ALL NEWS

 

1. ఉక్రెయిన్‌లో..
సైనిక కార్యకలాపాల తగ్గింపుకు రష్యా అంగీకారం
` త్వరలో పుతిన్‌,జెలెన్స్‌కీల మధ్య ప్రత్యక్ష చర్చలు
` అంతర్జాతీయ శాంతి ఒప్పందానికి ముందుకొచ్చిన ఇరుదేశాలు
` 34 రోజులుగా జరుగుతున్న యుద్ధంలో కీలకపరిణామం
ఇస్తాంబుల్‌,మార్చి 29(జనంసాక్షి):గత 34 రోజులుగా ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర కొనసాగుతున్న తరుణంలో మంగళవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. 20 రోజుల తర్వాత తొలిసారి జరిగిన ప్రత్యక్ష శాంతి చర్చల్లో పురోగతి చోటుచేసుకుంది.అంతర్జాతీయ శాంతి ఒప్పందానికి ఇరు దేశాలూ ముందుకొచ్చాయి. కీవ్‌, చెర్న్‌హివ్‌ నగరాల్లో దాడులు తగ్గించేందుకు క్రెమ్లిన్‌ అంగీకరించింది. ఇరుదేశాల మధ్య పరస్పర విశ్వాసం, భవిష్యత్తు చర్చలకు ఈ నిర్ణయం తోడ్పడుతుందని రష్యా రక్షణ మంత్రిత్వశాఖ సహాయ మంత్రి అలెగ్జాండర్‌ ఫొమిన్‌ వెల్లడిరచారు. మరోవైపు, ఉక్రెయిన్‌తో అర్ధవంతంగా చర్చలు జరిగినట్లు రష్యా తరఫున ప్రధాన సంధానకర్తగా హాజరైన వ్లాదిమిర్‌ మెడిన్‌స్కీ తెలిపారు. రష్యా తీసుకున్న నిర్ణయం ఇరు దేశాల మధ్య పరస్పర విశ్వాసం పెంపొందించడానికి ఉపయోగపడుతుందన్నారు. మున్ముందు జరిగే చర్చలకు ఇది దోహదం చేస్తుందని.. అంతిమ లక్ష్యం సాధించడానికి ఉపయోగపడుతుందని వెల్లడిరచారు. కాగా, టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఇవాళ మూడు గంటలపాటు రష్యా`ఉక్రెయిన్‌ చర్చలు సాగిన తర్వాత ఈ అంగీకారం కుదిరింది. ఈ నెల 10 తర్వాత ఇరు దేశాల ప్రతినిధుల మధ్య జరిగిన తొలిసారి చర్చలు ఇవే కావడం గమనార్హం. అంతకముందు పలుమార్లు జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగియగా.. ఈరోజు ఇరుదేశాల ప్రతినిధులు ఇస్తాంబుల్‌లో చర్చలు జరిపారు.కీవ్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఉద్దేశంతో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ సైనిక చర్యను ఆరంభించి నెలకు పైనే అయింది. ఈ చర్యతో లక్షలాది మంది ఉక్రెయిన్‌ పౌరులు ఆశ్రయం కోల్పోయారు. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చెప్పిన వివరాల ప్రకారం ఈ యుద్ధంలో దాదాపు 20వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఈరోజు చర్చల్లో పురోగతి కాస్త ఉపశమనం కల్గించేదే. ఈ చర్చల తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్‌, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ నేరుగా సంప్రదింపులు జరిపే అవకాశం ఉందని ఉక్రెయిన్‌ ప్రతినిధి ఒకరు తెలిపారు. కీవ్‌, చెర్న్‌హివ్‌ ప్రాంతాల నుంచి పుతిన్‌ సేనలు వెళ్లిపోయినట్టు ఉక్రెయిన్‌ తెలిపింది. ఈ చర్చల్లో కాల్పుల ఉపసంహరణ, ఉక్రెయిన్‌ భద్రత అంశాలపైనే ప్రధానంగా చర్చించినట్టు జెలెన్‌స్కీ సలహాదారు తెలిపారు. మాస్కో కోరిన విధంగా తటస్థ దేశంగా ఉండటంతో పాటు డాన్‌బాస్‌పై రాజీపడేందుకు సిద్ధంగా ఉన్నట్టు చర్చలకు ముందు జెలెన్‌స్కీ చెప్పిన విషయం తెలిసిందే.మరోవైపు, తాజా పరిణామాలపై బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీకి చెందిన నేతలతో చర్చించనున్నట్టు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తెలిపారు. మైకోలైవ్‌ పట్టణంలో ఓ ప్రభుత్వ భవనంపై రష్యా జరిపిన దాడిలో ఏడుగురు మృతిచెందినట్టు ఉక్రెయిన్‌ తెలిపింది. అయితే, రష్యా సేనల్ని ఉక్రెయిన్‌ దీటుగా ప్రతిఘటిస్తోంది. ఇప్పటివరకు 17200 మందికి పైగా రష్యా సైనికుల్ని మట్టుబెట్టినట్టు ఉక్రెయిన్‌ విదేశాంగ శాఖ ప్రకటించుకుంది. అలాగే, 127 విమానాలతో పాటు 129 హెలికాప్టర్లు, 597 యుద్ధ ట్యాంకులు, 73 ఇంధన ట్యాంకులు, 1710 సాయుధ శకటాలను ధ్వంసం చేసినట్టు ప్రకటించింది.ఇదిలావుంగా టర్కీలోని ఇస్తాంబుల్‌ నగరంలో జరుగుతున్న చర్చల వేదిక వద్ద ఏమి తినడం, తాగడం వంటివి చేయవద్దని తమ దూతలను ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి దిమిత్రి కులేబ హెచ్చరించారు.’’రష్యన్‌ ఫెడరేషన్‌తో చర్చలకు వెళుతున్న వారిని ఒక్క విషయంలో హెచ్చరిస్తున్నా. అక్కడ తినడం, తాగడం వంటివి చేయవద్దు.. వీలైనంత వరకు ఎటువంటి వస్తువులను తాకవద్దు’’ అంటూ దిమిత్రి కులేబ పేర్కొన్నారు. ఆయన జాతీయ టీవీలో వచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.ఈ నెల మొదట్లో జరిగిన చర్చల సమయంలో రష్యా ధనికుడు రోమన్‌ అబ్రహమోవిచ్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన కంటి చూపు కొద్దిసేపు పాక్షికంగా దెబ్బతింది. ఆ తర్వాత ఆయన వేగంగా కోలుకొన్నారు. ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌ విజ్ఞప్తికి అంగీకరించి.. సాయం చేసేందుకు వచ్చారు. వాస్తవానికి ఆయన చర్చల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడగల సమర్థుడు. ఈ చర్చల్లో అదే చాలా కీలకం కానుంది. ఈ నేపథ్యంలో అబ్రహమోవిచ్‌ పై విషప్రయోగం జరగడం ఉక్రెయిన్‌ను ఆందోళనకు గురి చేస్తోంది.

