వాణిజ్యంపై ఉక్రెయిన్‌ యుద్ద ప్రభావం

ఎగగుమతి,దిగుముతలపై తీవ్ర ప్రభావం

విూడియా సమావేశంలో మంత్రి నిర్మలా సీతరామన్‌
న్యూఢల్లీి,ఫిబ్రవరి28(ఆర్‌ఎన్‌ఎ): రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ఈ సందర్భంగా ఉక్రెయిన్‌తో వాణిజ్య సంబంధాలపై ప్రభావం చూపుతుందన్నారు. ఇరుదేశాల యుద్ధంతో దేశ విదేశీ వాణిజ్యం, ముఖ్యంగా వ్యవసాయరంగం నుంచి ఎగుమతులపై ప్రభావం చూపుతుందని ప్రభుత్వం ఆందోళన చెందుతుందని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులను కేంద్రం నిశితంగా పరిశీలిస్తుందని తెలిపారు. ఉక్రెయిన్‌కు తక్షణ దిగుమతులు, ఎగుమతులు కష్టంగా మారిందని, అలాగే, అక్కడి నుండి వచ్చే ఉత్పత్తులు కూడా ఎలా వస్తాయో తెలియని పరిస్థితి అని అభిప్రాయపడ్డారు. కానీ, ఇక్కడి నుంచి ఎగుమతులు, ముఖ్యంగా రైతాంగం గురించి ఆందోళనగా ఉన్నట్లు చెప్పారు. ఇప్పటికీ పరిస్థితులు ఎమర్జెన్సీని తలపిస్తున్నాయని, ఐతే వివిధ మంత్రిత్వ శాఖల ద్వారా తనకు అన్ని అంశాలు వచ్చాక కానీ పూర్తిగా చెప్పలేమన్నారు. ప్రస్తుత పరిస్థితి మున్ముందు నిత్యావసరాల పైన ప్రభావం చూపవచ్చునన్నారు. ఉక్రెయిన్‌ పరిస్థితులు దేశంలోని ఎడిబుల్‌ ఆయిల్‌తో సహా అనేక రంగాలను ప్రభావితం చేస్తుందన్నారు. ప్రభుత్వం ఇప్పటికే ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటోందన్న ఆర్థిక మంతి.. యుద్ధం నేపథ్యంలో ఎగుమతులు, దిగుమతులను కేంద్రం త్రీవంగా పరిశీలిస్తుందని, ఇందుకు దిగుమతి బిల్లును కూడా పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు రికార్డు స్థాయిలో బ్యారెల్‌కు 105 డాలర్లకు చేరాయి.