ప్రజలనాడి పట్టకుండా రాజకీయాలు చేసే వారు ఫెయిల్ అవుతారు. ఇది బాగా ఎరిగిన వారు సక్సెస్ అవుతారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన సందర్భంలో ఆయన విజయానికి ఇదే కారణం. ఎపిలో కూడా జగన్ ప్రజలనాడి తెలుసుకుని ..చంద్రబాబు వ్యతిరేకాంశాలతో పాదయాత్రలో ప్రజలకు నమ్మకం కలిగించారు. అందుకే అక్కడ అధికారంలోకి వచ్చారు. అయితే వచ్చిన అధికారం నిలబెట్టుకునేందుకు పడుతున్న తంటాలు వేరు. ఇక తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను తలకెత్తుకునే ముందు కెసిఆర్ కూడా ఎంతగా మేధో మధనం చేశారో..ఆయనతో ఉన్నవారికి తెలుసు. నెలల తరబడి నిద్ర కూడా మానేసి ఆయన ఓ రోడ్డు మ్యాప్ గీసుకుని ముందకు నడిచారు. ఆషామాషీగా ఆయన రంగంలోకి దిగలేదు...దిగిన తరవాత వెనుదిరి గి చూడలేదు. తెలంగాణ ఉద్యమంలో సాధించిన విజయంతో ప్రభుత్వాన్ని కూడా తను ఏర్పాటు చేస్తేనే సాధించుకున్న తెలంగాణ ఆకాంక్షలు సాకారం అవుతాయని భావించారు. ప్రజలు కూడా ఆయన వెంట నడిచారు. ప్రజల నాడిని పట్టి..వారి ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు సాగడం.. రాజకీయాల కోసం ఎత్తులు పై ఎత్తులు వేయడం కెసిఆర్‌కు మాత్రమే తెలిసిన విద్య. జాతీయ రాజకీయాల్లో ఆయన ఉండి వుంటే ఈ పాటికి వేరుగగా ఉండేది. కెసిఆర్‌కు దేశం విూద అవగాహన ఉంది. నదుల విూద..వాటి నడక విూదా అవగాహన ఉంది. అన్నింటికి మించి ప్రజల జీవన విధానంపై లోతైన అవగాహన ఉంది. ప్రపంచ గమనంపైనా అవగాహన ఉంది. ప్రపంచ రాజకీయాలతో పాటు, దేశ రాజకీయాలను బాగా ఔపోసన పట్టిన వ్యక్తి. దేశంలో మోడీతో పోల్చుకుంటే కెసిఆర్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయగల సత్తా ఉన్న నేత. దేశంలో ఉన్న వనరులు, వాటిని ఉపయోగించుకునే తీరు కూడా బాగా తెలిసిన వాడు. తెలంగాణలో 24 గంట నిరంతర విద్యుత్‌ను ఇవ్వగలిగడంలోనే ఆయన దార్శనికతను అర్థం చేసుకోవచ్చు. నిరంతర విద్యుత్ ఉంటే చిన్న,పెద్దా పరిశ్రమల ఉత్పత్తి రంగం దెబ్బతినదని కూడా బాగా తెలుసు. అందుకే నిరంతర విద్యుత్‌ను సాకారం చేసిన నేత.. నిజానికి దేశవ్‌ఆయప్తంగా నిరంతర విద్యుత్ ఎందుకు ఇవ్వలేక పోతున్నారో ఇప్పుడు ఆలోచన చేయాలి. దేశంలో పారుతున్న నదులను కూడా ఎలా ఉపయోగించు కోవాలో కూడా బాగా తెలిసిన వ్యక్తి కెసిఆర్. అందుకు గోదావరి జలాలను ఎదురెక్కించి రిజర్వాయ ర్లను కట్టించిన తీరు అద్బుతం కాక మరోటి కాదు. కాళేశ్వరంతో మొదలు పెట్టి..