హైకోర్టు తీర్పును స్వాగతించిన జెడి శీలం
గుంటూరు,మార్చి4 (జనం సాక్షి ) ): రాజధాని అమరావతి గురుంచి హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నానని కేంద్ర మాజీ మంత్రి జెడి శీలం అన్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ద్వారానే పోలవరం, ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు సాధ్యం అవుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ పాలనకు స్వస్తి చెప్పాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని అన్నారు. కేంద్రాన్ని ఎదురించగలికిన శక్తి కాంగ్రెస్‌కు మాత్రమే ఉందని తెలిపారు. అవినీతిలో టీడీపీ కిటికీలు తెరిస్తే.... వైసీపీ నేతలు తలుపులు తెరిచారన్నారు. వాలంటీర్లు ప్రభుత్వానికి వారధిగా మాత్రమే పనిచేయాలని సూచించారు. కాంగ్రెస్ సభ్యత్వం తీసుకుంటే సంక్షేమ పథకాలు ఆపేస్తామని వాలంటీర్లు బెదిరిస్తున్నారన్నారు. వాలంటీర్లు పొలిటికల్ పార్టీ ఏజెంట్ గా పనిచేస్తే పుట్టగతలు ఉండవని జేడీశీలం హెచ్చరించారు.