1.కేంద్రం అహంకారపూరిత ధోరణి
` ఇది సమైఖ్యస్పూర్థికి తూట్లు
` తెలంగాణ రైతులను అవమానించిన కేంద్రం
` పాడిరదే పాటగా పీయూష్ గోయల్ తీరు
` ధాన్యం కొనుగోలు విషయంలో స్పష్టత ఇవ్వని కేంద్రమంత్రి
` బిజెపిది దౌర్భాగ్య ప్రభుత్వం తప్ప మరోటి కాదు
` వడ్లను కొనమంటే రా రైస్ అంటూ తప్పించుకున్న కేంద్రం
` సిఎం కెసిఆర్‌తో చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తాం
` పీయూష్‌తో భేటీ తరవాత విూడియాతో మాట్లాడిన మంత్రి నిరంజన్ రెడ్డి
న్యూఢల్లీి,మార్చి 24(జనంసాక్షి): కేంద్రమంత్రి పాతపాటే పాడి తెలంగాణను మరోమారు మోసం చేశారని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో పండిరచిన ధాన్యం కొనుగోళ్ల విషయంలో మడపేచీ పెట్టి గతంలో లాగానే సమాధానం ఇచ్చి తప్పించుకున్నారని మండిపడ్డారు. ఇతంటి దౌర్భాగ్య ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు. హైదరాబాద్ వెళ్లాక సిఎం కెసిఆర్‌తో చర్చించి భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తామని అన్నారు. కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌ను కలిసి ధధాన్యం సేకరణపై చర్చించన తరవాత మంత్రుల బృందం ఢల్లీిలో విూడియాతో మాట్లాడిరది. ఈ సందర్బంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ యాసంగిలో వచ్చే వడ్లను మొత్తం కేంద్రం కొనాల్సిందేనని డిమాండ్ చేశారు. వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్రంపై తెలంగాణ ప్రభుత్వం వత్తిడి పెంచుతోంది. ఈ నేపథ్యంలోనే కేంద్రమంత్రి పీయూష్‌గోయల్‌తో తెలంగాణ మంత్రులు నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్, ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్ భేటీ అయ్యారు. కేంద్రం తీరు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని తప్పుబట్టారు. తమది రైతు వ్యతిరేక ప్రభుత్వమని కేంద్రమంత్రి అనడాన్ని తప్పు పట్టారు. తమకన్నా ముందే ఆయన విూడియాతో మాట్లాడడాన్నికూడా తప్పుపట్టారు. 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నందుకు రైతు వ్యతిరేకులమా?.. రైతుబంధు, సాగునీరు ఇస్తున్నందుకు రైతు వ్యతిరేకులమా?.. పంటలు కొనకుండా ఇబ్బందులు పెడతారా? అని ప్రశ్నించారు. కరోనా సమయంలో పేదలకు 60 కిలోల బియ్యం ఇవ్వాల్సిందేనని తెలిపారు. వరి సాగు తగ్గించాలని తామంటే.. బీజేపీ పెంచాలని చెప్పిందని గుర్తుచేశారు. వడ్లను వడ్లలాగా తీసుకోవాలని అంటే కేంద్రమంత్రి గోయల్ అవహేళనగా మాట్లాడారని తప్పుబట్టారు. బఫర్ స్టాక్ పెట్టుకోవచ్చు కదా అంటే గోయల్ నవ్వుతున్నారని, తెలంగాణ రైతులకు కూడా క్షమాపణ చెప్పేరోజు వస్తుందని నిరంజన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలకు కేంద్రం అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం క్షమాపణలు చెప్పే పరిస్థితి వస్తుంది. ఈ పరాభవాన్ని తెలంగాణ ప్రజలు మర్చిపోరని అన్నారు. ఏ అంశంలోనూ నవ్యత్వం లేదు. కేంద్ర ప్రభుత్వానికి వ్యాపారధోరణితో వ్యవహరించడం తప్పితే, సంక్షేమం గురించి ఆలోచించే మనసే లేదు. ముఖ్యమంత్రి ఆలోచించి తదుపరి కార్యాచరణ ఖరారు చేస్తాం. అయితే, ఏది ఏమైనా, రైతుల ప్రయోజ నాలను మా ప్రభుత్వం పరిరక్షిస్తుంది. తెలంగాణ రైతులు అధైర్యపడవద్దన్నారు. రైతులు పండిరచిన వడ్ల కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరు ఏ మాత్రం మారలేదని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వడ్ల కొనుగోలు భాధ్యత కేంద్రానిదే అయినప్పటికీ రాష్టాల్రపైనే నెడుతున్నారని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు చేయాల్సిన కేంద్రం బాధ్యతను రాష్టాల్రపైకి నెడుతున్నారని, రాష్ట్రమే వడ్లు కొనుగోలు చేయాలంటే ఎలా సాధ్యమని, రాష్టాల్రకు స్టోరేజీ కోసం ఏం వ్యవస్థ ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఫెడరలిజం