నల్గొండ ముసాయిదా మాస్టర్ ప్లాన్ పై  రెండవ కన్సల్ టేటివ్ వర్క్ షాప్ నిర్వహణ       

     



  నల్గొండ  మున్సిపాలిటీ ముసాయిదా మాస్టర్ ప్లాన్ పై సూచనలు,సలహాలు స్వీకరణ 

                   జనం సాక్షి బ్యూరో.నల్గొండ,ఫిబ్రవరి 15.

నల్గొండ మున్సిపాలిటీ ముసాయిదా ప్రణాళిక పై సూచనలు,సలహాలు అందించాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ కోరారు.అమృత్ పథకం లో భాగంగా జి.ఐ. ఎస్.ఆధారిత ముసాయిదా మాస్టర్ ప్లాన్ రూపకల్పన స్టెమ్ కన్సల్టెన్సీ వివిధ శాఖలు,అన్ని పారామీటర్ లు పరిగణనలోకి తీసుకుని ప్రస్తుత పరిస్థితి ననుసరించి సర్వే చేసి  వచ్చే 20 సంవత్సరం లు 2041 వరకు జనాభా,మౌళికవసతులు,సాంఘిక,ఆర్ధిక అవసరాలు కనుగుణం గా తయారు చేయడం జరిగిందని తెలిపారుముసాయిదా తయారీ లో వివిధ అంశాలు వివరించారు.ఈ ముసాయిదా పై సూచనలు,సలహాలు అందించాలని,రాత పూర్వకంగా తెలిపితే పరిశీలించి ముసాయిదా లో చేర్చడం జరుగుతుందని ఆయన అన్నారు.                         నల్గొండ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి 20 సంవత్సరం లకు మాస్టర్ ప్లాన్ రూపొందించడం జరుగుతుందని,1987 మాస్టర్ ప్లాన్ తర్వాత మళ్ళీ మాస్టర్ ప్లాన్ రూపకల్పన జరుగక మున్సిపాలిటీ నష్టపోయిందని,ఆ బివృద్ది జర్గలేదని అన్నారు.1987 జనాభా ప్రకారం రోడ్లు,ఇతర సౌకర్యాలు ఉన్నవని,పరిస్థితులు మార్పు రావాలని అన్నారు.ముసాయిదా మాస్టర్ ప్లాన్ లో నివాసిత,పారిశ్రామిక, వాణిజ్య, వాటర్ బాడీస్, వ్యవసాయ జోన్ లుగా భూ భాగం ను వర్గీకరణ చేసినట్లు తెలిపారు.రెండు సంవత్సరాలలో నల్గొండ అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇప్పటికే ప్రధాన రోడ్లు,జంక్షన్ అభివృద్ధి పనులు చేపట్టి నట్లు తెలిపారు. నల్గొండ పట్టణం లో ఐ. టి.హబ్ కు శంఖుస్థాపన చేయడం జరిగిందని, మెడికల్ కళాశాల వచ్జిందని,వెటర్నరీ కళాశాల మిర్యాలగూడ రోడ్డు కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేయవలిసి ఉందని అన్నారు.జనాభా 2041 నాటికి 20 శాతం పెరుగుతుందని అంచనా వేసుకోవాలని అన్నారు.రింగ్ రోడ్డు ఏర్పాటు చేసుకోవాలని సు ఆయన సూచించారు. నల్గొండ అభివృద్ధికి అందరి సహకారం అవసరమని, కౌన్సిలర్ లు,ప్రతి ఒక్కరూ సహకారం తో జిల్లా కేంద్రం గా వెనుకబడిన నల్గొండ అభివృద్ధి కి పాటుపడతామని అన్నారు.                           స్టెమ్ కన్సల్టెన్సీ సంస్థ ప్రతినిధి శ్రీ కుమార్ నల్గొండ మున్సిపాలిటీ జి.ఐ. ఎస్.ఆధారిత ముసాయిదా మాస్టర్ ప్లాన్ ను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో వివరించారు.