నిర్భంధం లో మల్లంపల్లి......




అర్ధరాత్రి అక్రమ అరెస్ట్ లు......

నిరసనగా మల్లంపల్లి లో స్వచ్చంద బంద్.....

మండల సాధన కోసం ప్రత్యేక కార్యచరణ.....

మండల ఏర్పాటు జరిగేంతవరకు పోరాటం ఆగదు....

ఛలో ప్రగతి భవన్,అమరణ నిరాహార దీక్షకు సిద్ధం కానున్న సాధన సమితి......

ములుగు,మార్చి05(జనం సాక్షి):-

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక,వైద్య శాఖమంత్రి తన్నీరు హరీష్ రావు  ములుగు జిల్లా  పర్యటనను దృష్టిలో ఉంచుకొని మండలం కోసం కొట్లాడుతున్న మల్లంపల్లి మండల సాధన సమితి నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేశారు. ప్రజాస్వామ్యనికి విరుద్ధంగా అర్ధరాత్రి సుమారు ఒంటి గంటకు సాధన సమితి అధ్యక్షుడు గోల్కొండ రాజు ను, సహాయ కార్యదర్శి ఎడ్ల అనిల్ రెడ్డీ లను తమ ఇంటి నుండి అక్రమంగా అరెస్ట్ చేసి అర్ధరాత్రి స్టేషన్ కు తరలించారు. అంతకు ముందు సాధన సమితి నాయకులు కార్యదర్శి చంద్రయ్య,నాయకులు చంద రాము,కుక్కల సంపత్,గాజు అజయ్,సిహెచ్ శ్రీకాంత్ రెడ్డి, తాళ్ల పెళ్లి సాంబయ్య  ను అరెస్ట్ చేసి ములుగు స్టేషన్ కు తరలించారు. 

అర్ధరాత్రి అరెస్ట్ లు అక్రమం - గ్రామ నాయకులు....

సాధన సమితి నాయకుల అక్రమ అరెస్టులపై గ్రామ నాయకులు పెద్ద ఎత్తున నిరసనలు తెలియచేసారు.
ఈ సందర్బంగా గ్రామ ముఖ్యనాయకులు మాట్లాడుతూ మల్లంపల్లి మండల ఏర్పాటు పై గెలిచిన స్థానిక ప్రజా ప్రతినిధులు ముఖం చాటేసిన,మా ఓట్లతో గెలిచి మమ్మల్ని మోసం చేసిన స్థానిక ప్రజా ప్రతినిధులను నిలదీస్తూ హామీ ఇచ్చి మరచిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్,ఎమ్మెల్సి పల్లారాజేశ్వర్ రెడ్డి దృష్టికి మండల విషయం తీసుకువెళ్లేందుకు చదువుకున్న  బిడ్డలైన యువకులు  మల్లంపల్లి మండల సాధన సమితి పేరుతో ఏకమై చట్టవిరుద్ధమైన కార్యక్రమాలకు దూరంగా కార్యక్రమాలు చేస్తుంటే అర్ధరాత్రులు అరెస్ట్ చేయడం దుర్మార్గమని ఖండిస్తూ స్వచ్చందంగా బంద్ పాటించి విజయవంతం చేయడమే కాకుండా అంబేద్కర్ జంక్షన్ వద్ద పెద్ద ఎత్తున నిరసన గొంతు వినిపించారు.

అక్రమ అరెస్టులతో నిర్భందించడం సిగ్గు చేటు - మండల సాధన సమితి....

అర్ధరాత్రి ఒంటిగంటకు సాధన సమితి  నాయకుల అక్రమ అరెస్టులను, సమితి నాయకులు నిర్భందాలను తీవ్రంగా ఖండించారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని అనచాలనుకోవడం అధికార పార్టీ నాయకుల ముర్కత్వానికి నిదర్శనం.ఈ సందర్బంగా  సమితి నాయకులు భవిష్యత్ కార్యాచరనను ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు, మండల ఏర్పాటు జరిగేంతవరకు పోరాటం ఆగదని, మండల సాధన కోసం ప్రత్యేక కార్యచరణ గా ఛలో ప్రగతి భవన్,అమరణ నిరాహార దీక్ష కార్యక్రమాలను రూపొందించామని తెలిపారు.