 

2.ఉక్రెయిన్‌ విద్యార్థులకు వైద్యవిద్య ఇక్కడే కొనసాగించేందుకు అనుమతివ్వండి
` ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్‌ లేఖ
` వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలన్న ముఖ్యమంత్రి
` మానవీయ కోణంలో ఆలోచించాలని విజ్ఞప్తి
హైదరాబాద్‌,మార్చి 29(జనంసాక్షి):రష్యా`ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌ నుంచి అర్ధాంతరంగా దేశానికి తిరిగొచ్చిన వైద్యవిద్యార్థులు తమ విద్యాభ్యాసాన్ని ఇక్కడే కొనసాగించేందుకు అనుమతి ఇవ్వాలని ప్రధాని మోదీని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కోరారు.మానవీయ కోణంలో ఆలోచించి ప్రత్యేక కేసుగా పరిగణించి విద్యార్థులు వారి విద్యాభ్యాసాన్ని కొనసాగించేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధానికి కేసీఆర్‌ లేఖ రాశారు.’’యుద్ధం కారణంగా దాదాపు 20వేలకు పైగా భారతీయ విద్యార్థులు ఉక్రెయిన్‌ నుంచి వచ్చారు. వీరందరూ దేశ వ్యాప్తంగా వివిధ వైద్య కళాశాలల్లో చదువుకునేలా నిబంధనలు సడలించి అవకాశం ఇవ్వాలి. విద్యార్థుల్లో చాలా మంది మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారు ఉన్నారు. జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బులతో తల్లిదండ్రులు వారి పిల్లలను వైద్యవిద్య కోసం ఉక్రెయిన్‌ పంపించారు. వారి భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత మనపై ఉంది. ప్రత్యేక పరిస్థితుల్లో విద్యార్థులు భారత్‌లోనే వైద్యవిద్యను కొనసాగించేందుకు వీలుగా సరిపడా సీట్లను ఆయా వైద్యకళాశాలల్లో ఈ ఒకసారికి పెంచాలి. ఉక్రెయిన్‌ నుంచి స్వదేశానికి వచ్చిన విద్యార్థుల్లో తెలంగాణకు చెందిన వారు 700 మందికి పైగా ఉన్నారు. విద్యాభ్యాసం పూర్తి చేసేందుకు వారికయ్యే ఖర్చును భరించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మానవతా దృక్పథంతో ఆలోచించి వీలైనంత త్వరగా విద్యార్థుల విషయంలో నిర్ణయం తీసుకోవాలి’’ అని ప్రధాని మోదీని కేసీఆర్‌ కోరారు.

 