అనే మాటకు అర్థం లేకుండా చేస్తోందని, పదేండ్ల క్రితం మోడీ మాట్లాడిన మాటలకు ఈ రోజు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. నాటి యూపీఏ ప్రభుత్వం ఇతర పార్టీల ప్రభుత్వం ఉన్న రాష్టాల్రను నిర్లక్ష్యం చేసిందని మోడీ ఆరోపించారని, ఈ రోజు మోడీ సర్కారు కూడా ఎన్డీయే మిత్రపక్షాలు కాని ప్రభుత్వాలున్న రాష్టాల్రకు అన్యాయం చేస్తోందని అన్నారు. కేంద్రం తీరు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని అన్నారు. ధాన్యం సేకరణ బాధ్యత కేంద్రానిదే అని, రైతుల నుంచి వడ్లు తీసుకుని మిల్లర్లతో కేంద్రమే బియ్యం పట్టించు కోవాలని ఆయన అన్నారు. కానీ రాష్టాల్రే వడ్లు కొని కేంద్రానికి బియ్యం ఇవ్వాలని పీయూష్ గోయల్ చెప్పడం విడ్డూరంగా ఉందని నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. మార్కెట్ లో అమ్ముడుపోయే ధాన్యమే కొంటామని కేంద్రం చెబుతోందని, ఇదేం నీతి అని ప్రశ్నించారు. కేంద్ర సర్కారులో వ్యాపార కోణం తప్ప రైతు సంక్షేమ కోణం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వచ్చేదే బాయిల్డ్ రైస్ అంటే ఎంతసేపు ఆయన రా రైస్ ఎంతిస్తారో చెప్పాలని అంటారే తప్ప మరో మాట మాట్లాడం లేదని అన్నారు. తెలంగాణ లో ఉన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా యాసంగిలో పండే ధాన్యంలో నూక ఎక్కువగా వస్తుందని అన్నారు. కేంద్రం మంత్రి చెప్పిందే చెప్పి.. మన రాష్ట్ర రైతులను అవమానించేలా మాట్లాడారని అన్నారు. 2022 కల్లా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పిన బీజేపీ సర్కారు.. ఇయ్యాల కనీసం రైతులు పండిరచిన పంటను కొనుగోలు చేయలేని స్థితిలో ఉందన్నారు. చిన్న సన్నకారు రైతులకు పెన్షన్ ఇస్తామని చెప్పారని, కానీ ఆ హావిూని నేటికీ అమలు చేయలేదని అన్నారు. అగ్రి చట్టాలను తెచ్చి రైతుల నిరసనలతో వాటిని వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. విూడియా సమావేశంలో మంత్రలుతో పాటు ఎంపిలు కూడా పాల్గొన్నారు.
2.మీరు అధికారంలోకి వచ్చి విధానాలు మార్చండి
` ధాన్యం కొనమంటే కొనం: పియూష్‌గోయల్
` మీడియా సమావేవానికి కిషన్‌రెడ్డి గైర్హాజరు
న్యూఢల్లీి,మార్చి 24(జనంసాక్షి):తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర ఆహార పౌర సరఫరాలశాఖ మంత్రి పీయూష్ గోయల్ నిప్పులు చెరిగారు. రైతులను అడ్డం పెట్టుకుని సీఎం కేసీఆర్ రాజకీయం చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. రా రైస్ ఎగుమతిపై తెలంగాణ ప్రభుత్వం ఎన్నిసార్లు అడిగినా స్పష్టతనివ్వడం లేదని పీయూష్ గోయల్ అన్నారు. పార్లమెంటులోని మంత్రి ఛాంబర్‌లో తెలంగాణా మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ భేటీ అయ్యారు. దాదాపు 40 నిమిషాలపాటు సమావేశం జరిగింది. అనంతరం పీయూష్ గోయల్ విూడియాతో మాట్లాడారు. పంజాబ్‌లో మాదిరిగానే తెలంగాణలోనూ బియ్యం సేకరణ జరుగుతోంది. అన్ని రాష్టాల్ర మాదిరిగానే రా రైస్ కూడా కొంటాం. రా రైస్ ఎంత ఇస్తారనేదానిపై తెలంగాణ ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంలేదన్నారు. మిగతా రాష్టాల్రన్నీ స్పష్టతనిచ్చాయి. టీఆర్‌ఎస్ అబద్దాలు చెబుతూ రైతులను మోసం చేస్తున్నదని అన్నారు. ఎలాంటి వివక్ష లేకుండా దేశమంతటా బియ్యం సేకరణ చేస్తోందని పీయూష్ గోయల్ చెప్పారు. అన్ని రాష్టాల్ర మాదిరిగానే తెలంగాణ నుంచి రా రైస్ సేకరణ జరుగుతోందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడిరచారు. కేసీఆర్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని ఆయన విమర్శించారు. ఒప్పందం ప్రకారమే ఎఫ్‌సీఐ ద్వారా ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ పట్ల తమకు ఎలాంటి వివక్ష లేదన్నారు. తెలంగాణ నేతలు తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్న కేంద్ర మంత్రి.. ప్రజలను అక్కడి ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు. తెలంగాణ రైతులకు బాసటగా ఉంటామని కేంద్ర మంత్రి అన్నారు. తెలంగాణ పట్ల మాకు ఎలాంటి వివక్ష లేదు. తెలంగాణ నేతలు మాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. తెలంగాణ ప్రజలను అక్కడి ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోంది.