ఏపీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో రోలుగుంట ఎమ్మార్వో కార్యాలయం వద్ద నిరసన


రోలుగుంట ఫిబ్రవరి 14 (జనంసాక్షి) :

రోలుగుంట మండలంలో ఉన్న నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాలు పెద్ద పేట , ఎమ్ పేట కోరుప్రోలు, పందలపాడు, గంగవరం ఆర్ల లో పెద్ద గరువులు, బిత్తిరి గడ్డ ,గుర్రాల బయలు మండలంలో ఉన్న గిరిజన గ్రామాలు అన్ని పాడేరు అల్లూరి సీతారామరాజు జిల్లా కలపాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం రోలుగుంట గౌరవ అధ్యక్షులు ఈరెల్లి చిరంజీవి మాట్లాడుతూ రోలుగుంట మండలంలో ఉన్న గిరిజన గ్రామాలలో గ్రామ సభలు జరిపి తీర్మానాలు చేయడం జరిగిందని, ప్రభుత్వం దృష్టికి పంపించారని అన్నారు. అన్ని గిరిజన గ్రామాలు పాడేరు అల్లూరి సీతారామరాజు జిల్లాలో కలపాలని డిమాండ్ చేశారు. గిరిజనులు సాగు చేసుకుంటున్న అటవీ భూముల్లో జీవనం కొనసాగిస్తున్నారని, సాగు చేసుకుంటున్న వాళ్ళందరికీ ఎనిమిదో విడత భూ పంపిణీ లో పట్టాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన గ్రామాలకు మంచినీరు రోడ్డు మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు మాజీ ఎంపిటిసి పోతురాజు, రామారావు ,మహేష్ కృష్ణ ,గిరిజన గ్రామాల నుండి అధిక సంఖ్యలో పాల్గొన్నారు.