కేంద్రానికి లొంగి ఎపిలో బోర్లకు విూటర్లు


తెలంగాణలో భూములు కొని బోర్లేస్తున్నారు

నర్సంపేట పర్యటనలో మంత్రి హరీష్‌ రావు వ్యాఖ్యలు
వరంగల్‌,మార్చి5 (జనం సాక్షి): వరంగల్‌ జిల్లా..నర్సంపేట బహిరంగ సభలో మంత్రి హరీష్‌ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం జగన్‌ కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తెచ్చుకుని మోటార్లకు విూటర్లు పెట్టారని.. విద్యుత్‌ సంస్కరణలను వ్యతిరేకించినందునే కేసీఆర్‌ కేంద్రానికి శత్రువయ్యారని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. వరంగల్‌ జిల్లా నర్సంపేటలో హరీష్‌రావు మాట్లాడుతూ.. తెలంగాణ భూమి కొని బోరువేసి మహారాష్ట్రలో పంటలకు నీరు తీసుకెళ్లే పరిస్థితి వచ్చిందన్నారు. తెలంగాణ వస్తే రాష్‌టరం చీకటి అవుతుందన్న వారు ఇప్పుడు అడ్రస్‌ లేకుండా పోయారని అన్నారు. విద్యుత్‌ సంస్కరణల పేరుతో కేంద్రం రైతులను దోచుకోవాలని చూస్తోందన్నారు. విూ దగ్గరకు వచ్చే బీజేపీ నాయకులను ఈ విషయమై ప్రశ్నించాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు ఆపాలని.. కేంద్రానికి దుర్మార్గులు లేఖ రాశారన్నారు.
బీజేపీ నాయకులు రేపో, మాపో ధరలు పెంచేందుకు సిద్ధమవుతున్నా రన్నారు. గ్యాస్‌ సబ్సిడీ కూడా ఎగ్గొట్టారని.. కేందప్రభుత్వం పేదల ఉసురు పోసుకుంటోందని హరీష్‌రావు విమర్శించారు.
విద్యుత్‌ సంస్కరణలను వ్యతిరేకించినందునే కేసీఆర్‌ కేంద్రానికి శతృవయ్యారన్నారు. విద్యుత్‌ సంస్కరణల పేరుతో కేంద్రం రైతులను దోచుకోవాలని చూస్తోందన్నారు. బీజేపీ నాయకులు నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో 3 టీఎంసీ పనులు ఆపాలని కేంద్రానికి లేఖరాసిన దుర్మార్గులు బీజేపీ నాయకులు అని ఆరోపించారు. ఙఖ ఎన్నికలు అయిపోగానే రేపో, మాపో పెట్రోల్‌ ధరలు పెంచేందుకు బీజేపీ నాయకులు సిద్ధమవుతున్నారన్నారు. గ్యాస్‌ సబ్సిడీ కూడా ఎగ్గొట్టారని విమర్శించారు. కేందప్రభుత్వం పేదల ఉసురు పోసుకుంటోందన్నారు. బేటి బచావో.. భేటి పడావో పేరుతో ప్రచారానికి కోట్లాది రూపాయలు కేటాయించారు తప్ప ఆడబిడ్డల సంక్షేమానికి ఏం నిధులు కేటాయించారో శ్వేతపత్రం విడుదల చేయాలని హరీశ్‌ రావు డిమాండ్‌ చేశారు. నర్సంపేటలో 330 పడకల గల జిల్లా ఆసుపత్రిని రూ. 66కోట్ల ఖర్చుతో ప్రారంభం చేసుకున్నామన్నారు. ఇక నుండి అన్నిరకాల వైద్యసేవలు నర్సంపేటలో అందుబాటులో ఉంటాయన్నారు. పేదలకు వైద్యం దగ్గర చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. నర్సంపేట నియోజకవర్గంలో 26 సబ్‌ సెంటర్‌ లను నర్సంపేట కె మొట్టమొదట మంజూరు చేశామన్నారు. ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు ఒక్కోసబ్‌ సెంటర్‌ కి రూ. 20 లక్షల రూపాయలతో మరో 13 ఏఎన్‌ఎం సబ్‌ సెంటర్లకు మంజూరు చేశామన్నారు. వైద్యంలో మన రాష్టాన్న్రి దేశానికి మార్గదర్శకంగా చేయడమే మన సీఎం ఆశయమన్నారు. ప్రతీ రంగంలో మన రాష్ట్రం దేశానికి ఆదర్శం అవుతోందన్నారు. ఓట్ల కోసం కాకుండా మానవియంగా ఆలోచన చేసిన ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్‌ అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.