ములుగు జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం

ఆటోను ఢీకొన్న డిసిఎం..ఆరుగురు దుర్మరణం

క్షతగాత్రులను వరంగల్‌ ఎంజిఎంకు తరలింపు
ములుగు,మార్చి5 (జనం సాక్షి):  ములుగు జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వెంకటాపూర్‌ మండలంలోని జవహార్‌నగర్‌ దగ్గర ఆటో`డీసీఎం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన వెంకటాపురం మండలం ఎర్రిగట్టమ్మ వద్ద చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులంతా మంగపేట మండలం కోమటిపల్లికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు.అన్నారం షరీఫ్‌ దర్గాకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఎర్రిగట్టమ్మ వద్ద జాతీయ రహదారిపై ఓ ఆటోను డీసీఎం ఢీకొట్టింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం ధాటికి ఆటో నుజ్జునుజ్జు అవగా, మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఓ మహిళ, ఆటో డ్రైవర్‌ ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను వరంగల్‌ ఎంజీఎం దవాఖానకు తరలించారు. ఘటనా స్థలంలోనే ఇద్దరు మరణించగా, దవాఖానకు తరలిస్తుండగా మరో ఇద్దరు చనిపోయారని పోలీసులు తెలిపారు. మృతులు మంగపేట మండలం కోమటిపల్లికి చెందిన అజయ్‌ (12), కిరణ్‌ (16), కౌసల్య (60), డ్రైవర్‌ జానీ (23) గా గుర్తించారు. పల్లె బోయిన పద్మ, రసూల్‌, వెన్నెల, వసంత తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. వీరంతా అన్నారం షరీఫ్‌ దర్గాకు వెళ్లివస్తుండగా ప్రమాదం జరిగిందని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.