రష్యా సరిహద్దులకు ఉత్తర అట్లాంటిక్ మిత్ర సమితి (*నాటో--NATO*) విస్తరణ బెదిరింపులతో రెచ్చగొట్టబడిన పుతిన్ ఉక్రెయిన్‌పై సైనిక దాడులను ప్రారంభించాడు.




 పుతిన్ నేతృత్వంలోని రష్యా సామ్రాజ్యవాదులకు,  అమెరికా( యు ఎస్) నేతృత్వంలోని సామ్రాజ్యవాద శక్తులు మరియు వారి  ఉత్తర అట్లాంటిక్ మిత్ర సమితి( *నాటో-NATO*) మధ్య తీవ్రమవుతున్న వైరుధ్యం ఫలితంగా ఉక్రెయిన్‌పై ప్రస్తుత రష్యా దాడి చెలరేగింది.  ఈ అత్యంత ప్రపంచీకరణ ప్రపంచంలో ప్రజల కష్టాలను మరింత తీవ్రతరం చేసే రష్యా సైనిక చర్యను మేము ఖండిస్తున్నాము.  కానీ రష్యా ప్రభుత్వాన్ని మాత్రమే విలన్‌గా మరియు  యుద్ధానికి  పూర్తిగా పుతిన్ బాధ్యుడు అని చిత్రీకరిస్తున్న పాశ్చాత్య మీడియా ప్రచార హోరును మనం గుడ్డిగా స్వీకరించ కూడదు. 
  రష్యా బలగాలు ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై దాడి చేయడం ప్రారంభించాయి. వాస్తవానికి,  1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైనప్పటి నుండి  తూర్పు ఐరోపాలోని మాజీ సోషలిస్ట్ దేశాలన్నింటినీ  మరియు  సోవియట్ యూనియన్ రాష్ట్రాల సమాఖ్య  నుండి  విడిపోయిన ఉక్రెయిన్ వంటి దేశాలన్నింటిని తమ అధీనంలోకి తెచ్చుకోవడానికి రష్యా సరిహద్దు వరకు దాని ప్రభావాన్ని విస్తరించిటానికి కొనసాగుతున్న నాటో దళాల ప్రాక్సీ యుద్ధ ఎత్తుగడలకు ప్రతిస్పందనే రష్యా యొక్క ఈ దాడి. ఒకప్పటి సోషలిస్ట్ సోవియట్ యూనియన్‌ను నిలువరించడానికి యూరప్‌లోని అన్ని సామ్రాజ్యవాద దేశాలతో పాటు *అమెరికా( US)* సామ్రాజ్యవాదం రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత వారి చే  ఉత్తర అట్లాంటిక్ మిత్ర సమితి( *నాటో-NATO)*ప్రారంభించబడింది.   సోషలిస్టు శిబిరాన్ని అణిచివేసేందుకు సామ్రాజ్యవాద శిబిరం వివిధ దేశాలలో సైనిక చర్యలతో పాటు ప్రచ్ఛన్న యుద్ధాన్ని ప్రారంభించింది.  పెట్టుబడిదారీ మార్గీయులు అధికారాన్ని చేజిక్కించుకుని, సోషలిస్ట్ సోవియట్ యూనియన్ ను ఒక సోషల్ సామ్రాజ్యవాద సూపర్ పవర్‌గా మార్చిన తర్వాత, మరొక సూపర్ పవర్ అయిన  *అమెరికా(US)* సామ్రాజ్యవాదం తో ప్రపంచ ఆధిపత్యం కోసం పోరాటం మరియు కుమ్మక్క ఎత్తులు అనుసరించింది. ఈ ప్రచ్ఛన్న యుద్ధం తీవ్రరూపం దాల్చింది.  కానీ, సోవియట్ యూనియన్ కూలిపోయి, విచ్ఛిన్నమైనప్పుడు మరియు తూర్పు యూరప్‌లోని మాజీ సోషలిస్టు దేశాలు NATOలో చేరడం ప్రారంభించినప్పుడు,   *అమెరికా(US)* సామ్రాజ్యవాద శక్తులు మరియు వారి సిద్ధాంతకర్తలు ప్రచ్ఛన్న యుద్ధానికి ముగింపు పలికారు.  ఈ సమయంలో,  ఉత్తర అట్లాంటిక్ మిత్ర సమితి (నా టో-NATO) రద్దు చేయబడుతుందని భావించారు.  కానీ అందుకు విరుద్ధంగా జరిగింది.   ఉత్తర అట్లాంటిక్ మిత్ర సమితి  *(నాటో-NATO)* అణ్వాయుధాలతో మరింత బలోపేతం చేయబడింది మరియు  *అమెరికా(US)* మరియు దాని మిత్రదేశాలను రక్షించడానికి నాటో ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతుందని వారు ప్రకటించారు.  పశ్చిమాసియా దేశాలలో మరియు ఆఫ్ఘనిస్తాన్‌లో కూడా *అమెరికా( US)* దూకుడు చర్యలలో ఉత్తర అట్లాంటిక్ మిత్ర సమితి *(నాటో- NATO)* దళాలు పాల్గొన్నాయి.  కాబట్టి,  ఉత్తర అట్లాంటిక్ మిత్ర సమితి *(నాటో-NATO)*లో చేరమని ఉక్రెయిన్ యొక్క ప్రస్తుత నయా-ఫాసిస్ట్ అధ్యక్షుడుని నాటొ తొందరపెడుతున్నందున మరియు ఉత్తర అట్లాంటిక్ మిత్ర సమితి *(నాటో- NATO)* దళాలు దాని సరిహద్దులకు చేరుకునే ముప్పు వాస్తవికంగా మారడంతో, అభద్రతా భావంతో, పుతిన్ యొక్క రష్యా ఉక్రెయిన్‌కు గుణపాఠం నేర్పడానికి యుద్ధాన్ని ప్రారంభించింది.
  