కొండపోచమ్మ సాగర్ వరకు నీటి రాకను చూస్తే అద్భుతం అని చెప్పని వారు ఉండరు. ఒక రాష్టాన్న్రి ఎలా అభివృద్ది చేయవచ్చో.. అన్నది కేవలం ఏడేళ్లలో చేసి చూపారు. కాళేశ్వరంతో పాటు అనేక ప్రాజెక్టులను కట్టడం, చెరువులను పునరుద్ద రించి గొలుసుకట్టు చెరువులకు ప్రాణం పోయడం, మిషన్ భగీరథతో ఇంటింటికీ మంచినీరు సరఫరా చేయడం,హరితహారంతో పచ్చదనాన్ని పెంచి మొక్కల పెంపక ప్రాధాన్యాన్ని వివరించారు. జిల్లాల విభజనతో పాలనను ప్రజలకు చేరువ చేశారు. అన్నింటికి మించి యాదాద్రి ఆలయాన్ని నభూతో నభవిష్యత్ అన్న రీతిలో పునరుద్దరించి..కాకతీయకళావైభవాన్ని కళ్లకు చాటారు. ఇవన్నీకూడా విప్లవాత్మక నిర్ణయాలే. ఇదే తరహాలో దేశ పగ్గాలు అందుకుంటే ఖచ్చింతంగా ఓ నాలుగైదేళ్లలో గణనీయమైన మార్పులు చూపి..ప్రజలకు ఆదర్శ నేతగా నిలిచే సత్తా కూడా ఉంది. నిజానికి కెసిఆర్ బిజెపి లాంటి పార్టీలో ఉండివుంటే మోడీకి అవకాశం వచ్చేది కాదు. మోడీది ప్రచార ..పటాటోపం తప్ప మరోటి కాదు....ప్రజలకు నేరుగా అవసరమైన పనులు చేయడంలో మోడీ పెద్దగా విజజయం సాధించలేదు. అందుకే రాజ్యాంగం కొత్తది రాసుకోవాలన్న కెసిఆర్ డిమాండ్ వెనక ప్రజల ఆకాంక్షలు బలంగా ఉన్నాయి. ప్రజల నాడిని పట్టిన నేతగానే కెసిఆర్ ఇలాంటి డిమాండ్ చేశారు. దీనిపై చర్చచేయకుండా కేవలం
కెసిఆర్‌పై దుమ్మెత్తి పోస్తే కెసిఆర్‌కు పోయేదేవిూ లేదు. గుణాత్మక రాజకీయాలు అంటున్న కెసిఆర్.. మాటలు చూశాక..మోడీ వైఫల్యాలపై చర్చించాలి. గత పార్లమెంట్ ఎన్నికలకు ముందే ఈ ప్రతిపాదనలు తీసుకుని వచ్చిన కెసిఆర్ ఆనాటి ప్రాంతీయ పార్టీల నేతలు అందరినీ కలిసారు. ఇందులో మమతా బెనర్జీ కూడా ఉన్నారు. మమతా బెనర్జీని కెసిఆర్ ప్రత్యేకంగా కలసి ఉమ్మడి ఫ్రంట్ ఏర్పాటు చేద్దామని ప్రతిపా దించారు. కానీ దీనిని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ పెద్దగా పట్టించుకోలేదు. ఔనని కానీ..కాదని కానీ చెప్పకుండా తృణీకరించారు. నిజానికి రెండేళ్ల క్రితమే మమతను కలిసినప్పుడు..