3.కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్దీకరణలో మరో ముందడుగు
` జాబితా సిద్ధం చేస్తున్న అధికారులు
హైదరాబాద్‌,మార్చి 29(జనంసాక్షి):ఇటీవల సిఎం కెసిఆర్‌ ఆదేశాలతో రాష్ట్రంలోని కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్దీకరణ పక్రియలో మరో ముందడుగు పడిరది. కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్దీకరణకు సంబంధించి ఆర్థికశాఖ కసరత్తును వేగవంతం చేసింది. అన్ని శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్దీకరణకు ప్రతిపాదనలు ఇవ్వాలని అన్ని శాఖలను ఆర్థికశాఖ కోరుతూ ఉత్తర్వులు జారీ చేసింది. మంజూరైన పోస్టుల్లో రోస్టర్‌, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌కు అనుగుణంగా ఉన్న కాంట్రాక్ట్‌ ఉద్యోగులను క్రమబద్దీకరించ నున్నారు. వీలైనంత త్వరగా ప్రతిపాదనలు పంపాలని ఆర్థిక శాఖ కోరింది. ఇక పై రాష్ట్రంలో కాంట్రాక్ట్‌ ఉద్యోగులు ఉండరని మార్చి 9న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు శాసనసభ వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉద్యోగ నియామక నోటిఫికేషన్ల ప్రకటన సందర్భంగా ఈ విషయాన్ని కేసీఆర్‌ వెల్లడిరచారు. రాష్ట్రంలోని 11,103 మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తున్నట్లు సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రం ఏర్పాటైన కొత్తలోనే 2014 జూన్‌ 2 నాటికి కాంట్రాక్టు ఉద్యోగులుగా పని చేస్తున్న వారిని మానవీయ దృక్పథంతో ప్రభుత్వం రెగ్యులరైజ్‌ చేయాలని నిర్ణయించింది. అయితే కొన్నిరాజకీయ పార్టీలు సంకుచిత మనస్తత్వంతో కోర్టులో కేసులు వేసిన నేపథ్యంలో హైకోర్టు జారీ చేసిన తాత్కాలిక ఉత్తర్వుల కారణంగా ఈ పక్రియ మధ్యలో నిలిచిపోయింది. ప్రభుత్వం పట్టు విడవకుండా న్యాయ పోరాటం చేసింది. ప్రభుత్వ పోరాటం ఫలితంగా గతేడాది డిసెంబరు 7న సంబంధిత రిట్‌ పిటిషన్లను కొట్టివేస్తూ హైకోర్టు ఆదేశాలను వెలువరించింది. అవరోధాలన్నీ తొలగిపోయిన నేపథ్యంలో కాంట్రాక్టు ఉద్యోగుల సేవలను ప్రభుత్వం క్రమబద్ధీకరిస్తున్నది. ఇక పై రాష్ట్రంలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగ నియామకా లుండవు అని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు.

 

4.ఈడీ,సీబీఐలు భాజపా జేబు సంస్థలు
`దుర్వినియోగంపై పోరాడుతాం
` విపక్షపార్టీల సీఎంలకు మమత పిలుపు
కోల్‌కతా,మార్చి 29(జనంసాక్షి):ప్రతిపక్ష పార్టీలకు, వివిధ రాష్టాల్ర సీఎంలకు బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ లేఖ రాశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తున్నట్లు ఆమె ఆ లేఖలో ఆరోపించారు. ఈ విషయంలో పోరాటం చేపట్టేందుకు అన్ని పార్టీలు కలిసి రావాలని ఆమె పిలుపు నిచ్చారు. ఆదివారం ఆ లేఖను విడుదల చేశారు. ప్రతిపక్ష పార్టీలను టార్గెట్‌ చేసేందుకు బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలను వాడుతున్నట్లు ఆమె ఆరోపించారు. ఎక్కడైనా ఎన్నికలు జరుగుతున్నాయంటే ఆ సమయంలో దర్యాప్తు సంస్థలను బీజేపీ వాడుకుంటోందన్నారు. అందరికీ అనుకూలమైన ప్రదేశంలో ఈ అంశం గురించి చర్చిచేందుకు రావాలని, దేశంలోని ప్రగతిశీల పార్టీలు ఒక్కటిగా నిలిచి అణిచివేత దళాన్ని అడ్డుకోవాలన్నారు. బొగ్గు కుంభకోణం కేసులో మమతా బెనర్జీ మేనల్లుడు ఎంపీ అభిశేక్‌ బెనర్జీపై ఈడీ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈడీ, సీబీఐ, సీవీసీ, ఐటీ శాఖలను విపక్షాలపై ప్రతీకారంతో బీజేపీ వాడుతోందని మమతా బెనర్జీ ఆరోపించారు. రాజకీయాల జోక్యం వల్లే ప్రజలకు న్యాయం జరగడం లేదని ఆమె అన్నారు. అసమ్మతి గళాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను నిరోధించేందుకు, జవాబుదారీని చేసేందుకు ప్రతిపక్షాలు ఏకమవాలని పిలుపునిచ్చారు. ఇది ప్రతిపక్షాలకుగల రాజ్యాంగపరమైన బాధ్యత అని వివరించారు. అందరికీ అనువుగా ఉండే చోట ప్రతిపక్షాల నేతలంతా సమావేశమవాలన్నారు. అణచివేతకు పాల్పడే ఈ శక్తులతో పోరాడేందుకు దేశంలోని అభ్యుదయవాద శక్తులంతా కలిసి రావడం అత్యవసరమని చెప్పారు. అధికారంలో ఉన్న బీజేపీ ఈ దేశ వ్యవస్థాగత ప్రజాస్వామ్యంపై ప్రత్యక్ష దాడికి పాల్పడుతోందని, దీనిపై తీవ్ర ఆందోళనను వ్యక్తం చేయడం కోసమే తాను ఈ లేఖలను రాస్తున్నానని తెలిపారు. దేశవ్యాప్తంగా రాజకీయ ప్రత్యర్థులపై కక్ష తీర్చుకోవడం కోసం ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌), సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ), సీవీసీ (సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌), ఆదాయపు పన్ను శాఖలను బీజేపీ దుర్వినియోగపరుస్తోందని ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్టాల్ల్రో శుష్క పరిపాలన గురించి అద్భుతంగా చెప్పుకోవడం కోసం ఈ దర్యాప్తు సంస్థలను వినియోగించుకుంటోందన్నారు. న్యాయవ్యవస్థలో ఓ వర్గాన్ని ప్రభావితం చేసేందుకు ప్రయత్నించడం ద్వారా ఈ దేశ సమాఖ్య నిర్మాణంపై దాడి చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ రాసిన లేఖపై ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ స్పందించారు. ఇప్పటి వరకైతే తనకు మమతా లెటర్‌ అందలేదని స్పష్టం చేశారు. అయినా.. తాము తమ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం వైపే దృష్టి నిలుపుతామని స్పష్టం చేశారు. తమ పార్టీ విధానం కూడా అదేనని తేల్చి చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉందని, ఈ చర్చ తమ పార్టీలో ఇంకా రాలేదని అన్నారు. ఒడిశా ముఖ్యమంత్రి పట్నాయక్‌ ప్రస్తుతం ఢల్లీి పర్యటనలో ఉన్నారు. స్పోర్ట్స్‌ విూట్‌లో పాల్గొనడానికి వచ్చానని తెలిపారు. గురువారం తమ పార్టీ ఎంపీలతో సమావేశమవుతానని, రాష్టాన్రికి రావాల్సిన ప్రాజెక్టులపై చర్చ ఉంటుందని నవీన్‌ పట్నాయక్‌ పేర్కొన్నారు.

