మార్చిలోనే ఠారెత్తిస్తున్న ఎండలు

ఉత్తరాది గాలులతో పెరిగిన ఉష్ణోగ్రతలు

అత్యదికంగగా నల్లగొండలో నమోదు
న్యూఢల్లీి,మార్చి18 (జనంసాక్షి):  ఏప్రిల్‌ నుంచి దంచికొట్టాల్సిన ఎండలు మార్చి మధ్యలోనే తీవ్ర ప్రభావంచూపుతున్నాయి. అప్పుడే ఠారెత్తిస్తున్నాయి. మార్చిలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. మండుటెండలకు జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 8 గంటల నుంచే ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్‌ మొదటి నుంచి ఈ ఎండలు మరింత తీవ్రం కానున్నాయి. వడగాల్పుల ప్రభావం కూడా అధికంగానే ఉండే అవకాశం ఉంది. దేశ వ్యాప్తంగా చూస్తే.. నల్లగొండ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఐఎండీ వెల్లడిరచింది. నల్లగొండ జిల్లా నిప్పుల కుంపటిలా మారింది. గురువారం 43.5 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. మరో 48 గంటల పాటు ఈ తీవ్రత కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఈ ఉష్ణోగ్రతలు మరింత అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది. గతేడాది మార్చిలో 37.4 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. కానీ ఈ ఏడాది మాత్రం అంతకు మించి ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో జనాలు భయపడిపోతున్నారు. ఇక పశ్చిమ రాజస్థాన్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, జమ్మూ డివిజన్‌లోని పలు ప్రాంతాల్లోనూ ఎండలు దంచికొడుతున్నాయి. జమ్మూకశ్మీర్‌, లడఖ్‌, ముజఫరాబాద్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, పంజాబ్‌, రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే 5.1 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతున్నాయి. గుజరాత్‌, మహారాష్ట్రలోని మరఠ్వాడ,వెస్ట్‌ బెంగాల్‌, సిక్కిం, నాగలాండ్‌, మణిపూర్‌, మిజోరం, త్రిపుర, ఉత్తరాఖండ్‌, ఈస్ట్‌ మధ్యప్రదేశ్‌, తెలంగాణలో సాధారణ ఉష్ణోగ్రతల కంటే 3 నుంచి 5 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతున్నాయని ఐఎండీ తెలిపింది.