తెలంగాణ రైతులకు బాసటగా ఉంటాం. ముడిబియ్యం సేకరణకు తెలంగాణ సహా అన్ని రాష్టాల్రతో ఒప్పందం. పంజాబ్‌తో అనుసరిస్తున్న విధానమే తెలంగాణలోనూ అమలు చేస్తాం. పంజాబ్, తెలంగాణ రెండు మాకు సమానమే. ఏపీ 25లక్షల మెట్రిక్ టన్నుల ముడిబియ్యం ఇచ్చింది. కేసీఆర్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం. మోడీ ప్రభుత్వం తెలంగాణ రైతులపై ఎలాంటి వివక్ష చూపడం లేదు. రైతుల పట్ల నేతలు నిజాయితీగా ఉండాలి. కేంద్రం రైతులకు చేయాల్సింది చేస్తుంది. రైతులపై తెలంగాణ ప్రభుత్వానికి ప్రేమ ఉంటే విూ బాధ్యత నెరవేర్చండి. ముడిబియ్యం సరఫరా చేస్తామని తెలంగాణ లిఖితపూర్వకంగా వెల్లడిరచింది. తెలంగాణ అవసరాలు పోగా మిగిలిన ముడిబియ్యం తీసుకునేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. తెలంగాణపై మాకు ఎలాంటి వివక్ష లేదు. పంజాబ్ తరహాలోనే తెలంగాణ నుంచి బియ్యం సేకరణ చేస్తాం. తెలంగాణ రైతులను కొందరు తప్పుదారి పట్టిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం నిజాయితీతో వ్యవహరించాలి. తెలంగాణ లిఖితపూర్వకంగా ఇచ్చిన ఒప్పందానికి కట్టుబడి ఉండాలని కేంద్రమంత్రి అన్నారు. ధాన్యం సేకరణపై తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలన్నారు. ఏపీ కూడా 25లక్షల మెట్రిక్ టన్నుల ముడిబియ్యం ఇస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ముడిబియ్యం సప్లై విూద ఇప్పటివరకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఫిబ్రవర 25న అన్ని రాష్టాల్రను పిలిచి, ఎవరెంత ఇస్తారో అడిగాం. అన్ని రాష్టాల్రు సమాచారం ఇచ్చినా, తెలంగాణ మాత్రం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. సమాచారం ఇవ్వకుండా రైతులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం. మోడీ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉంది.
3.ప్రజలంటే మోడీకి లెక్కలేదు
` ఎప్పుడూ వారి గురించి ఆలోచించరు
` కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ ధ్వజం
న్యూఢల్లీి,మార్చి 24(జనంసాక్షి): ప్రజలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పట్టించుకోరని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గురువారం ఆరోపించారు. ప్రజలు, కార్మికులు లేదా కోవిడ్`19 రోగుల పట్ల మోదీకి శ్రద్ధ లేదన్నారు. కోవిడ్ రోగులకు ఉచిత చికిత్స అందలేదని, గడచిన రెండేళ్ళలో ఆత్మహత్యల సంఖ్య పెరిగిందని చెప్తున్న వార్తా కథనాలను ప్రస్తావించారు. రాహుల్ గాంధీ ఇచ్చిన ట్వీట్‌లో, కోవిడ్ బాధితులకు ఉచితంగా చికిత్స చేశారా? లేదు. పేదలకు, కార్మికులకు కనీస ఆదాయం ఉందా? లేదు. చిన్న తరహా పరిశ్రమలు మునిగిపోకుండా కాపాడారా? లేదు. పీఎం పట్టించుకోరని పేర్కొన్నారు. గడచిన రెండేళ్ళలో ఆర్థిక ఒడుదొడుకుల వల్ల ఆత్మహత్యల సంఖ్య పెరిగిందని, ఆయుష్మాన్ భారత్ పథకం క్రింద కోవిడ్ రోగులకు ఉచిత చికిత్స అందలేదని చెప్తున్న వార్తా కథనాలను జత చేశారు. రాహుల్ ట్వీట్ చేసిన వార్తా కథనాల్లో తెలిపిన వివరాల ప్రకారం, కోవిడ్`19 మహమ్మారి కారణంగా భారత దేశంలో అనేక మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఆర్థిక ఒడుదొడుకుల వల్ల ఆత్మహత్యల సంఖ్య పెరిగింది. ఎంతో గొప్పగా ప్రచారమవుతున్న ఆరోగ్య బీమా పథకం ఆయుష్మాన్ భారత్ పేదల ఆసుపత్రి బిల్లుల చెల్లింపుల్లో విఫలమైంది. కోవిడ్ కారణంగా ఆసుపత్రిలో చేరినవారిలో కేవలం సుమారు 12 శాతం మందికి మాత్రమే ఈ పథకం క్రింద ఉచిత వైద్యం అందింది.