 

5.కరోనా మహమ్మారిలాగే... అన్ని దేశాలపై ఉక్రెయిన్‌ యుద్ధ ప్రభావం
` రాజ్యసభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌
దిల్లీ,మార్చి 29(జనంసాక్షి):ఉక్రెయిన్‌ రష్యా సాగిస్తోన్న యుద్ధం.. కరోనా మహమ్మారి లాగే అన్ని దేశాలపై ప్రభావం చూపిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. కేంద్ర బడ్జెట్పై రాజ్యసభలో చర్చ సందర్భంగా ఆమె నేడు మాట్లాడారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని ప్రస్తావించారు. ‘‘ఇప్పుడు మనం ఉక్రెయిన్లో పూర్తి స్థాయి యుద్ధ పరిస్థితులు చూస్తున్నాం. ఇది ప్రపంచంలోనే ఏదో ఒక మూలన జరుగుతున్న చిన్న యుద్ధం కాదు. కొవిడ్‌ మహమ్మారి లాగే దీని ప్రభావం యావత్‌ ప్రపంచ దేశాలపైనా పడుతుంది. యుద్ధ ప్రభావంతో విలువైన సరఫరా గొలుసులు దెబ్బతింటాయి. కొత్త మార్కెట్లు ఉద్భవిస్తాయి. అదే సమయంలో పాత మార్కెట్లలో అసాధారణ పరిస్థితులు నెలకొంటాయి’’ అని నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర కొనసాగుతూనే ఉంది. క్రెమ్లిన్ను అడ్డుకునేందుకు ప్రపంచ దేశాలు ఆంక్షల కొరఢా రaుళిపిస్తున్నాయి. దీంతో చమురు ధరలు నానాటికీ పెరుగుతున్నాయి. మరోవైపు రష్యా, ఉక్రెయిన్‌ దేశాల నుంచి ఆహార ఉత్పత్తుల ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో కొన్ని పేద దేశాల్లో ఆహార కొరత ఏర్పడే ప్రమాదం ఉందని అంతర్జాతీయ సంస్థలు హెచ్చరిస్తూనే ఉన్నాయి.

 

6.నెహ్రూ మ్యూజియం ఇక ప్రధానుల మ్యూజియం
14 మంది ప్రధానుల స్మారక కేంద్రంగా మార్పు
న్యూఢల్లీి,మార్చి 29(జనంసాక్షి):ఢల్లీిలో తీన్‌మూర్తి భవన్‌ వేదికగా ఉన్న నెహ్రూ మ్యూజియం పేరును మార్చాలని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపై మ్యూజియాన్ని పీఎం మ్యూజియంగా మార్చింది. కేవలం నెహ్రూ పేరువిూద ఉన్న దీనిని ప్రధానులందరి జ్ఞాపకంగా ఉండేలా తీర్చిదిద్దారు. దేశానికి ప్రధానులుగా పని చేసిన 14 మంది మాజీ ప్రధానులకు చెందిన జ్ఞాపకాలను ఇక్కడ భద్రపరచనున్నారు. అంబేద్కర్‌ జయంతి రోజున అంటే.. 14న ప్రధాని నరేంద్ర మోదీ మ్యూజియాన్ని ప్రారంభించింది. 14 మంది మాజీ ప్రధానుల సేవలను గుర్తించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ ఎంపీలతో అన్నారు. ప్రైమ్‌ మినిస్టర్స్‌ మ్యూజియంలో మాజీ ప్రధానులందరి రచనలను ప్రదర్శించనున్నట్లు పేర్కొన్నారు. ప్రధానమంత్రులందరి సహకారాన్ని తమ ప్రభుత్వం గుర్తించేలా చేసిందన్నారు. ఈ సందర్భంగా మ్యూజియాన్ని సందర్శించాలని ఎంపీలను ప్రధాని కోరారు.