 అయినప్పటికీ, అటువంటి సైనిక దురాక్రమణలు ఖండించదగినవని మేము అభిప్రాయపడుతున్నాము.  ఇలాంటి దాడులు జరిగినప్పుడల్లా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రగతిశీల ప్రజాస్వామ్య శక్తులకు అండగా నిలిచాం.
 
 నిజానికి, గుత్తాధిపత్య మీడియా ప్రాజెక్ట్ చేయడాని ప్రయత్నిస్తున్నట్లు
 నేడు జరుగుతున్నది రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య యుద్ధం కాదు;   ఉత్తర అట్లాంటిక్ మిత్ర సమితి *(నాటో-NATO)* కూటమి మరియు రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం.   ఉత్తర అట్లాంటిక్ మిత్ర సమితి *(నాటో-NATO)* శక్తులు పీకలదాకా సాయుధం చేసి  ఉద్దేశపూర్వకంగా ముందుకు నెట్టిన వారి ప్రాక్సీ(దివాన్) ఉక్రెయిన్ ప్రభుత్వం కు మరియు రష్యాకు మధ్య జరుగుతున్నదానిగా ఈ యుద్ధం ను అర్ధం చేసుకోవాలి.  ఒకప్పటి  సోవియట్ రష్యా  సంయుక్త రాష్ట్రాలు(USSR,) క్యూబా భూభాగం లోనే,  అమెరికా ముంగిట్లో  (డోర్‌స్టెప్) క్షిపణులను  నెలకొల్ప ప్రయత్నం చేసినప్పుడు అమెరికా అధ్యక్షుడు *కెన్నెడీ* దాదాపు ఇదే పని చేశాడని మరచిపోకూడదు.  ఉక్రెయిన్ రష్యాకు చేరువలో ఉన్నందున, అది ఉత్తర అట్లాంటిక్ మిత్ర సమితి *(నాటో- NATO)* సభ్యునిగా మారితే, సమర్థవంతంగా ఈ సైనిక కూటమి రష్యాను చుట్టుముడుతుంది.  కాబట్టి, ఈ యుద్ధాన్ని ప్రేరేపించడానికి పాశ్చాత్య ప్రపంచం / ఉత్తర అట్లాంటిక్ మిత్ర సమితి *(నాటో- NATO)* బాధ్యత వహించాలి.

