలిపారు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించ తలపెట్టిన మన ఊరి మనబడి అనే కార్యక్రమంలో గ్రామంలోని ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేస్తూ పాఠశాలల అభివృద్ధికి దాతలు ఎవరైనా ఉంటే వారిని ప్రోత్సహించాలని సూచించారు మండల అధికారులు. గ్రామ అధికారులు ప్రజాప్రతినిధుల ఫోన్లకు స్పందించి ఎల్లవేళలా గ్రామాలలో వారికి అందుబాటులో ఉండాలని లేనిపక్షంలో చర్యలు తప్పవని ఎంపీడీవో కు సూచించారు అధికారులు ప్రజా ప్రతినిధులు ప్రజల భాగస్వామ్యంతో గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించే విధంగా కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కురుమయ్య సింగిల్విండో చైర్మన్ బాలరాజ్ గౌడ్ వైస్ ఎంపీపీ చిన్నారెడ్డి వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు
Attachments area