*వృద్ధాశ్రమంలో అన్నదానం ఏర్పాటుచేసిన వేమూరి*


మునగాల, మార్చి 03(జనంసాక్షి): మునగాల మండల పరిధిలోని నరసింహాపురం గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త, అబ్దుల్ కలాం జాతీయ అవార్డు గ్రహీత వేమూరి సత్యనారాయణ, రమాదేవిల వివాహ వార్షికోత్సవం సందర్భంగా మండల పరిధిలోని ముకుందాపురం  గ్రామంలో ఉన్న ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహించి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ, సమాజంలో ఆర్థికంగా ఉన్న ప్రతి ఒక్కరూ సేవా దృక్పథం కలిగి ఉండాలని, నిరాదరణకు గురైన తల్లిదండ్రులను మానసిక వికలాంగులను అనాధల సంరక్షణకు ప్రతి ఒక్కరూ తోడ్పాటును అందించి సహకరించాలని కోరారు. అదేవిధంగా ప్రభుత్వాలు అనాధ శరణాలయాలు వృద్ధాశ్రమాలు లేని సమాజాన్ని తయారు చేసే విధంగా ప్రతి ఒక్కరికి కనీసం కూడు,గుడ్డ,గూడు అందేలా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ తల్లి వేమూరి సుగుణమ్మ, కుమారుడు వేమూరి పార్థీవ్ చౌదరి, బారి లక్ష్మయ్య, షేక్ హస్సేన్ మియా, రేవూరి బాబు తదితరులు పాల్గొన్నారు.