ఉడ్‌ కాంప్లెక్స్‌ సవిూపంలో మంటలు


పూర్తిగా దగ్ధమైన 8 బస్సులు

ఒంగగోలు,మార్చి1 (జనం సాక్షి):ఒంగోలు ఉడ్‌ కాంప్లెక్స్‌ సవిూపంలో మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతంలో పార్కింగ్‌ చేసిన ప్రయివేటు బస్సులకు మంటలు అంటుకున్నాయి. దీంతో 8 బస్సులు పూర్తిగా కాలిపోయాయి. వీటి పక్కనే మరో 20 బస్సులు ఉన్నాయి. ఈ బస్సులకు మంటలు వ్యాపించకుండా పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది యత్నించారు. 4 ్గªరిరజన్లతో మంటలను అదుపు చేశారు.
అగ్నిప్రమాదంలో కాలిపోయిన బస్సులు తమవే అని కావేరి ట్రావెల్స్‌ యజమాని వెంకటేశ్వర్లు తెలిపారు. కొవిడ్‌ కారణంగా బస్సులకు డిమాండ్‌ తగ్గడంతో ఉడ్‌ కాంప్లెక్స్‌ సవిూపంలోని పార్కింగ్‌లో ఉంచినట్లు ఆయన చెప్పారు. ఈ ప్రమాదంతో రూ. 6 కోట్ల వరకు నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు.