ఆయల్ పామ్ సాగుతో మంచి లాభాలు
స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డినిజామబాద్,మార్చి4(జనం సాక్షి ) వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక పద్ధతులు, అధిక లాభాలను అందించే పంటలపై చర్చ జరగాలని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కోటగిరి మండలం పోతంగల్ గ్రామంలో రూ.14 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ..వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ సాగు చేస్తే రైతులకు మంచి లాభాలు వస్తాయన్నారు. దేశంలో అతిపెద్ద కుటుంబం రైతు కుటుంబం. 70 శాతం కుటుంబాలు రైతులవే. రైతులకు ఉపయోగపడటానికి రాష్ట్ర వ్యాప్తంగా 2,600 రైతు వేదికలను నిర్మించామన్నారు. రైతు వేదికలను అన్నదాతలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.