రెండు నగరాలపై బాంబు దాడులను నిలిపేత
విదేశీయులు తిరిగి వెళ్లేందుకే అని రష్యా ప్రకటన
మాస్కో,మార్చి5 (జనం సాక్షి): ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా కాసేపు కాల్పుల విరమణను ప్రకటించింది. రెండు నగరాల్లో మానవతావాద సాయం అందజేయడానికి వీలుగా శనివారం తాత్కాలికంగా కాల్పుల విరమణ పాటిస్తామని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మాస్కో స్థానిక సమయం ప్రకారం మార్చి 5న ఉదయం 10 గంటల నుంచి కాల్పుల విరమణ ప్రారంభమవుతుందని తెలిపింది. మరియు పోల్, వోల్నోవాకా నగరాల నుంచి సాధారణ ప్రజలు బయటకు వెళ్ళటానికి వీలుగా మానవాతా వాద నడవ (కారిడార్)లను తెరుస్తున్నట్లు తెలిపింది. మరియుపోల్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత కొద్ది రోజుల నుంచి విద్యుత్తు, తాగునీరు, ఆహారం, హీటింగ్, రవాణా సదుపాయాలను రష్యా దళాలు నిలిపేశాయి. రెండో ప్రపంచ యుద్ధంలో లెనిన్‌గ్రాడ్‌ను నాజీ దళాలు దిగ్బంధించిన రోజులు గుర్తుకొ చ్చాయి. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించిన తాత్కాలిక కాల్పుల విరమణ సుమారు ఐదున్నర గంటలపాటు అమలవుతుందని తెలుస్తోంది. ఉక్రెయిన్‌లో దాడులకు దిగుతున్న రష్యా తాజాగా కాల్పుల విరమణ ప్రకటించింది. దీంతో యుద్దానికి తాత్కాలికంగా బ్రేక్ పడిరది. భారత కాలమానం ప్రకారం.. ఈరోజు ఉదయం 11.30 గంటలకు కాల్పులను ఆపేసినట్లు రష్యా వెల్లడిరచింది. ఐదున్నర గంటల పాటు ఎలాంటి దాడులు జరపమని స్పష్టం చేసింది. ఉక్రెయిన్‌లో ఉన్న విదేశీయులను తరలించడంతో పాటు దేశ పౌరులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు ఈ విరామం ప్రకటించినట్లు వెల్లడిరచింది. ఈ మేరకు విదేశీయుల తరలింపునకు సహకరిస్తామని యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ (యూఎన్‌హెచ్‌ఆర్సీ) కు రష్యా తెలిపింది. మానవతా దృక్పథంతో విరామం ఇచ్చామని రష్యా పేర్కొంది. విదేశీయులు త్వరితగతిన ఉక్రెయిన్ వీడాలని సూచించింది. కేవలం కాల్పుల విరామం మాత్రమే ఇచ్చామని.. పూర్తిస్థాయిలో యుద్దాన్ని ఆపలేదని స్పష్టత ఇచ్చింది. మరోవైపు ప్రపంచ దేశాల ఒత్తిడితోనే రష్యా ఈ యుద్ధ విరామ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రష్యా తాజా నిర్ణయంతో పది రోజుల నుంచి జరుగుతున్న యుద్దానికి తాత్కాలికంగా కొన్ని గంటలు బ్రేక్ పడిరది.