4.తెలంగాణలో రూ.1000 కోట్ల పెట్టుబడి
` ముందుకొచ్చిన ఫిష్ ఇన్ కంపెనీ
` సుమారు 5000 మందికి ఉద్యోగాలు
` మంత్రి కేటీఆర్ సంస్థ ప్రతినిధుల సమావేశం
` హైదరాబాద్‌లో ప్రపంచ ప్రఖ్యాత మెడికల్ డివైసెస్ తయారీ కంపెనీ కన్ఫ్లోయాంట్ మెడికల్ యూనిట్
వాషింగ్గన్,మార్చి 24(జనంసాక్షి):ప్రపంచంలోనే అత్యధికంగా తిలాపియా చేపలను ఎగుమతి చేసే ప్రతిష్టాత్మక కంపెనీ ఫిష్ ఇన్ తెలంగాణ లో భారీ ఎత్తున పెట్టుబడి పెట్టేందుకు నిర్ణయం తీసుకుంది. ఈరోజు అమెరికాలో మంత్రి కే తారకరామారావు తో జరిగిన సమావేశంలో కంపెనీకి చెందిన చైర్మన్ మరియు సిఇఓ మనీష్ కుమార్ ఈ మేరకు కంపెనీ నిర్ణయాన్ని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 1000 కోట్ల రూపాయలతో పూర్తిస్థాయి ఇంటిగ్రేటెడ్ ఫ్రెష్ వాటర్ ఫిష్ కల్చర్ సిస్టం ని డెవలప్ చేసేందుకు కంపెనీ నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్ మానేరు రిజర్వాయర్ వద్ద ఈ మేరకు కంపెనీ తన కార్యకలాపాలను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ప్రారంభించనుంది. ఫిష్ ఇన్ కంపెనీ చేపల ఉత్పత్తిలో హ్యచరీలు, దాణా తయారీ, కేజ్ కల్చర్, ఫిష్ ప్రాసెసింగ్ మరియు ఎగుమతుల వంటి అనేక విభాగాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తామని కంపెనీ సీఈఓ మనీష్ కుమార్ తెలిపారు. కంపెనీ పూర్తిస్థాయి కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత సుమారు 85 వేల మెట్రిక్ టన్నుల చేపలను ప్రతి సంవత్సరం రాష్ట్రం నుంచి ఎగుమతి చేసే అవకాశం ఉందని తెలిపారు. భారీ పెట్టుబడిని తెలంగాణలో పెట్టనున్న ఫిష్ ఇన్ కంపెనీకి మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ పెట్టుబడి తో తెలంగాణ రాష్ట్రంలో మత్స్య పరిశ్రమ కి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నైపుణ్యం అంది వస్తుందన్న ఆశాభావాన్ని మంత్రి కేటీఆర్ వ్యక్తం చేశారు. ఈ పెట్టుబడి ద్వారా సుమారు 5,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. అధికంగా ఉన్న తెలంగాణ యువతకు ముఖ్యంగా మత్స్య పరిశ్రమ పై ఆధారపడిన వారికి, మిడ్ మానేరు నిర్వాసితులకు ప్రాధాన్యత ఇవ్వాలని కంపెనీకి సూచించారు. చేపల పెంపకానికి సంబంధించి ఇప్పటికే వారి వద్ద ఉన్న నైపుణ్యాన్ని కంపెనీ ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా కేటీఆర్ కంపెనీ సీఈవో మనీష్ కి సూచించారు.ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ డైరెక్టర్ అఖిల్ పాల్గొన్నారు
హైదరాబాద్ లో ప్రపంచ ప్రఖ్యాత మెడికల్ డివైసెస్ తయారీ కంపెనీ కన్ఫ్లోయాంట్ మెడికల్ యూనిట్
ప్రపంచ ప్రఖ్యాత మెడికల్ డివైజెస్ తయారీ కంపెనీ కన్ఫ్లోయాంట్ మెడికల్ సంస్థ హైదరాబాద్ లో తన తయారీ యూనిట్ ని ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. త్వరలో పైలట్ ప్రాతిపదికన ఒక తయారీ యూనిట్ ని మొదలు పెట్టి 12 నెలల్లో దాని భారీగా విస్తరించేందుకు కంపెనీ నిర్ణయం తీసుకుంది. కంపెనీ నింతోల్ ఉత్పత్తుల తయారీ కోసం అగ్రశ్రేణి సాంకేతిక పరిజ్ఞానాన్ని హైదరాబాద్ నగరానికి తీసుకురానుంది. దేశంలో ఈ స్థాయి టెక్నాలజీతో ఉత్పత్తులను తయారు చేసే మొదటి కంపెనీ కన్ఫ్లోయాంట్ మెడికల్ గా నిలవనున్నది. దేశంలోని మెడికల్ డివైసెస్ తయారీ కంపెనీలకు తన ఉత్పత్తుల ఆధారంగా సేవలను అందించనుంది. హైదరాబాదులో స్థాపించబోయే తన తయారీ యూనిట్ ద్వారా భారతదేశంతో పాటు ఆసియా ఖండంలోని తన ఖాతాదారులకు తన ఉత్పత్తులను సరఫరా చేయనున్నది.కన్ఫ్లోయాంట్ మెడికల్ సంస్థ అధ్యక్షులు మరియు సీఈవో అయిన డీన్ షావర్(ఆవజీని ూఞష్ట్రజీబీవతీ) ఈరోజు అమెరికాలోని శాన్ హో నగరంలో మంత్రి కేటీఆర్ తో సమావేశం అయ్యి తమ సంస్థకు సంబంధించిన యూనిట్ ఏర్పాటు ప్రకటనను చేశారు. భారతదేశానికి తొలిసారిగా అత్యంత ఆధునాతన టెక్నాలజీ ని తీసుకురావాలన్న లక్ష్యంతో హైదరాబాద్ నగరాన్ని తమ గమ్యస్థానంగా ఎంచుకున్నామని, భవిష్యత్తులో తమ కంపెనీని భారీగా విస్తరించే ప్రణాళికలు తమ వద్ద ఉన్నాయని మంత్రి కేటీఆర్ కి తెలిపారు. త్వరలోనే తమ కంపెనీ బయోమెడికల్ టెక్స్టైల్ సేవలకు సంబంధించి ప్రణాళికలను ప్రకటిస్తామని తెలిపారు. తమ తయారీ యూనిట్ ఏర్పాటు కోసం హైదరాబాద్ నగరాన్ని ఎంచుకున్న కన్ఫ్లోయాంట్ మెడికల్ టెక్నాలజీ సంస్థకు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. తమ ప్రభుత్వం మెడ్ టెక్ ప్రధాన రంగాల్లో మెడ్ టెక్ రంగం ఒకటని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ సంస్థ తయారీ ప్లాంట్ యూనిట్ కి సంబంధించి అన్ని రకాల సహాయ సహకారాలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందిస్తామని భవిష్యత్తులో సంస్థతో తెలంగాణ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా పని చేద్దామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ సమావేశంలో మంత్రి కే. తారకరామారావుతో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయెష్ రంజన్, డైరెక్టర్ లైఫ్ సైన్సెస్ శక్తి నాగప్పన్ లు పాల్గొన్నారు.జూశ్రీబ నినీబివ... (సంస్థ ఏర్పాటు చేయనున్న మెడికల్ డివైస్ యూనిట్ తర్వాత తమ విస్తరణకు సంబంధించిన ఆర్థికపరమైన పెట్టుబడి వివరాలను ప్రకటించనుంది, తమ విస్తరణ ప్రణాళికలకు హైదరాబాద్ నగరాన్ని ఎంచుకున్నట్లు కంపెనీ తెలిపింది)ఫార్మ, లైఫ్ సైన్సెస్ పరిశ్రమకు చెందిన కీలక కంపెనీల ప్రతినిధులతో అమెరికాలో మంత్రి కే. తారక రామారావు రౌండ్ టేబుల్ సమావేశంమంత్రి కే. తారకరామారావు ఈరోజు ఫార్మ, లైఫ్ సైన్సెస్ పరిశ్రమకు చెందిన కీలక కంపెనీల ప్రతినిధులతో అమెరికాలో ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్ తెలంగాణలోని లైఫ్ సైన్సెస్ మరియు బయోటెక్నాలజీ రంగాల్లో ఉన్న అవకాశాలపైన ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. హైదరాబాద్ నగరంలో పరిశోధన మరియు అభివృద్ధి, డిజిటల్, టెక్ కేంద్రాల ఏర్పాటు, తయారీ కార్యకలాపాలకు సంబంధించి అనేక అవకాశాలు ఉన్నట్లు మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ సమావేశానికి హాజరైన పలు కంపెనీల ప్రతినిధులు మంత్రి కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పట్ల సానుకూలంగా స్పందించి తమ భవిష్యత్తు కంపెనీల, విస్తరణ పెట్టుబడుల విషయంలో తెలంగాణను సానుకూలంగా పరిశీలిస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం లో లైఫ్ సైన్సెస్ ఫార్మా రంగంలో అభివృద్ధి మరియు పరిశోధన ఇన్నోవేషన్ వంటి రంగాల్లో అద్భుతమైన నిర్ణయాలతో పాటు మౌలిక వసతుల కల్పన చేస్తున్నామని ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ నగరంలో ఉన్న జీనోమ్ వ్యాలీ, మెడికల్ డివైసెస్ పార్క్,త్వరలో ప్రారంభం కానున్న హైదరాబాద్ ఫార్మాసిటీ వంటి ఈ ప్రాంతాల్లో ఈ రంగానికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. మంత్రి కేటీఆర్ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కి సమావేశానికి హాజరైన వివిధ ప్రముఖ కంపెనీల ప్రతినిధుల నుంచి అత్యంత సానుకూల స్పందన లభించింది. ఈ సమావేశంలో మంత్రి కే. తారకరామారావుతో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయెష్ రంజన్, డైరెక్టర్ లైఫ్ సైన్సెస్ శక్తి నాగప్పన్ లు పాల్గొన్నారు
5.దేశం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నా!
` కొల్హాపూర్ అమ్మవారిని దర్శించుకున్న సీఎం కేసీఆర్
హైదరాబాద్,మార్చి 24(జనంసాక్షి): దేశంలోని శక్తి పీఠాల్లో ఒకటైన కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారిని సీఎం కేసీఆర్ దర్శించుకున్నారు. అమ్మవారికి ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్‌కు.. అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనానంతరం సీఎం కేసీఆర్ దంపతులకు ఆశీర్వచనం అందించారు. ఉదయం ప్రత్యేక విమానంలో ఆయన కొల్హాపూర్ చేరుకున్నారు. సిఎం వెంట ఎంపి సంతోష్ కుమార్ తదితరులు ఉన్నారు. సాయంత్రం హైదరాబాద్‌కు బయలుదేరారు. లక్ష్మీదేవికి ప్రత్యేకించి వున్న ఆలయాలలో కొల్హాపూర్ ఆలయం ముఖ్యమైంది. అమ్మవారి అష్టాదశ శక్తి పీఠాలలో ఏడవదిగా చెప్పుకునే ఈ ఆలయాన్ని ప్రతియేటా లక్షలాది భక్తులు దర్శించుకుని ఆమె దీవెనలను కోరుకుంటారు. చాలా రోజుల నుంచి నేను ఈ కోవెలకు వద్దామని.. అమ్మ ఆశీస్సులు తీసుకుందామని అనుకుంటున్నాను. ఇప్పటికి కుదిరింది. దేశం అభివృద్ధి పథంలో సాగాలని.. రైతులు ఆనందంగా ఉండాలని.. ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని అమ్మను కోరుకున్నాననని కెసిఆర్ అన్నారు.
