సత్యనాదెళ్ల కుమారుడు జైన్ మృతి
మస్తిష్క పక్షవాతంతో బాధపడుతున్నతనయుడువాషింగ్టన్,మార్చి1 (జనం సాక్షి):మైక్రోసాప్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఇంట విషృాదం నెలకొంది. ఆయన కుమారుడు జైన్ నాదెళ్ల(26) మృతి చెందాడు. పుట్టుకతోనే జైన్ నాదెళ్ల మస్తిష్క పక్షవాతంతో బాధపడుతున్నారు. అమెరికా కాలమానం ప్రకారం జైన్ నాదేళ్ల సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు మైక్రోసాప్ట్ సంస్థ ఎగ్జిక్యూటివ్ స్టాఫ్‌కు ఈమెయిల్ ద్వారా వెల్లడిరచింది. సత్యనాదెళ్ల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలపాలని కోరింది. 2014లో మైక్రోసాప్ట్ సీఈవోగా సత్యనాదెళ్ల
బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి దివ్యాంగులకు ఉపయోగపడే ఉత్పత్తులను రూపొందించడంపై ప్రత్యేక దృష్టి సారించారు. తన కుమారుడు జైన్‌ను పెంచే క్రమంలో నేర్చుకున్న విషయాలను వివరించేవారు. మస్తిష్క పక్షవాతంతో బాధపడుతున్న జైన్ చిన్నప్పట్నుంచే వీల్ చైర్‌కు పరిమితం అయ్యారు.
జైన్ నాదెళ్ల సెరిబ్రల్ పాల్సీతో జన్మించాడు. సెరిబ్రల్ పాల్సీ అంటే.. పుట్టుకతోనే బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. దీంతో మెదడుకు కాళ్లు, చేతులపై కంట్రోల్ ఉండదు. నడవలేని స్థితిలో ఉండటం కారణంగా వీల్‌చైర్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది. కాగా సత్యనాదెళ్లకు కుమారుడితోపాటు ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు. సత్యనాదెళ్ల పలు సందర్భాలలో జైన్ ఆరోగ్య పరిస్థితిని కూడా వివరించారు. జైన్ తన ఎక్కువగా చిల్డన్స్ హాస్పిటల్‌లోనే చికిత్స పొందారు.