హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే జేఈఈ అడ్వాన్స్ పరీక్షల షెడ్యూల్ కారణంగా తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ లో మార్పులు చేస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. బుధవారం రిషెడ్యూల్ చేసిన తేదీల ప్రకారం..
ఏప్రిల్ 22 నుంచి మే 6 వరకు ఇంటర్ మొదటి ఏడాది పరీక్షలు.. ఏప్రిల్ 23 నుంచి మే 7 వరకు ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు జరగనున్నాయి. అలాగే మార్చి 23 నుంచి ఏప్రిల్ 8వరకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. ఏప్రిల్ 11,12 న ఎన్విరాన్‌మెంటల్ పరీక్ష ఉండనుంది. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు పరీక్ష తేదీలను ఖరారు చేసింది.
ఫస్ట్ ఇయర్ ఇంటర్ పరీక్షల షెడ్యూల్..
►ఏప్రిల్ 22 న పేపర్ 1 తెలుగు/ సంస్కృతి
►ఏప్రిల్ 25 న ఇంగ్లీష్ పేపర్ 1
►ఏప్రిల్ 27న మాథ్స్ పేపర్1A, బొటనీ పేపర్1, పొలిటికల్ సైన్స్ పేపర్ 1
►ఏప్రిల్ 29న మాథ్స్ పేపర్ 1B జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్1
►మే2 న ఫిజిక్స్ పేపర్ 1, ఎకానమిక్స్ పేపర్1
►మే 6న కెమిస్ట్రీ పేపర్ 1, కామర్స్ పేపర్ 1
ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల షెడ్యూల్..
►ఏప్రిల్ 23న సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2,
►ఏప్రిల్ 26 న ఇంగ్లిష్ పేపర్ 2
►ఏప్రిల్ 28న మాథ్స్ పేపర్ 2A, బోటనీ పేపర్ 2, పొలిటికల్ సైన్స్ పేపర్ 2,
►ఏప్రిల్ 30న మాథ్స్ పేపర్ 2B, జూవాలజీ పేపర్2, హిస్టరీ పేపర్ 2
►మే 5న ఫిజిక్స్ పేపర్ 2, ఎకానమిక్స్ పేపర్ 2,
►మే 7న కెమిస్ట్రీ పేపర్2, కామర్స్ పేపర్2