6.రష్యా మాపై పాస్ఫరస్ బాంబులు ప్రయోగిస్తోంది
` ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపణ
కీవ్,మార్చి 24(జనంసాక్షి):ఉక్రెయిన్పై సరిగ్గా నెల రోజుల క్రితం మొదలైన రష్యా దండయాత్ర నానాటికీ మరింత తీవ్రంగా మారుతోంది. ఆ దేశాన్ని హస్తగతం చేసుకునేందుకు క్రెమ్లిన్ విశ్వప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. ఉక్రెయిన్ మాత్రం లొంగట్లేదు. ఈ నేపథ్యంలోనే రష్యా తమపై రసాయన దాడులకు దిగుతోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. తమ పౌరులపై పాస్ఫరస్ బాంబులను ప్రయోగిస్తోందని మండిపడ్డారు. అమెరికా నేతృత్వంలో జరుగుతోన్న నాటో కూటమి సమావేశంలో జెలెన్స్కీ నేడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భావోద్వేగ ప్రసంగం చేశారు. ‘‘ఈ ఉదయం మా దేశ ప్రజలపై పాస్ఫరస్ బాంబులు ప్రయోగించారు. పెద్దలు, చిన్నారులు ఎంతోమంది చనిపోతున్నారు. మా ప్రజలు, మా నగరాలను కాపాడుకునేందుకు ఉక్రెయిన్కు ఎలాంటి పరిమితులు లేని సైనిక సహకారం కావాలి. ఎలాగైతే రష్యా ఎలాంటి పరిమితులు లేకుండా మాపై అన్ని ఆయుధాలను ప్రయోగిస్తుందో అలాంటి సహకారం నాటో నుంచి కావాలి. ప్రజలను కాపాడేందుకు ఈ కూటమి ఏం చేయగలదో నాటో ఇంకా చెప్పట్లేదు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రక్షణ కూటమి అని నాటో నిరూపించుకోవాలి. దీని కోసం యావత్ ప్రపంచం.. ముఖ్యంగా ఉక్రెయిన్ ఎదురుచూస్తోంది’’ అని జెలెన్స్కీ చెప్పుకొచ్చారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో పాటు నాటో దేశాల నేతలు నేడు నాటో ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యారు. ఉక్రెయిన్ సంక్షోభం ప్రధాన అజెండాగా ఈ భేటీ జరుగుతోంది. ఉక్రెయిన్పై ఆక్రమణకు దిగిన రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించే దిశగా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఉక్రెయిన్పై దండయాత్ర చేపట్టి పుతిన్ చాలా పెద్ద తప్పు చేశారని నాటో చీఫ్ జెన్స్ స్టోల్టెన్బర్గ్ సమావేశానికి ముందు అన్నారు.
7.జూన్ 12న టెట్..
` నోటిఫికేషన్ విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్,మార్చి 24(జనంసాక్షి):ఉపాధ్యాయుల నియామకానికి ముందు నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్ను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. మార్చి 26 నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. జూన్ 12న టెట్ పరీక్ష జరుగుతుంది. టెట్ను సాధ్యమైనంత త్వరగా నిర్వహించాలని విద్యాశాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా బుధవారం పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలిని ఆదేశించిన విషయం తెలిసిందే. టెట్కు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో పరీక్ష నిర్వహణకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. స్పందించిన పాఠశాల విద్యాశాఖ తాజాగా టెట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది.2015 డిసెంబరు 23న టెట్కు సంబంధించి జారీ చేసిన జీఓ 36లో ప్రధానంగా రెండు సవరణలు చేస్తూ ప్రభుత్వం తాజాగా జీఓ 8 ఇచ్చింది. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) మార్గదర్శకాల ప్రకారం ఈ మార్పులు చేశారు. పాఠశాల విద్యాశాఖలో 13,086 కొలువులను భర్తీ చేస్తామని ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో 10 వేల వరకు ఉపాధ్యాయ కొలువులు ఉన్నాయి. అందులో ఎస్జీటీ కొలువులు 6,700 వరకు ఉంటాయి. ఆదర్శ పాఠశాలల ఖాళీలూ కలుపుకొంటే గరిష్ఠంగా 11 వేల వరకు ఉండొచ్చని చెబుతున్నారు. మే నెలలోనే టెట్ నిర్వహించవచ్చని తెలుస్తోంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత టెట్ నిర్వహించడం ఇది మూడోసారి. గతంలో 2016 మే, 2017 జులైలో ఆ పరీక్ష జరిపారు.
