నగరంలో ప్రజల అవసరాలకు పెద్దపీట




టాయ్‌లెట్స్‌ను ప్రారంభించిన మంత్రి తలసాని

హైదరాబాద్‌,ఫిబ్రవరి28  ( జనం సాక్షి):  విశ్వనగరంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌ మహానగరంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులు, సదుపాయాలు కల్పిస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. సోమవారం సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ముందు నూతనంగా నిర్మించిన అత్యాధునిక టాయిలెట్స్‌ను మంత్రి మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, ఎమ్మెల్యే సాయన్నలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిరోజు లక్షలాది మంది రాకపోకలు సాగించే రైల్వే స్టేషన్‌ వద్ద మొట్టమొదటగా వాటర్‌ లెస్‌ టాయిలెట్స్‌ ను ఏర్పాటు చేసి ప్రారంభించామన్నారు. నగరంలోని మరిన్ని ప్రాంతాలలో ఉఊఓఅ ఆధ్వర్యంలో ఇలాంటి మోడరన్‌ టాయిలెట్స్‌ ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ప్రజలు కూడా ఏర్పాటు చేసిన టాయిలెట్స్‌ ను ఉపయోగించుకోవడం ద్వారా స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ ఆధ్వర్యంలో ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా రహదారుల అభివృద్ధి, విస్తరణ, ట్రాఫిక్‌ నియంత్రణ కోసం ్గªª`ల ఓవర్‌ లు, అండర్‌ పాస్‌ ల నిర్మాణం, సీవరేజ్‌, తాగునీరు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో జోనల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ రెడ్డి, ఇఇ సుదర్శన్‌, కార్పొరేటర్‌ దీపిక, మాజీ కార్పొరేటర్‌ ఆకుల రూప, మోడరన్‌ టాయిలెట్స్‌ నిర్వహకులు రంజన్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.