 

7.దడపుట్టిస్తున్న ఎండలు
` రోజురోజుకీ తీవ్రమవుతున్న వడ గాల్పులు
` రానున్న ఐదు రోజుల్లో మరింత తీవ్రంగా ఎండలు
` ఆదిలాబాద్‌ జిల్లాలో అత్యధికంగా 43 డిగ్రీలు
హైదరాబాద్‌,మార్చి 29(జనంసాక్షి):తెలుగు రాష్టాల్ల్రో రోజురోజుకీ వడ గాల్పులు తీవ్రమవుతున్నాయి. మార్చి నెల కూడా ముగియక ముందే ఎండలు దంచి కొడుతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే ఏప్రిల్‌, మే నెలలో మరింత తీవ్రత తప్పదని హెచ్చరికలు వస్తున్నాయి. భగభగ మండే ఎండలకు ఏమైపోతామో నన్న టెన్షన్‌ తెలుగు రాష్టాల్ల్రో ఉంది. హీట్‌వేవ్‌ అంతకంతకూ పెరుగుతోంది. మార్చి నెల చివరివారంలో పగటి ఉష్ణోగ్రతలలో మార్పు కనిపిస్తోంది. ఈ సమ్మర్‌లో మాడు పగలడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు కాస్త శాంతంగా కనిపించిన సూర్యుడు.. మళ్లీ తన ప్రతాపం చూపిస్తున్నాడు. తెలుగు రాష్టాల్ల్రో ఎండల తీవ్రత బాగా పెరిగింది. ఎండలు రోజు రోజుకూ ముదురుతున్నాయి. రాగల 5 రోజుల్లో ఎండల తీవ్రత అక్కడక్కడ 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని తెలంగాణ వాతావరణ శాఖ ప్రకటించింది. రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని తాజా బులెటిన్‌ లో పేర్కొంది. రాగల 5 రోజులలో తెలంగాణ రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుండి 3 డిగ్రీల సెల్సియస్‌ వరకు అక్కడక్కడ పెరిగే అవకాశం ఉందని వాతావరణ హెచ్చరికలు జారీ చేసింది. విదర్భ నుండి ఉత్తర కేరళ వరకు ఉన్న ఉపరితల ద్రోణి ఈ రోజు ఛత్తీస్‌ ఘడ్‌ నుండి తెలంగాణా విూదగా ఇంటీరియర్‌ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టం నుండి సుమారు 0.9కిమి ఎత్తు వరకు కొనసాగుతోందని, ఏప్రిల్‌ 1,2 తేదీలలో రాష్ట్రంలోని వాయువ్య జిల్లాలలో వడగాలులు వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా తెలంగాణలో పదేళ్ల రికార్డు బద్దలైంది. ఆదిలాబాద్‌ జిల్లా చాప్రాలలో 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. మరో నాలుగైదు రోజుల్లో తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్‌ వరకు పెరిగే అవకాశం ఉందన్నారు. మార్చి నెలాఖరుకే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఓ వైపు ఎండ, మరోవైపు ఉక్కపోతతో జనాలు అల్లాడిపోతున్నారు. అటు ఏపీ విషయానికి వస్తే.. అక్కడ సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విజయనగరంలో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని వెదర్‌ రిపోర్ట్‌ చెప్తోంది. మిగతా జిల్లాలోనూ అదే పరిస్థితి ఉంటాయని తెలిపింది. మధ్యాహ్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు వచ్చేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వడగాల్పుల ప్రభావం పెరిగే అవకాశం ఉందంటున్నారు. అటు విజయవాడ లోనూ ఎండలు దంచికొడుతున్నాయి. ఇప్పటికే 40 డిగ్రీలు దాటేశాయి. మధ్యాహ్నం సమయానికి రోడ్లపై జనం రద్దీ తగ్గుతోంది.

 

 

8.కేంద్ర సర్కారే ధాన్యం సేకరించాలి
` రైతులను ఆదుకోవాలి
` రాహుల్‌ డిమాండ్‌
` తెలంగాణ రైతుల తరఫున పోరాటం చేస్తామని వెల్లడి
న్యూఢల్లీి,మార్చి 29(జనంసాక్షి):రాష్ట్రంలో ధాన్యం సేకరణ అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తప్పుబట్టారు. ధాన్యం కొనుగోలు అంశంపై తెలుగులో మంగళవారం ఓ ట్వీట్‌ చేశారు. ధాన్యం సేకరణలో భాజపా, తెరాస ప్రభుత్వాల వైఖరి సిగ్గుచేటని రాహుల్‌ గాంధీ ట్విటర్‌ ద్వారా వెల్లడిరచారు. రైతుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం సేకరణను రాజకీయం చేస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వాలు తమ నైతిక బాధ్యతను విస్మరిస్తూ.. వారి శ్రమతో రాజకీయం చేయడం సిగ్గుచేటన్నారు. అన్నం పెట్టే రైతన్నను ఇబ్బంది పెట్టడం ఆపి.. వారి వద్ద నుంచి ప్రతి ధాన్యం గింజా కొనాలని డిమాండ్‌ చేశారు. ధాన్యం పూర్తిగా కొనేవరకు తెలంగాణ రైతుల తరఫున పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణలో పండిన చివరి గింజ కొనేవరకూ, రైతుల తరపున కాంగ్రెస్‌ పార్టీ కొట్లాడి తీరుతుందన్నారు. తెలంగాణ రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు తమ నైతిక బాధ్యతను విస్మరిస్తూ, రైతుల శ్రమతో రాజకీయం చేయడం సిగ్గుచేటు. రైతు వ్యతిరేక విధానాలతో అన్నం పెట్టే రైతులని క్షోభ పెట్టే పనులు మాని, పండిరచిన ప్రతి గింజా కొనాలని అంటూ డిమాండ్‌ చేశారు. మరోపక్క తెలంగాణ ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగడుతూ నిరసనలకు పిలుపు ఇచ్చింది.