8.పెట్రోమంటపై భగ్గుమన్న టీఆర్‌ఎస్
` రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు,నిరసనలు
` ఖాళీ గ్యాస్ సిలండర్లతో రోడ్లపై మహిళల నిరసనలు
` రోడ్లపైనే వంటా వార్పుతో ఆందోళనలు
` మోడీకి వ్యతిరేకంగగా మిన్నంటిన నినాదాలు
హైదరాబాద్,మార్చి 24(జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వం డీజిల్, పెట్రోల్ వంట గ్యాస్ ధరలను ఇబ్బడి, ముబ్బడిగా పెంచడంపై సామాన్య జనం భగ్గుమంటున్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న వేళ తెలంగాణ వ్యాప్తంగా మహిళలు ఆందోళనలకు దిగారు. టిఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ధరలు పెంచడంపై ఖాళీ గ్యాస్ సిలండర్లతో రోడ్లపై నిరసనలకు దిగారు. రోడ్లపైనే వంటా వార్పు చేపట్టి తమ ఆందోళనలు కొనసాగించారు. ట్రాక్టర్లకు తాళ్లు కట్టి లాగారు. టీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలు ఆందోళనలు చేపట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. పెంచిన ధరలు తగ్గించే వరకు ఉద్యమిస్తామని నినదించారు. పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని చేపట్టిన ధర్నాల్లో మంత్రులు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ మేరకు పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు నిరసనగా సికింద్రాబాద్ చీఫ్ రేషనింగ్ అధికారి కార్యాలయం వద్ద టీఆర్‌ఎస్ పార్టీ ధర్నా చేపట్టింది. ధర్నాలో మంత్రులు మహ్మూద్‌అలీ, తలసాని శ్రీనివాసయాదవ్, ఎమ్మెల్సీ కవిత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీకి,బిజెపికి వ్యతిరేకంగా నినాదాలు మిన్నంటాయి. ధర్నాలో కవిత మట్లాడుతూ తెలంగాణ ఆడబిడ్డల తరఫున బండి సంజయ్ ఢల్లీి వెళ్లి కొట్లాడాలన్నారు. రాష్ట్ర ప్రజలను రోడ్లపైకి తెచ్చిన ఘనత మోదీ సర్కార్‌కు దక్కుతుందన్నారు. జీడీపీ పెంచమంటే.. కేంద్ర ప్రభుత్వం గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచుతున్నదని విమర్శించారు. తెలంగాణ రైతులు ఆందోళనలో ఉన్నారని చెప్పారు. మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు 2014లో పెట్రోల్ ధర రూ.60 ఉండేదని, ఆరోజు క్రూడాయిల్ ధర ఇంకా చాలా తక్కువ ఉందని చెప్పారు. ఈ రోజు ముడిచమురు ధర తక్కువ ఉన్నప్పటికీ పెట్రోల్ ధరలు పెంచారని విమర్శించారు. ఆయిల్ సబ్సిడీలు ఎత్తివేసి రూ.23 లక్షల కోట్లు కూడబెట్టుకున్నారని తెలిపారు. డ్వాక్రా మహిళలు, రైతులకు ఒక్క రూపాయి రుణమాఫీ చేయలేదు కానీ.. రూ.11 లక్షల కోట్ల కార్పొరేట్ రుణాలు మాఫీ చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజా ఉద్యమాలకు మోదీ ప్రభుత్వం లొంగక తప్పదన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతరం పోరాడుతామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలతో మనల్ని రోడ్లపైకి తీసుకువచ్చిందని ఎమ్మెల్సీ కవిత విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రజలను రోడ్లపైకి తీసుకువచ్చిన ఘనత మోడీ సర్కార్‌కు దక్కుతుందన్నారు. తెలంగాణ లో రైతులు ఆందోళనలో ఉన్నారని తెలిపారు. బీజేపీ నేతలు అనేక మాటలు చెబుతున్నారని... ధాన్యం సేకరణపై మాత్రం మాట్లాడ్డం లేదని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమం తర్వాత ఇదే మొదటిసారి మళ్ళీ మనం రోడ్లు ఎక్కడం అని తెలిపారు. బీజేపీ నేతలు అనేక మాటలు చెబుతున్నారు.. కానీ, ధాన్యం సేకరణ పై మాత్రం మాట్లాడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద, పెద్ద మాటలు మాట్లాడుతున్నారంటూ బండి సంజయ్‌పై మండిపడ్డ ఆమె.. వాళ్లను, వీళ్లను జైలులో పెట్టిస్తా అంటాడు.. దమ్ము ఉంటే కేంద్రం నుంచి సిలిండర్ పై తెలంగాణకు సబ్సిడీపై ప్రత్యేక ప్యాకేజి ఇప్పించాలని సూచించారు.. పేద ప్రజలకు మోడీ సర్కార్ ఏమి చేయలేదని విమర్శించిన కవిత.. పెద్ద పెద్ద వాళ్లకు రుణమాఫీ చేసింది మోడీ సర్కార్ అని.. అంబానీ, ఆదానీలకు, దేశం విడిచివెళ్లిన విజయ్ మాల్యాకు మాత్రమే రుణమాఫీ జరిగిందంటూ ఎద్దేవా చేశారు.. ప్రజా ఉద్యమ నిర్మాణం పటిష్టంగా చేస్తే ఈ కేంద్ర సర్కార్ దిగివస్తుందని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతర పోరాటం చేద్దామని ఎమ్మెల్సీ కవిత సూచించారు. బిజెపి,మోడీ హఠావో అంటూ నినాదాలు ఇచ్చారు.
