జనరల్‌ రోడ్రిగ్స్‌ కన్నుమూత


చంఢీఘడ్‌,మార్చి4( జనంసాక్షి ) :  భారత ఆర్మీ మాజీ చీఫ్‌ జనరల్‌ సునిత్‌ ఫ్రాన్సిస్‌ రోడ్రిగ్స్‌ శుక్రవారం కన్నుమూశారు. ఆయన వయసు 88 సంవత్సారలు. 1990 నుంచి 1993 వరకు ఆయన ఇండియన్‌ ఆర్మీ చీఫ్‌గా చేశారు. 2004 నుంచి 2010 వరకు పంజాబ్‌ గవర్నర్‌గా కూడా చేశారు. 1933లో ఆయన ముంబైలో జన్మించారు. మాజీ ఆర్మీ చీఫ్‌ మృతి పట్ల జనరల్‌ ఎంఎం నరవాణెళి తో పాటు ఇతర ఆఫీసర్లు నివాళి అర్పించారు. ఆలోచనాపరుడిగా, వ్యూహాకర్తగా రోడ్రిగ్స్‌కు ప్రత్యేక గుర్తింపు ఉన్నది. అకుంఠిత దీక్షతో ఆయన దేశ సేవలో పాల్గొన్నట్లు ఆర్మీ తెలిపింది.