 

9.ఇన్నాళ్లకు రైతులు గుర్తొచ్చారా..
` రాహుల్‌ ట్విట్‌పై టీఆర్‌ఎస్‌ ఎద్దేవా...
` విమర్శలు గుప్పించిన కవిత, హరీష్‌
` టిఆర్‌ఎస్‌ ఎంపిలతో కలసి కొట్లాడాలని హితవు
న్యూఢల్లీి,మార్చి 29(జనంసాక్షి):తెలంగాణ రైతుల సమస్యలపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చేసిన ట్వీట్‌కు ఎమ్మెల్సీ కవిత కౌంటర్‌ ఇచ్చారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్‌లో రాహుల్‌కు కౌంటర్‌ ఇస్తూ... విూరు ఎంపిగా ఉండి రాజకీయ లబ్ది కోసం ట్విట్టర్‌లో సంఫీుభావం తెలపడం కాదు.. విూకు నిజాయతీ ఉంటే తెలంగాణ ఎంపీలకు మద్దతుగా వెల్‌లోకి వచ్చి నిరసన తెలపండి. ఒకే దేశం ఒకే సేకరణ విధానం కోసం డిమాండ్‌ చేయండి. ధాన్యం కొనుగోలుపై పంజాబ్‌, హర్యానాకు ఒక నీతి.. ఇతర రాష్టాల్రకు ఒక నీతి ఉందని అంటూ కవిత ట్వీట్‌ చేశారు. దీనిపై స్పందించిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌...కవిత ట్వీట్‌కు సెటైర్‌ విసిరారు. టీఆర్‌ఎస్‌ ఎంపీలు పార్లమెంట్‌లో పోరాడటం లేదని? సెంట్రల్‌ హాల్లో కాలక్షేపం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇకపై ఎఫ్‌సీఐకి బాయిల్డ్‌ రైస్‌ ఇవ్వబోమని విూ తండ్రి కేసీఆర్‌ గత ఆగస్టులోనే ఒప్పందంపై సంతకం చేశారు. విూ తండ్రి నాడు చేసిన సంతకం నేడు తెలంగాణ రైతుల మెడకు ఉరితాడైంది. ఈ వాస్తవాన్ని విూరు మర్చిపోయారని అంటూ రేవంత్‌ రెడ్డి ట్వీట్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ రాహుల్‌ గాంధీపై రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ధాన్యం సేకరణ విషయంలో టీఆర్‌ఎస్‌ పార్టీ తమ నైతిక బాధ్యతను విస్మరిస్తుందని రాహుల్‌ చేసిన ట్వీట్‌పై హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. తెలంగాణపై దొంగ ప్రేమ, మొసలి కన్నీళ్లు ఆపాలని రాహుల్‌కు మంత్రి చురకలంటించారు. తెలంగాణ రైతుల మేలు కోరుకునేవాళ్లే అయితే పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌ ఎంపీలతో కలిసి కాంగ్రెస్‌ ఎంపీలు కూడా ఆందోళన చేయాలని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. రైతుల ఉసురుపోసుకుంటున్న కేంద్రం తీరును ఎండగట్టే పని చేయాలని సూచించారు. ఒకే దేశంఒకే సేకరణపై కాంగ్రెస్‌ పార్టీ వైఖరేంటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. రైతుల విషయంలో కూడా రాజకీయాలు చేసి తెలంగాణ సమాజంలో విూ పరువును తీసుకోవద్దు అని హరీశ్‌రావు పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మధ్య వాడీవేడిగా రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావుతో పాటు టీఆర్‌ఎస్‌ ఎంపీలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా.. కేంద్రం మాత్రం నిబంధనలకు తగ్గట్లే అన్ని రాష్టాల్ల్రోనూ కొనుగోళ్లు జరుగుతాయని, తెలంగాణ అందుకు మినహాయింపు ఏమాత్రం కాదని స్పష్టం చేసింది. దీంతో ఉగాది తరవాత కేంద్రంపై ప్రత్యక్ష యుద్దానికి టిఆర్‌ఎస్‌ కార్యాచరణ సిద్దం చేస్తోంది.

