తమ రాజకీయ వ్యూహాలను టిఆర్‌ఎస్‌పై రుద్దే యత్నాలు
బడ్జెట్, ఉద్యోగ ప్రకటలన్నీ ముందస్తే అంటూ ప్రచారాలు
హైదరాబాద్,మార్చి18 (జనంసాక్షి): తెలంగాణలో రాజకీయ పార్టీలన్నీ ఇప్పుడు ముందస్తు ఎన్నికలపై దృష్టి సారించాయి. బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ముందస్తు ఎన్నికలు రావాలని కోరుకుంటున్నాయి. తమ కోరికను టిఆర్‌ఎస్‌పై నెట్టి..కెసిఆర్ ముందస్తుకు వెళతారన్న ఊహాగానాలను ప్రచారం చేస్తున్నాయి. నిజానికి కెసిఆర్‌కు ఇప్పుడు ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. ఎందకుంటే అధికారం ఆయన గుప్పిట్లోనే ఉంది. ఆయనకు ఇప్పట్లో తెలంగాణలో ఎదురులేదు. అయితే హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం ఒక్కటే తెలంగాణ మొత్తానికి ఆపాదించడానికి లేదు.అయితే ఎప్పుడు ఎన్నికలు వస్తాయా..తామే అధికారంలోకి వస్తామనే ధీమాతో కాంగ్రెస్, బిజెపిలు ఎదురుచూస్తున్నాయి. ఈ క్రమంలో తమ ఆలోచనలను కెసిఆర్‌పై రుద్దుతున్నాయి. కేసీఆర్ వరుస ప్రకటనలే ఎలక్షన్లకు సంకేతాలంటూ పక్రచారం చేసుకుంటున్నాయి. ఎన్‌ఇనకలు జరిగితేఉ తమదే అధికారమని బండి సంజయ్, రేవంత్ రెడ్డిలు తొడలు కొడుతున్నారు. ఇందుకోసం కమలనాథులుఅప్పుడే రోడ్‌మ్యాప్ కూడా సిద్దం చేసుకుంటున్నారు. 2023 డిసెంబర్ వరకూ సమయం ఉన్నా తెలంగాణలో ముందుగానే ఎన్నికలొస్తాయన్న చర్చ మాత్రం లేపాయి. ఇకపోతే కెసిఆర్ కూడా ఆచితూచి పరిస్థితులను గమనిస్తున్నారు. మోడీని ఢీకొనేందుకు ఎత్తులు వేస్తున్నారు. గుణాత్మక రాజకీయాలంటూ కొంత హడావిడి చేసినా..నాలుగు రాష్ట్రల ఫలితాలు ఆయనను ఆలోచించేవిగా చేశాయనే చెప్పాలి. ఈ క్రమంలో కెసిఆర్ ఆత్మస్థయిర్యం దెబ్బతీసే పనిలో అన్ని పార్టీలు పడ్డాయి. కొత్తగా వచ్చిషర్మిల కూడా పాదయాత్రతో కెసిఆర్‌పైనే దాడి చేస్తున్నారు. అందుకే తెలంగాణలో రాజకీయ పార్టీలు స్పీడు పెంచాయి. ముందస్తు ఎన్నికలపై చర్చతో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ పరిణామాలు వేడెక్కాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం బడ్జెట్లో సంక్షేమానికి ప్రాధాన్యత పెంచడం,ఉద్యోగాల ప్రకటన చేయడంతో ఎన్నికల ఊహాగానలని ప్రచారం చేస్తున్నాయి. మరోవైపు మంత్రులు జిల్లాల పర్యటనల్లో దూకుడు పెంచుతున్నారు. ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో ఉండాలని అధిష్టానం నుంచి సంకేతాలు అందాయి. ఇవన్నీ ముందస్తు ఎన్నికలకు సంకేతాలని కాంగ్రెస్,బిజెపిలు అంచనా వేసి అందుకు అనుగుణంగా పరుగులు పెడుతున్నాయి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్దంగా ఉన్నామంటూ విజయంపై ధీమాగా ఉన్నాయి. ఐదు రాష్టాల్ర ఫలితాల తర్వాత బిజెపి కూడా తెలంగాణలో పూర్తి జోష్‌లో ఉంది. తెలంగాణలో జెండా ఎగరేయడానికి జాతీయ నాయకత్వం కసరత్తు మొదలుపెట్టినట్టు ప్రకటించారు. వేల కోట్ల బ్లాక్‌మనీ, పీకే వ్యూహాలతో వస్తున్న కేసీఆర్ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో షాక్ తప్పదని హెచ్చరిస్తోంది. అయితే వీటిని అధికార పార్టీ ఎక్కడా పెద్దగా ఖండిరచడం లేదు. కానీ
విపక్షాలపై విమర్శల అధికారపార్టీ నాయకులు దాడి పెంచారు. గతంలో కాంగ్రెస్ నేతలు ఆంధ్రా పాలకులకు ఊడిగం చేస్తే.. ప్రస్తుత తెలంగాణ బీజేపీ నేతలు గుజరాత్ నాయకుల వద్ద రాష్ట్ర ప్రయోజనాలు
తాకట్టు పెడుతున్నారని సెంటిమెంట్ రాజేస్తున్నారు. మొత్తానికి తెలంగాణ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. మరి ముందస్తుకు సీఎం వెళతారో లేదో కానీ..ఆ పేరుతో కాంగ్రెస్, బిజెపిలు మాత్రం రాజకీయ హడావిడి చేస్తున్నాయి.