9.విద్యుత్‌ఛార్జీలపెంపుపై విపక్షాల నిరసన
` ధరల పెంపుతో ప్రజలపై అధిక భారం
హైదరాబాద్,మార్చి 24(జనంసాక్షి): కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల దగ్గర నుంచి మధ్యతరగతి వరకు ఎవ్వరినీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం వదిలిపెట్టడం లేదని మండిపడ్డారు. విద్యుత్ ఛార్జీల పెంపుతో అందరికీ ప్రభుత్వం షాక్ ఇచ్చిందన్నారు. ఇటు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం డీజిల్, గ్యాస్,పెట్రోల్ వాతలు పెడుతోందన్నారు. దొంగేదొంగ అన్నట్టుగా పెట్రోల్ ధరల పెరుగుదలపై టీఆర్‌ఎస్ ఆందోళనలు చేయడం సిగ్గుచేటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.కేసీఆర్ గ్దదె దిగడం ఖాయమన్న అర్థం వచ్చేలా బై బై కేసీఆర్ అంటూ రేవంత్ ట్విట్టర్ లో హాష్ ట్యాగ్ జత చేశారు. ఇదిలావుంటే తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై రైతులు ఆందోళనకు గురవుతున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు పేర్కొన్నారు. వరి కొనుగోళ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయన్నారు. కేంద్రంపై సీఎం కేసీఆర్ రాజకీయ పట్టుదలకు పోవద్దన్నారు. కొనుగోళ్లు ఆలస్యం చేయడంతో దళారులు లాభపడుతున్నారన్నారు. కేసీఆర్ తక్షణమే రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని వీహెచ్ డిమాండ్ చేశారు.తెలంగాణ ప్రభుత్వం పేదల నడ్డి విరుస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ చార్జీల పెంపుతో ప్రజలపై అధిక భారం మోపారన్నారు. డిస్కంలకు రూ.48 వేల కోట్ల బకాయిలు చెల్లించక పోవడం దారుణమని మండిపడ్డారు. ప్రభుత్వ శాఖలు వాడుకునే విద్యుత్‌కు బిల్లులు చెల్లించడంలేదని... మరోవైపు పాతబస్తీలో బిల్లులు వసూలు చేసే దమ్ము లేదని యెద్దేవా చేశారు. ఈ లోటును పూడ్చుకు నేందుకు ప్రజలపై భారం మోపడం సరికాదన్నారు. విద్యుత్ చార్జీలు తగ్గించే వరకు బీజేపీ పోరాడు తుందని స్పష్టం చేశారు. దీనిపై శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని బండి సంజయ్ పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి పోయే కాలం దాపురించిందని, అందుకే ప్రజలపై కరెంట్ ఛార్జీల భారం మోపుతోందని బండి సంజయ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కరెంట్ ఛార్జీలను పెంచడాన్ని వ్యతిరేకిస్తూ బండి సంజయ్ పత్రికా ప్రకటన విడుదల చేశారు. కరెంట్ ఛార్జీల పెంపుతో రాష్ట్ర ప్రజలపై ఏకంగా 6 వేల కోట్ల రూపాయల భారాన్ని మోపడం దారుణమన్నారు. పాతబస్తీలో కరెంటు బిల్లులు వసూలు చేయడం చేతగాని కేసీఆర్ ఫ్రభుత్వం ఆ భారాన్ని సామాన్యులపై మోపడం అన్యాయమని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం డిస్కమ్‌లకు రూ.48 వేల కోట్ల బకాయిలు ఇంతవరకు చెల్లించకపోవం దారుణమన్నారు. అట్లాగే డిస్కంలకు వినియోగదారులు చెల్లించాల్సిన కరెంట్ బకాయిలు రూ.17 వేల కోట్లుండగా.. అందులో ప్రభుత్వ శాఖలకు చెందిన బకాయిలే రూ.12,598 కోట్లు ఉండటం మరీ దారుణమన్నారు. కరెంట్ ఛార్జీల పెంపుతో ప్రజలకు షాకిచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ప్రజలు షాకిచ్చే రోజు దగ్గరపడిరదన్నారు. కరెంట్ ఛార్జీలు తగ్గించేవరకు బీజేపీ పోరాడుతుందని, అందులో భాగంగా నేడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కరెంటు ఛార్జీల పెంపుపై ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
10.తెలంగాణ హైకోర్టులో 10 మంది నూతన న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం
హైదరాబాద్,మార్చి 24(జనంసాక్షి): తెలంగాణ హైకోర్టులో 10 మంది నూతన న్యాయమూర్తులుగా ప్రమాణస్వీకారం చేశారు. కొత్త జడ్జీలతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ ప్రమాణ స్వీకారం చేయించారు. న్యాయమూర్తులుగా జస్టిస్ కాసోజు సురేందర్, జస్టిస్ సూరేపల్లి నంద, జస్టిస్ ముమ్మినేని సుధీర్కుమార్, జస్టిస్ జువ్వాడి శ్రీదేవి, జస్టిస్ ఎన్.వి.శ్రావణ్కుమార్, జస్టిస్ గున్ను అనుపమా చక్రవర్తి, జస్టిస్ మాటూరి గిరిజా ప్రియదర్శిని, జస్టిస్ సాంబశివరావునాయుడు, జస్టిస్ ఎ.సంతోష్రెడ్డి, జస్టిస్ డి.నాగార్జున్ ప్రమాణం చేశారు.