 

10.ఆరని పెట్రో మంటలు
ఆగని పెట్రో ధరల దాడి
లీటర్‌పై 90పైసలు పెంపు
న్యూఢల్లీి,మార్చి 29(జనంసాక్షి):దేశ వ్యాప్తంగా పెట్రోల్‌ ధరలు భగ్గుమంటున్నాయి. గడిచిన 8 రోజుల్లో ఏడు సార్లు చమురు ధరలు పెరిగాయి. తాజాగా మంగలవారం మరోమారు ధరలను పెంచేశారు. లీటర్‌ పెట్రోల్‌పై 90 పైసలు, డీజిల్‌పై 76 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. తాజా పెంపుతో హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 113.61 కాగా, డీజిల్‌ ధర రూ. 99.83గా ఉంది. విజయవాడలో పెట్రోల్‌ రూ. 115.37, డీజిల్‌ రూ. 101.23గా ఉంది. ఢల్లీిలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 100.21, డీజిల్‌ ధర రూ. 91.47, ముంబైలో పెట్రోల్‌ రూ. 115.04, డీజిల్‌ రూ. 99.25, చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 105.94, డీజిల్‌ ధర రూ. 96, కోల్‌కతాలో లీటర్‌ పెట్రోల్‌ రూ. 109.68, డీజిల్‌ ధర రూ. 94.62గా ఉంది.

 

11.అరుదైన గుర్తింపు దిశగా లేపాక్షి ఆలయం
యునెస్కో వారసత్వ కట్టడాల జాబితాలో చేరిక
న్యూఢల్లీి,మార్చి 29(జనంసాక్షి): ప్రపంచంలోని చారిత్రక కట్టడాలకు వారసత్వ గుర్తింపు ఇచ్చే యునెస్కో... అనంతపురం జిల్లా లేపాక్షి ఆలయాన్ని గుర్తించింది. యునెస్కో వారసత్వ కట్టడాల తాత్కాలిక జాబితాలో చేర్చింది. భారత్‌ నుంచి మూడు ప్రాంతాలకు తాత్కాలిక జాబితాలో చోటు దక్కగా దానిలో ఏపీ నుంచి అనంతపురానికి చెందిన లేపాక్షి ఆలయం ఉండటం విశేషం. మరో 6 నెలల్లో వారసత్వ కట్టడాలపై యునెస్కో తుది జాబితా విడుదల చేయనుంది. శిల్ప సంపదకు నెలవైన లేపాక్షి... వారసత్వ కట్టడాల జాబితాలో తాత్కాలిక గుర్తింపు దక్కడంపై జిల్లా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 

12.ముగిసిన 50 ఏళ్ల సరిహద్దు వివాదం
`ఒప్పందంపై సంతకాలు చేసిన అస్సాం, మేఘాలయ రాష్ట్రాల సీఎంలు
దిల్లీ,మార్చి 29(జనంసాక్షి): తమ రాష్ట్రాల మధ్య 50 ఏళ్లుగా కొనసాగుతున్న సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకునేందుకు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, మేఘాలయ సీఎం కాన్రాడ్‌ సంగ్మా మంగళవారం ఓ ఒప్పందంపై సంతకాలు చేశారు. తమ రాష్ట్రాల సరిహద్దులతో పాటు 12 ప్రాంతాల్లోని ఆరింటిలో సరిహద్దు వివాదాలను పరిష్కరించుకునేందుకు ముసాయిదా తీర్మానాన్ని రూపొందించాయి. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆధ్వర్యంలో ఈ శాంతి ఒప్పందం జరిగింది. ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, హోం మంత్రిత్వ శాఖ ఇతర అధికారుల ఈ భేటీలో పాల్గొన్నారు. కేంద్ర హోంమంత్రి కార్యాలయంలో జరిగిన సమావేశంలో మేఘాలయ ప్రభుత్వం తరఫున మొత్తం 11 మంది, అస్సాంకు చెందిన తొమ్మిది మంది ప్రతినిధులు హాజరయ్యారు.కాగా ఈ ఒప్పందంపై అమిత్‌ షా హర్షం వ్యక్తం చేశారు. ఐదు దశాబ్దాలుగా కొనసాగుతున్న వివాదానికి ముగింపు పలికే ఒప్పందంపై సంతకం చేయడం ఈశాన్య రాష్ట్రాలకు చారిత్రక రోజు అని ఆయన పేర్కొన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి పలు ఈశాన్య రాష్ట్రాల సరిహద్దు వివాదాలను పరిష్కరించామన్నారు. దీంతోపాటు ఆయా రాష్ట్రాల అభివృద్ధికి విశేష కృషి చేసినట్లు తెలిపారు.అస్సాం, మేఘాలయ రాష్ట్రాలు 885 కిలోవిూటర్ల పొడవైన సరిహద్దును పంచుకుంటున్నాయి. అస్సాం పునర్వ్యవస్థీకరణ చట్టం 1971 ప్రకారం, అస్సాం నుంచి మేఘాలయను వేరు చేశారు. కాగా ఈ చట్టాన్ని మేఘాలయ సవాలు చేసింది. దీంతో ఈ వ్యవహారం వివాదాలకు దారితీసింది.

