వొద్దువొద్దు! అణుబాంబులతో ఆటొద్దు!...(2)


ఓ యుద్ధ పిపాసులారా!
ఓ సామ్రాజ్యవాదులారా!
రాజ్యకాంక్షతో
రగిలిపోయే ఓ రాబందులారా!
హింసకు ప్రతిహింసంటూ
పగప్రతీకారాలతో రగిలిపోరాదు
ఆవేశంతో అణుఖడ్గాలను విసురుకోరాదు

బుద్దుని గాంధీ 
సిద్దాంతాలైన
అహింసా ప్రేమలనే 
ఆయుధాలుగా భావించాలి
సహృద్భావ వాతావరణంలో
సహనంతో సద్గుణంతో సామరస్యంగా  
దౌత్యపరంగా శాంతి చర్చలు జరపాలి
సరిహద్దుల వివాదాల్ని సమాధి చేయాలి

మూడవ ప్రపంచ యుద్దానికి
ముహూర్తం పెట్టరాదు
మానవాళిని 
అణుబాంబుల 
అగ్ని గుండంలోకి నెట్టరాదు
మిస్సైల్స్ ఉన్నాయని మిడిసి పడరాదు
యుద్ధ విమానాలతో మృత్యువును ముద్దాడరాదు

వొద్దు వొద్దు అణుబాంబులతో ఆటొద్దు
వొద్దు వొద్దు హిరోషిమా నాగ సాకీల 
విధ్వంసాన్ని కలనైనామరువొద్దు
వొద్దువొద్దు యుద్ధం వొద్దు శాంతిచర్చలే ముద్దు

రచన. పోలయ్య కవి కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్... 9110784502