- కంటి క్యాన్సర్ తో బాధ పడుతున్న చిన్నారికి హెల్పింగ్ హ్యాండ్ అండ
- రూ. 74,415 ఆర్థిక సహాయం అందజేత
మంథని, మార్చి 18, జనంసాక్షి : కంటి క్యాన్సర్ తో బాధ పడుతున్న పేద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం గొల్లపల్లి గ్రామనికి చెందిన జిల్లాల సుమలత అశోక్ కూతురు శివన్షి కి హెల్పింగ్ హాండ్స్ ఆఫ్ కమాన్ పూర్ అండగా నిలిచింది. " చిన్నారి కంటిని కాపాడారు.. కంటి క్యాన్సర్ తో బాధపడుతున్న నాలుగేళ్ల చిన్నారి, వైద్యానికి రూ. 10 లక్షల వరకు ఖర్చవుతుందని డాక్టర్ల వెళ్ళడి, చేతిలో చిల్లిగవ్వ లేక దాతల సాయం కోసం ఎదురుచూపు " అనే శీర్షికతో ఇటీవల జనంసాక్షి లో ప్రచురితమైన ప్రత్యేక కథనానికి కమాన్ పూర్ మండలానికి చెందిన హెల్పింగ్ హ్యాండ్స్ యువకులు స్పందించారు. కంటి క్యాన్సర్ తో పోరాడుతున్న పాప భవిష్యత్తుకి పేదరికం అడ్డుగా నిలవకూడడు అని, హెల్పింగ్ హాండ్స్ సభ్యులు తమ వంతుగా రూ. 74,415 శుక్రవారం పాప తండ్రి జిల్లెల అశోక్ కు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హాండ్స్ అధ్యక్షులు నారగోని సతీష్, మల్యాల విజయ్, మల్యాల నరేష్, రెడ్డి చైతన్య, దొనికేన అఖిల్, దయ్యాల రాజు, మెడగోని సాయి, అనవేన శ్రీధర్ తో పాటు నాగపురి శ్రీనివాస్, మేకల శంకర్ పాల్గొన్నారు.