 

 

13.మరో అంతర్జాతీయ దిగ్గజ సంస్థకు సీఈఓగా భారతీయుడు
వాషింగ్టన్‌,మార్చి 29(జనంసాక్షి): అంతర్జాతీయ దిగ్గజ సంస్థలకు నాయకత్వం వహిస్తున్న భారత సంతతి వ్యక్తుల జాబితాలో మరొకరు చేరారు. ప్రముఖ కొరియర్‌ డెలివరీ సంస్థ ఫెడెక్స్‌కు భారతీయ అమెరికన్‌ అయిన రాజ్‌ సుబ్రమణియం ను సీఈఓ నియమిస్తున్నట్లు సోమవారం ఆ సంస్థ ప్రకటించింది.ప్రస్తుతం ఉన్న సీఈఓ, ఛైర్మన్‌ ఫ్రెడెరిక్‌ డబ్ల్యూ స్మిత్‌ జూన్‌ 1 నుంచి ఆ బాధ్యతల నుంచి తప్పుకొని ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా కొనసాగనున్నారు. స్మిత్‌ స్థానంలో సుబ్రమణియం బాధ్యతలు నిర్వర్తించనున్నారు.’’మున్ముందు సంస్థను విజయతీరాలకు చేర్చడంలో సుబ్రమణియం సమర్థతపై నాకు పూర్తి విశ్వాసం ఉంది’’ అని స్మిత్‌ తెలిపారు. ఫెడెక్స్‌ను స్మిత్‌ 1971లో స్థాపించారు. ‘’ఫ్రెడ్‌ ఒక గొప్ప దార్శనికత గల నాయకుడు. ప్రపంచంలోనే అత్యంత గొప్ప సంస్థను స్థాపించారు. ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యతలు స్వీకరించడం గౌరవంగా భావిస్తున్నాను’’ అని సుబ్రమణియం అన్నారు. అమెరికాలోని టెన్నెసీ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థలో ఆరు లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.2020లో సుబ్రమణియం తొలిసారి ఫెడెక్స్‌ బోర్డులోకి ప్రవేశించారు. ఇకపైనా బోర్డు సభ్యుడిగా కొనసాగనున్నారు. ప్రస్తుతం అధ్యక్షుడు, చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ హోదాలో పనిచేస్తున్నారు. అంతకుముందు ఫెడెక్స్‌ ఎక్స్‌ప్రెస్‌ అధ్యక్షుడు, సీఈఓగా పనిచేశారు. అలాగే ఫెడెక్స్‌కు ఎగ్జిక్యూటివ్‌ ఉపాధ్యక్షుడిగా, చీఫ్‌ మార్కెటింగ్‌, కమ్యూనికేషన్స్‌ ఆఫీసర్‌గా పనిచేసిన అనుభవం కూడా ఆయనకు ఉంది. ఇలా సంస్థ అంతర్జాతీయ కార్యకలాపాల్లో ఆయనకు 30 ఏళ్లకు పైగా అనుభవం ఉండడం విశేషం.కేరళలోని తిరువనంతపురానికి చెందిన సుబ్రమణియం ఐఐటీ బాంబే నుంచి కెమికల్‌ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ అందుకున్నారు. అనంతరం న్యూయార్క్‌లోని సిరక్యూస్‌ యూనివర్శిటీ నుంచి కెమికల్‌ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్‌ పూర్తి చేశారు. ఆ తర్వాత యూనివర్శిటీ ఆఫ్‌ టెక్సాస్‌ నుంచి ఎంబీఏ పట్టా కూడా పుచ్చుకున్నారు.

 

14.తెలంగాణలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదల
హైదరాబాద్‌,మార్చి 29(జనంసాక్షి):వివిధ ప్రవేశ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను తెలంగాణ ఉన్నత విద్యా మండలి మంగళవారం ప్రకటించింది. రాష్ట్రంలో ఆన్‌లైన్‌ పద్ధతిలో 2022`23 విద్యా సంవత్సరానికి గాను డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే టీఎస్‌ లాసెట్‌, టీఎస్‌ పీజీఎల్‌సెట్‌, టీఎస్‌ ఈడీసెట్‌, టీఎస్‌ ఐసెట్‌, టీఎస్‌ పీజీఈసెట్‌ ప్రవేశ పరీక్షలకు సంబంధించిన పరీక్ష తేదీలను ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి, వైస్‌ చైర్మన్‌ శ్రీనివాసరావు ప్రకటించారు. జూలై 21న లా సెట్‌ (మూడేళ్ల కోర్సు), జూలై 22న పీజీ ఎల్‌ సెట్‌, జూలై 22న లా సెట్‌ (ఐదేళ్ల కోర్సు) ప్రవేశ పరీక్ష జరుగుతుందని తెలిపారు. జూలై 26, 27, 28 తేదీల్లో ఎడ్‌సెట్‌, జూలై 27, 28 తేదీల్లో సెట్‌, జూలై 29 నుంచి ఆగస్ట్‌ 1వ తేదీ వరకు పీజీ ఈసెట్‌ పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. అయితే, విద్యార్హత, చెల్లించాల్సిన రిజిస్టేష్రన్‌ ఫీజు తదితర వివరాలతో సంబంధిత సెట్ల కన్వీనర్లు వివరణాత్మక నోటిఫికేషన్లు జారీ చేస్తారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.