తర్వలో 19వేల టీచర్‌ పోస్టుల భర్తీ


` జేఈఈ షెడ్యూల్‌ ఇంటర్‌ పరీక్షల తేదీల్లో మార్పు
` నేటికల్లా ప్రకటిస్తామన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి
హైదరాబాద్‌,మార్చి 14(జనంసాక్షి): తెలంగాణ ఇంటర్‌ పరీక్షల తేదీలపై జేఈఈ మెయిన్స్‌ షెడ్యూల్‌ ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌పై స్పష్టత ఇస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఈ పరిస్థితుల మధ్య ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ మార్చక తప్పని పరిస్థితి ఏర్పడిరదని మంత్రి పేర్కొన్నారు. జేఈఈ మెయిన్‌ మొదటి సెషన్‌ పరీక్ష తేదీలను ఎన్‌టీఏ రీ షెడ్యూల్‌ చేసింది. గతంలో విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం ఏప్రిల్‌ 16 నుంచి 21 మధ్య జేఈఈ పరీక్ష జరగాల్సి ఉన్నది. అయితే అవే తేదీల్లో వివిధ రాష్టాల్ల్రో ఇంటర్‌ పరీక్షలు జరుగనున్నాయి. దీంతో విద్యార్థుల విజ్ఞప్తి మేరకు పరీక్ష తేదీల్లో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ మార్పు చేసింది. తాజాగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఏప్రిల్‌ 21, 24, 25, 29 తేదీల్లో, మే 1, 4 తేదీల్లో జేఈఈ మెయిన్‌ మొదటి సెషన్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. జేఈఈ పరీక్షా తేదీల్లో మార్పు చేసినందున అందుకు అనుగుణంగా ఇంటర్‌ ఎగ్జామ్స్‌ డేట్స్‌ మార్చాల్సి ఉంటుందని చెప్పారు. త్వరలోనే నిర్ణయం తీసుకుని కొత్త షెడ్యూల్‌ ప్రకటించనున్నట్లు చెప్పారు. ఇదిలావుంటే రాష్ట్రంలో త్వరలో 19వేల టీచర్‌ పోస్టుల భర్తీ చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ఉపాధ్యాయ ఖాళీలపై బయట జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని అన్నారు. టీచర్లకు ఇంగ్లీష్‌ విూడియం బోధనకు సంబంధించిన ట్రైనింగ్‌ను వర్చువల్‌గా ప్రారంభించిన సందర్భంగా ఆమె మాట్లాడారు. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్‌ అనేక రంగాల్లో మార్పులకు నాంది పలుకుతున్నారని, అందులో భాగంగా విద్యాశాఖలో కూడా ఎన్నో మార్పులు చేశారని సబిత అన్నారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దుతు న్నామని సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. సర్కారీ బడుల అభివృద్ధికి నిధులు కేటాయించడం తో పాటు ఇంగ్లీష్‌ విూడియం బోధనకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. వచ్చే ఏడాది నుంచి ఒకటి నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లీష్‌ విూడియం బోధన ఉంటుందన్న మంత్రి.. ఇందుకోసం 80వేల మంది టీచర్లకు ట్రైనింగ్‌ ఇస్తున్నామని అన్నారు. కరోనా అనంతరం ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా 3లక్షల మంది విద్యార్థులు జాయిన్‌ అయ్యారని స్పష్టం చేశారు.
త్వరలోనే టెట్‌ పరీక్ష నిర్వహణ
తెలంగాణలో త్వరలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్‌ను నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక ప్రకటన చేశారు. టెట్‌ నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారని ఆమె తెలిపారు. దీంతో త్వరలో టెట్‌ నిర్వహణకు చర్యలు తీసుకుంటామని మంత్రి సబిత వెల్లడిరచారు. అలాగే ఉద్యోగ అభ్యర్థుల కోసం ప్రతి యూనివర్సిటీ పరిధిలో ఫ్రీ కోచింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. యూనివర్సిటీల్లో ప్రొఫెసర్ల నియామకాలను సైతం త్వరలో చేపడతా మన్నారు. మరోవైపు మన ఊరు మన బడి కార్యక్రమం కింద ఎవరైనా స్కూళ్ల అభివృద్ధి కోసం విరాళాలు ఇస్తే వారికి తగిన గుర్తింపు ఇవ్వనున్నట్లు మంత్రి సబిత చెప్పారు. ఫీజుల నియంత్రణ సబ్‌ కమిటీ నివేదిక ఆధారంగా త్వరలో స్కూళ్లలో ఫీజులపై నిర్ణయం తీసుకుంటామని ఆమె ప్రకటించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తామని స్పష్టం చేశారు. బాసర ట్రిపుల్‌ ఐటీలో ఉన్న సమస్యలపై నివేదిక తెప్పించుకున్నా మని.. అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవని సబిత తెలిపారు. దేశవ్యాప్తంగా ఎన్‌ఐటీలు, మెడికల్‌ కాలేజీలు, నవోదయ స్కూళ్లను కేటాయించిన కేంద్రం? తెలంగాణకు మాత్రమే ఏ ఒక్కటి ఇవ్వలేదని మంత్రి సబిత ఆగ్రహం వ్యక్తం చేశారు.