టిఎంయూ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా అశ్వద్దామరెడ్డి

హైదరాబాద్‌,ఫిబ్రవరి28 ( జనం సాక్షి):  టిఎంయూ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా అశ్వద్దామరెడ్డి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో గౌరవ అధ్యక్షుడుగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు అని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 4వేల గ్రామాలకు ఇప్పటికి బస్సు సౌకర్యంలేదన్నారు. కార్మికుల సమస్యలు పెరిగాయి తప్ప పరిష్కారం కాలేదని చెప్పారు.రెండు పీఆర్సీలు, 6డీఏలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. సీఎం కేసీఆర్‌ వివిధ సందర్భాల్లో ఇచ్చిన హావిూలను నెరవేర్చాలని కోరారు.కార్మిక సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలన్నారు. 10వ తేదీన రిలే దీక్షలు చేపడతామని పిలుపునిచ్చారు. ఆర్టీసీ పరిరక్షణకు ప్రజలు, కార్మికులు కలిసికట్టుగా కృషిచేయాలని కోరారు. సంక్షేమ కమిటీలతో పెద్దగా ఉపయోగంలేదని అశ్వద్దామరెడ్డి వ్యాఖ్యానించారు.