ట్రిపుల్‌ ఆర్‌ విడుదల కోసం ఎదురుచూపులు


ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ పాన్‌ ఇండియా చిత్రం ’ఆర్‌ఆర్‌ఆర్‌’. దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన ఈ మూవీలో టాలీవుడ్‌ స్టార్స్‌ మెగాపవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ పోరాట యోధులుగా నటించారు. అలాగే, బాలీవుడ్‌ స్టార్స్‌ ఆలియా భట్‌, అజయ్‌ దేవగన్‌లతో పాటుగా శ్రీయ శరణ్‌, ఓలివియా మోరీస్‌, సముద్రఖని తదితరులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ట్రైలర్‌కు ముందు వచ్చిన ప్రతీ అప్‌డేట్‌ అందరిలో విపరీతమైన ఆసక్తిని రేకెత్తించగా..మూడు నిమిషాలకు పైగా వదిలిన ట్రైలర్‌ ’ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీపై ఊహించని విధంగా అంచనాలు పెంచేసింది. అత్యంత భారీ స్థాయిలో ఈ నెల 25న అదే స్థాయిలో రిలీజ్‌ కాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్‌ ఓవర్సీస్‌ ఆడియన్స్‌ను ఉద్దేశించి సోషల్‌ విూడియాలో ఓ ఆసక్తికరమైన పోస్ట్‌ను పెట్టారు. ఇంతకముందు ’ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా ఆగిన సమయంలో టికెట్స్‌ బుక్‌ చేసిన ఓవర్సీస్‌ ఆడియెన్స్‌ అందరికీ గాను తిరిగి ఎవరి డబ్బులు వారికి ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు బుకింగ్స్‌ ఓపెన్‌ చేసినా.. వారంతా అంతే ప్రేమను మా సినిమాపై చూపిస్తుండడం చాలా ఆనందంగా ఉంది. ఈ 25న థియేటర్స్‌లో అసలైన భారీ సినిమాటిక్‌ ఎక్స్‌ పీరియన్స్‌ విూకోసం ఎదురు చూస్తుంది.. అని తాజాగా

చేసిన ట్వీట్‌లో ’ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రబృందం పేర్కొనింది. ఈ భారీ చిత్రాన్ని అల్లూరి సీతారామరాజు, కొమురమ్‌ భీమ్‌ జీవిత కథలకు ఫిక్షన్‌ కథాంశాన్ని జోడిరచి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందించారు రాజమౌళి. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.