ఏలూరు,మార్చి4 ( జనంసాక్షి ) : పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ అవినీతి అధికారిని ఏసీబీ అధికారులు రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు. దెండులూరు ఏపీఈపీడీపీఎల్‌లో ఏఈగా పనిచేస్తున్న కూచిపూడి శ్రీనివాస్ అనే అధికారి రైతు వద్ద రూ. 50వేల లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. చేపల చెరువుకు కమర్షియల్ సర్వీసు ఇవ్వడానికి లంచం డిమాండ్ చేయగా బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
బాధితుడు నుంచి ఏఈ రూ.50వేల తీసుకుంటుండగా రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు. అతడిపై అవినీతి నిరోధక చట్టం ప్రకారం అతడిపై కేసు నమోదు చేశారు. అనంతరం ఏసీబీ కోర్టుకు తరలించారు.
ఎసిబి వలలో విద్యుత్ ఎఇ