పలువురు ఐపిఎస్‌లకు తాత్కాలిక పోస్టింగ్‌లు

హైదరాబాద్‌,మార్చి5 (జనం సాక్షి): రాష్ట్రంలో పలువురు ఐపీఎస్‌లకు ప్రభుత్వం తాత్కాలిక పోస్టింగులు ఇచ్చింది. హైదరాబాద్‌ పరిపాలనా విభాగం సంయుక్త కార్యదర్శిగా రమేశ్‌రెడ్డి, హైదరాబాద్‌ మధ్య మండల డీసీపీగా రాజేశ్‌ చంద్రను ప్రభుత్వం నియమించింది. అలాగే హైదరాబాద్‌ దక్షిణ మండల డీసీపీగా సాయి చైతన్య, హైదరాబాద్‌ తూర్పు మండల డీసీపీగా సతీశ్‌లను నియమించింది. మరోవైపు సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ విజయ్‌కుమార్‌ను ఆకస్మికంగా బదిలీ చేసింది. ఆయనను డీజీపీ కార్యాలయానికి అటాచ్‌ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. అయితే రెండ్రోజుల కిందే డీసీపీ విజయ్‌ కుమార్‌ బదిలీ కావడం గమనార్హం.