కామ్రేడ్ దారావత్ జామ్లాకు జోహార్లు


మహబూబాబాద్ బ్యూరో-ఫిబ్రవరి22 (జనంసాక్షి)

మహబూబాబాద్ జిల్లాలోని గార్ల మండలం మద్దివంచ గ్రామపంచాయతీ కొత్తతండా కు చెందిన సీనియర్ కామ్రేడ్ దారవత్ జామ్లా సోమవారం సాయంత్రం మృతి చెందారు. ఆయన మృతిపట్ల  సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య, మద్దివంచ సర్పంచ్ కుసిని బాబూరావు,ఉపసర్పంచ్ లావుడ్యా భీముడు, గౌని భద్రయ్య, భావుసింగ్, భాస్కర్, చంద్రయ్య,మైబెల్లి వెంకన్న, పార్టీ శ్రేణులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన భౌతిక కాయన్ని సందర్శించి పూలమాలలు వేసి కన్నీటి వీడ్కోలు పలికారు. వారి కుటుంబానికి ధైర్యం చెప్పి సంతాపం తెలిపారు.