కంటోన్మెంట్‌లోనూ ఉచిత మంచినీటి పథకం అమలు



కంటోన్మెంట్‌ అభివృద్దిని అడ్డుకుంటున్న కేంద్రం

రహదారులు మూసేసి ఇబ్బందులు పెడుతున్నారు
పలు అభివృద్ది కార్యక్రమాలకు మంత్రి కెటిఆర్‌ శ్రీకారం
హైదరాబాద్‌,ఫిబ్రవరి12(జనం సాక్షి ): కంటోన్మెంట్‌లోనూ ఉచిత మంచినీటి పథకం అమలు చేస్తున్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కంటోన్మెంటును అభివృద్ధి చేస్తుండగా, కేంద్రం అడ్డుకుంటు న్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడి దారులను మూసేసి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తోందన్నారు.
సికింద్రాబాద్‌లో పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్‌ శ్రీకారం చుట్టారు. సనత్‌నగర్‌ నియోజకవర్గంలోని రసూల్‌పురాలో నాలా అభివృద్ధి పనులకు, పాటిగడ్డలో మోడ్రన్‌ మల్టీపర్పస్‌ ఫంక్షన్‌ హాల్‌కు మంత్రి శ్రీనివాస్‌ యాదవ్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. కేందప్రభుత్వం పేదలకు
పట్టాలు ఇవ్వడంలేదని చెప్పారు. రోడ్లు వేస్తామంటే స్థలం ఇవ్వడం లేదని విమర్శించారు. కంటోన్మెంట్‌లో రోడ్లను మూసేయడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. కంటోన్మెంట్‌లో ఉచిత మంచి నీటి పథకం అమలు చేస్తున్నామన్నారు. పేదలకు పట్టాలు ఇవ్వకుండా కేంద్రం అడ్డు పడుతోందని విమర్శించారు. కొత్త రోడ్లు వేద్దామన్నా, నాలాలు డెవలప్‌ చేద్దామన్న కేంద్రం సహకరించడం లేదని తెలిపారు. రాజకీయ లబ్ది కోసం ప్రజల ప్రయోజనాలకు ఆటంకం కలిగించొద్దన్నారు. కలిసి వచ్చి కంటోన్మెంట్‌ అభివృద్ధికి సహకరించాలని మంత్రి కేటీఆర్‌ కోరారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో హైదరాబాద్‌ అభివృద్ధి చెందుతున్నదని వెల్లడిరచారు. నగరంలో ప్రశాంత వాతావరణం ఉన్నదని తెలిపారు. కుల మతాలతో సంబంధం లేకుండా కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ కోసం పది లక్షల మంది ఆగబిడ్డలకోసం రూ.8421 కోట్లు ప్రభుత్వం వెచ్చించిందన్నారు. పాటిగడ్డ ఫంక్షన్‌ హాల్‌ను వచ్చే దసరాకి ప్రారంభించు కుందామని చెప్పారు. కార్యక్రమంలో మంత్రి తలసాని తదితరులు పాల్గొన్నారు.