 ఉక్రెయిన్ కి సంబంధించిన తాజా పరిస్థితులను చర్చిస్తున్నప్పుడు, పుతిన్ తన చర్యను సమర్థించుకోవడానికి మరొక విషయం ను కూడా ఉపయోగిస్తున్నాడు.  అతని ప్రకారం, 'డాన్‌బాస్ పౌరులకు వ్యతిరేకంగా కీవ్ యొక్క దూకుడు చర్యల యొక్క ప్రాథమిక అంచనాలలో వివరించిన ఉక్రెయిన్ చర్యలు', అలాగే మిన్స్క్ ఒప్పందాలను రద్దు చేయాలనే లక్ష్యంతో  సాగుతు దాని దీర్ఘకాలిక విధ్వంసక విధానం ప్రస్తుత సంక్షోభానికి కారణం.    పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్‌ను  ఉత్తర అట్లాంటిక్ మిత్ర సమితి (*నాటో-NATO*)లో చేర్చుకోమనే  హామీని పుతిన్ కోరాడు. అయితే US మరియు ఇతరులు హామీ ఇవ్వడానికి నిరాకరించడంతో, రష్యా దళాలు దాడిని ప్రారంభించాయి.

  ఒక్క రోజు కూడా యుద్ధం కొనసాగడం ప్రపంచ ప్రజల కష్టాలను మరింత తీవ్రతరం చేస్తుంది కనుక, శత్రుత్వాలను వెంటనే ముగించాలని మరియు వివాదాలను పరిష్కరించుకోవడానికి చర్చలు ప్రారంభించాలని సిపిఐ (ఎంఎల్) రెడ్ స్టార్ డిమాండ్ చేస్తున్నది.  అదే సమయంలో, అమెరికా సామ్రాజ్యవాదులు ఇటువంటి అనాగరిక చర్యలకు పాల్పడడాన్ని మేము ఖండిస్తున్నాము, రష్యాపై నాటోను మరింత దూకుడుగా మార్చడం ద్వారా మరియు చుట్టూ ఉన్న సంఘర్షణను తీవ్రతరం చేయడం ద్వారా ఆఫ్ఘనిస్తాన్‌ లో ఇటీవల ఎదుర్కొన్న అవమానకర ఓటమిని అధిగమించడానికి అమెరికా ఉన్మాదంగా వ్యవహరిస్తోంది.  పసిఫిక్‌లోని దక్షిణ చైనా సముద్రంపై ఆధిపత్యం కోసం అమెరికాతో పోరాడుతున్న చైనా సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా బెదిరింపు చర్యలను  అమెరికా తీవ్రతరం చేస్తున్నది. 
  
 తీవ్రమవుతున్న అంతర్-సామ్రాజ్యవాద వైరుధ్యాలు ప్రపంచ సామ్రాజ్యవాద వ్యవస్థ ఎదుర్కొంటున్న సంక్షోభం యొక్క తీవ్రతను ప్రతిబింబిస్తాయి.  యుద్ధాలతో పాటు ప్రజలపై భారం మోపడం ద్వారా దీనిని పరిష్కరించాలని ఇరుపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. సామ్రాజ్యవాద వ్యవస్థను పారద్రోలి సామ్యవాద పురోగమనాలకు మార్గం సుగమం చేసే వరకు యుద్ధం మరియు దోపిడీ కొనసాగుతుందనే వాస్తవాన్ని మరోసారి ఉక్రెయిన్ పరిణామాలు రుజువు చేస్తున్నాయి, 
 
 కెఎన్ రామచంద్రన్, ప్రధాన కార్యదర్శి సిపిఐ(ఎంఎల్) రెడ్ స్టార్.
తెలుగు అనువాదం: మన్నవ హరిప్రసాద్, కేంద్ర కమిటీ సభ్యుడు, ఆంధ్రప్రదేశ్.
 మొబైల్ నెంబర్:93465 08846