డైరెక్టరేట్ ఆప్ టౌన్ ప్లానింగ్ సంస్థ  మాస్టర్ ప్లాన్ రూపకల్పన కు స్టెమ్ సంస్థ ద్వారా వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకొని 2041 సంవత్సరం కు రూపకల్పనకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.అమృత్ పథకం భారత ప్ర భుత్వం2005 లో ప్రారంభించినట్లు,ఇందులో భాగంగా దేశం లో 500 క్లాస్ పట్టణాలను జి. ఐ. ఎస్.ఆధారిత  మాస్టర్ ప్లాన్ రూపొందించాలని నిర్ణయించిందని తెలిపారు.తెలంగాణ రాష్ట్రం లో 12 జిల్లాలు ఉండగా అందులో నల్గొండ జిల్లా ఒకటని అన్నారు.2020.లో ముసాయిదా మాస్టర్ ప్లాన్ తయారీ కి పని మొదలు పెట్టినట్లు అందుకు అవసరమైన డాటా,సమాచారం,విశ్లేషణ తో జి. ఐ. ఎస్.ఆధారిత ముసాయిదా మాస్టర్ ప్లాన్ వచ్చే 20 సంవత్సరం ల వరకు తయారు చేసినట్లు తెలిపారు.2013 లో 7 గ్రామాలు మున్సిపాలిటీ లో విలీనం అయినట్లు,విస్తీర్ణం పెరిగిందని అన్నారు.భౌగోళిక విస్తీర్ణం,జనాభా,జన సాంద్రత, అక్షరాస్యత, లింగ నిష్పత్తి,రోడ్లు, హౌజింగ్,వాణిజ్య,ఆర్థిక కార్యకలాపాలు,పరిశ్రమలు,వర్క్ ఫోర్స్,మౌలిక వసతులు, సామాజిక అంశాలు,పర్యాటక, గ్రీన్ జోన్,అన్ని అంశాలతో వచ్చే 20 సంవత్సరాలకు రూపకల్పన చేసినట్లు తెలిపారు.                   సమావేశం లో పాల్గొన్న కౌన్సిలర్ లు,ప్రజా ప్రతినిధులు,ఎన్. జి.ఓ.లు,రెసిడెంట్స్ అసోసియేషన్ లు పలువురు మాస్టర్ ప్లాన్ పై సూచనలు,సలహాలు అందించారు.పారిశ్రామిక, గ్రీన్ జోన్,పర్యాటక ,రోడ్డు కనెక్టివిటీ పై సూచనలు చేశారు. నీలగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (నుడా) ప్లాన్ రూపకల్పన చేసిన నేపథ్యంలో నల్గొండ మున్సిపాలిటీ ముసాయిదా మాస్టర్ ప్లాన్ తో నుడా ప్లాన్ ఇంటిగ్రేట్ చేసుకోవాలని సూచించారు.                మున్సిపల్ కమిషనర్ కె.వి.రమణాచారి మాట్లాడుతూ పాత మాస్టర్ ప్లాన్,కొత్త ముసాయిదా మార్పులు సభ్యులకు అంద చేయనున్నట్లు,రెండు ,మూడు రోజుల్లో తమ సలహాలు,సూచనలు తెలపాలని, స్వీకరించిన సలహాలు,సూచనలు అనుసరించి ముసాయిదా మాస్టర్ ప్లాన్ రూపొందించి పబ్లిష్ చేయడం జరుగుతుందని,పబ్లిష్ చేసిన తర్వాత అభ్యo తరాలు స్వీకరించనున్నట్లు తెలిపారు.ఈ వర్క్ షాప్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ,మున్సిపల్ చైర్మన్ యం.సైది రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బ గోని రమేష్,అసిస్టెంట్ కాలెక్టర్ ట్రైనీ అపూర్వ్ చౌహన్,మున్సిపల్ శాఖ ఆర్.డి.డి.నరసింహ రెడ్డి,ప్రజారోగ్య,టి.యు. ఎఫ్.ఐ. డి.సి.ఎస్.ఈ. కందు కూరి వెంకటేశ్వర్లు,ప్రజారోగ్య ఈ ఈ సత్యనారాయణ, గృహ నిర్మాణ శాఖ పి.డి.రాజ్ కుమార్,మత్స్య శాఖ ఏ.డి.వెంకయ్య  పలువురు అధికారులు,కౌన్సిలర్ లు,ఎన్. జి.ఓ.లు,రెసిడెంట్ అసోసియేషన్ లు పాల్గొన్నారు.