ఆనాడే ఓ నిర్ణయానికి వచ్చి వుంటే ఇవాళ కెసిఆర్ నేతృత్వంలో ఓ ఫ్రంట్ బలపడేది. రాజకీయాల్లో కెసిఆర్ లాంటి నేత బహు అరుదు. పట్టుపడితే విడవకుండా పోరాడే తత్వం ఆయనకు పుట్టుకుతో వచ్చింది. అయన మాత్రమే మోఢీని ఎదుర్కొని నిలవగల సత్తా ఉన్న నేత అని చెప్పొచ్చు. మోడీతో ఉన్న ముప్పును ముందే గ్రహించి కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదన తెచ్చారు. బీజేపీని దీటుగా ఎదుర్కొని మట్టికరిపిం చేందుకు ఉమ్మడిగా ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. అప్పట్లో కెసిఆర్ స్టాలిన్,నవీన్ పట్నాయక్, మమతా బెనర్జీ, శరద్ పవార్ తదితర నేతలను నేరుగా కలిసి ప్రత్యామ్నాయ రాజకీయాలపై చర్చకు తెరతీసారు. కానీ ఈ నేతల్లో ఎవరు కూడా మళ్లీ కెసిఆర్ ప్రతిపాదనలపై ప్రస్తావించలేదు. నిజానికి ఇప్పుడు దేశంలో ప్రజాస్వామ్యం పెద్ద ప్రమాదంలో పడిరది. రాజ్యాంగంపైనా, సమాఖ్య వ్యవస్థపైనా నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా సమైక్యంగా, సమర్థంగా పోరాడాలి. ప్రభుత్వరంగ సంస్థలను తెగనమ్ముతున్న మోడీ జిఎస్టీ పేరుతో సామాన్యుల నడ్డి విరిచారు.పెట్రో ధరలు విపరీతంగా పెంచారు. ఈ క్రమంలో అందరం కలిసి దేశ ప్రజలకు విశ్వసనీయ ప్రత్యామ్నాయాన్ని అందించాలన్నది కెసిఆర్ సంకల్పం. నిజానికి ఈ విషయంలో కెసిఆర్‌ను ముందు పెట్టి సాగితే ఓ బలమైన ప్రత్యామ్నాయం కాగలదు. కెసిఆర్ మాత్రమే దేశ రాజకీయాలపై దగ్గరగా అవగాహన కలిగి ఉన్నారు. దేశం పట్ల ఆయనకు ఓ స్పష్టమైన విజన్ ఉంది. కాగా దేశంలో సమైక్య ప్రతిపక్షం ఏర్పర్చేం దుకు 2019 లోక్ సభ ఎన్నికల ముందునుంచీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ వివిధ పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం వల్ల అది ఇంతవరకూ సాధ్యం కాలేదు. కెసిఆర్ ప్రయత్నాలు ఎవరూ పెద్దగా స్వాగతించలేదు. దీంతో ఆయన కూడా వెనక్కి తగ్గారు. కాని ప్రస్తుతం దేశంలో విశ్వసనీయ ప్రత్యామ్నాయం ఏర్పడేందుకు సమయం ఆసన్నమయ్యింది. గవర్నర్లు అధికారాలను దుర్వినియోగ పరచడం, సీబీఐ, ఈడీ, ఐటీ వంటి కేంద్ర సంస్థలను తమకు అనుకూలంగా వాడుకోవడం, రాష్టాల్ర నిధుల్ని తొక్కిపెట్టడం, జాతీయ అభివృద్ది మండలి, ప్రణాళికా సంఘం వంటి సంస్థల్ని రద్దు చేయడం, బీజేపీయేతర ప్రభుత్వాల్ని పడగొట్టేందుకు వెనకాడకపోవడం,జాతీయ ఆస్తులను విశృంఖలంగా ప్రైవేటు పరం చేయడం, కేంద్ర, రాష్టాల్ర మధ్య సంబంధాలు క్షీణించడం మొదలైన వాటిని చూస్తూనే ఉన్నాం. అవకాశం వస్తే సిఎం కెసిఆర్ జాతీయ రాజకీయాల్లో నిర్ణాయక శక్తిగా మారగలరు. మోడీకన్నామెరుగైన పాలన అందించగలరు.
ప్రత్యామ్నాయ రాజకీయాలకు దిక్సూచి కెసిఆర్