గౌతం రెడ్డి మరణం బాధించిందికుటుంబ సభ్యులకు కెవిపి పరామర్శ

ఆయన మరణం తీరని లోటన్న స్పీకర్‌ తమ్మినేని

హైదరాబాద్‌,ఫిబ్రవరి21 జ‌నంసాక్షి:  ఏపీ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మరణం జీర్ణించుకోలేనిదని మాజీ ఎంపి,కాంగ్రెస్‌ నేత కెవిపి రామచంద్రరావు అన్నారు. హైదరాబాద్‌, జూబ్లీహిల్స్‌లోని గౌతమ్‌ పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ పరిశ్రమలశాఖ మంత్రిగా సమర్థుడిగా నిరూపించుకున్నారని అన్నారు. అలాంటి వ్యక్తిని కోల్పోవడం తెలుగు ప్రజలకు తీరని లోటన్నారు. గౌతమ్‌ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు కెవిపి తన ప్రగాఢ సానుభూతి తెలియచేశారు. ఇదిలావుంటే  మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మరణం జీర్ణించుకోలేకపోతున్నానని ఏపీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఆవేదన వ్యక్తం చేశారు. గౌతమ్‌రెడ్డి ఆకస్మిక మరణం రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజలకు తీరని లోటన్నారు. కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆయన కోరుకున్నారు. గౌతమ్‌రెడ్డి ఆత్మకు శాంతిచేకూరాలన్నారు.