బిజెపి నేతల తీరును ఖండిరచిన కుల సంఘాలు
మహబూబ్‌నగర్,మార్చి4(జనంసాక్షి) : మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బీజేపీ నాయకులు మంత్రిని హత్య చేసేందుకు కుట్ర పన్నారని వివిధ సంఘాల నేతలు అన్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. మంత్రిపై కుట్ర దారుణమని మహబూబ్‌నగర్ అఖిలభారత యాదవసంఘం నాయకులు ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో విూడియా సమావేశంలో వారు మాట్లాడారు.జిల్లాను ఏడు సంవత్సరాల కాలంలో ఊహించనంతగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభివృద్ధి చేశారన్నారు. రాత్రనక, పగలనక తన నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న నాయకుడిపై ఈ విధమైన చర్యలకు ప్రయత్నిస్తే ఊరుకునేది లేదన్నారు. అలాంటి వారికి తగిన బుద్ధి చెప్తామన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ జోలికి వస్తే దళిత సంఘాలు ఉరుకోవని మంత్రి పై జరిగిన హత్య కుట్రను ఖండిస్తున్నా మని జిల్లా దళిత సంఘాల నేతలు అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా దళిత సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని టీఆర్‌ఎస్ కార్యాలయంలో విూడియాతో మాట్లాడారు. మంత్రి జిల్లాను అభివృద్ధిలో అగ్రభాగాన నిలిపేందుకు విశేషంగా కృషి చేస్తున్నారని తెలిపారు. మంత్రి ఎదుగుదలను చూసి తట్టుకోలేకనే హత్యకు కుట్రపన్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి సంఘటనలకు చోటులేదన్నారు. మంత్రిపై జరిగిన కుట్రను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
అభివృద్ధిని చూసి ఓర్వలేకనే హత్యకు కుట్ర