తెలంగాణకు బిజెపి ముందునుంచీ వ్యతిరేకమే

 


ప్రధాని మోడీ వ్యాఖ్యలుమరోమారు రుజువు చేశాయి
కెసిఆర్‌ బంధువైతే..మోడీ రాబంధువు
ఏడున్నరేళ్లుగా శనిలా పట్టుకున్నమోడీ
మండిపడ్డ మంత్రి ఎర్రబెల్లి, జీవన్‌ రెడ్డి
హైదరాబాద్‌,ఫిబ్రవరి8((జనం సాక్షి)): రాష్ట్ర విభజనకు బీజేపీ వ్యతిరేకమని మరో సారి రుజువైందని టిఆర్‌ఎస్‌ మండిపడిరది. ప్రధానమంత్రి రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అభ్యంతరకరమని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మోదీ వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు. దేశ సమాఖ్య స్ఫూర్తికి మోదీ వ్యాఖ్యలు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయని అన్నారు. ప్రజాస్వామ్యంపై బీజేపీకి ఏమాత్రం నమ్మకం లేదని తేలిపోయిందని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణపై బీజేపీకి మోదీకి ఎందుకంత అక్కసని ప్రశ్నించారు. అభివృద్ధిని చూసి ఓర్వలేకే, అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ విభజనకు విూరు వ్యతిరేకం కాబట్టే విభజన హావిూలు అమలు చేయడం లేదా అని అన్నారు. ఏ విభజన స్ఫూర్తితో లోయర్‌ సీలేరు ప్రాజెక్ట్‌ సహా, ఏడు మండలాలను ఆనాడు ఆంధ్రలో కలిపారని ప్రశ్నించారు. ఇప్పుడు తెలంగాణ బీజేపీ నేతలు ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతారని నిలదీసారు. బీజేపీ నిజ స్వరూపం ఇదే అని మరోసారి చాటి చెప్పారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన తెలిపారు.
నమో అంటే నమ్మక ద్రోహం.. మోసంలా ప్రధాని నరేంద్ర మోదీ మారాడని, పార్లమెంట్‌ సాక్షిగా ఆయన
తత్వం బయటపడిరదని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన టీఆర్‌ఎస్‌ ఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణకు సీఎం కేసీఆర్‌ బంధువైతే, మోదీ రాబంధువులా తయారయ్యాడని విమర్శించారు. తెలంగాణ ఇచ్చిన పార్లమెంట్‌నే, సంతకం పెట్టిన రాష్ట్రపతిని మోదీ అవమానించారని ఆరోపించారు. మోదీ రాజ్యాంగ, తెలంగాణ ద్రోహి అని.. తక్షణమే మోదీ దేశానికి, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. చివరకు తెలంగాణకు మద్దతు ఇచ్చిన బీజేపీ నేతలు అద్వానీ, సుష్మా స్వరాజ్‌ను సైతం మోదీ అవమానించారన్నారు. తెలంగాణ వచ్చి ఏడున్నర సంవత్సరాలు అయ్యిందని, అయినా తెలంగాణకు సాడే సాత్‌లా.. తెలంగాణకు శనిలా మారాడాన్నారు. మోదీ వ్యాఖ్యలతో తెలంగాణలో బీజేపీ చచ్చిపోవడం ఖాయమన్న జీవన్‌రెడ్డి.. చిన్న రాష్టాల్రకు వ్యతిరేకమని ఆయన వ్యాఖ్యలు చెబుతున్నాయన్నారు. తెలంగాణలో పచ్చదనాన్ని చూసి ఓర్వలేకనే మోదీ.. లేని వివాదాన్ని రేపాడని జీవన్‌ రెడ్డి ఆరోపించారు. తెలుగు రాస్ట్రాల మధ్య చిచ్చుపెట్టేందుకు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాడని, తెలంగాణ అభివృద్ధికి నిధులు, ప్రాజెక్టులు తాము అడుగుతుంటే.. మోదీ ఆడరాక పాత గ్జజెలు అన్నట్లు తెలంగాణ ఏర్పాటునే ప్రశ్నించేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. విభజన చట్టం హావిూలు తుంగలో తొక్కి.. తెలంగాణ వ్యతిరేకి అని ఇప్పటికే రుజువు చేసుకున్నాడని, మోదీ తీరు చూస్తుంటే తెలంగాణను మళ్లీ ఏపీలో కలిపే కుట్రకు తెర లేపాడా అన్న అనుమానం కలుగుతోందన్నారు. తెలంగాణ కోసం అమరులైన వారిని మోదీ అవమానించారని, తెలంగాణపై విషం చిమ్మిన మోదీ ªూష్ట్రంలోకి వస్తే నిలదీసే పరిస్థితి ఉందని, ప్రధాని పదవికే కళంకం తెచ్చారని విమర్శించారు. రాజ్యసభ వేదికగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు చాలా దురదృష్టకరమని ఎన్నారై టీఆర్‌ఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్‌ కూర్మాచలం అన్నారు. ఒక పక్క రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకం కాదనుకుంటూనే ఎప్పటికప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పై విషం చిమ్ముతున్నారని ఆయన విమర్శించారు.తెలంగాణ ప్రజలంతా గమనిస్తున్నారని, బిజెపి నాయకులు ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. లేకుంటే గతంలో వంద నియోజకవర్గాల్లో డిపాజిట్‌ గల్లంతు చేసినట్టే రాబోయే రోజుల్లో అన్ని నియోజకవర్గాల్లో అదే భంగ పాటు తప్పదని అనిల్‌ హెచ్చరించారు.