పదిరోజులయినా చల్లారని రావణకాష్టం

యుద్దాన్ని ఎగదోసేలా యూరప్‌ దేశాల తీరు
శాంతి చర్చలకు ముందుకు రాని ప్రపంచ దేశాలు
యుద్ద నివారణ చర్యలకు పడని అడుగు
ఉక్రెయిన్‌ యుద్దం కొనసాగితే మరింత ముప్పు
న్యూఢల్లీి,మార్చి5 జనం సాక్షి : ఉక్రెయిన్‌పై రష్యా దాడి మొదలు పెట్టి పదిరోజులుకావస్తోంది. దాడులతో ఉక్రెయిన్‌ అతలాకుతలం అవుతోంది. ప్రపంచదేవాలు సమస్యలను రాజేస్తూ ..ఎగదోస్తున్నాయే తప్ప యుద్దాన్ని నివారించేందుకు రంగంలోకి దిగడంలేదు. ఉక్రెయిన్‌ తగబడుతున్నా దేశాద్యక్షుడు జెలెన్‌స్కీ ఇంకా బీరాలతో ప్రగల్బాలుపలుకుతున్నారు. తన కారణంగగా ఉక్రెయిన్‌ సర్వనాశనం అవుతుందని
గమనించడంలేదు. నాటో దేశాల రెచ్చగగొట్టే వ్యాఖ్యలు,అమెరాక సాయం అందిస్తమానిచేస్తున్న ప్రకనటతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. అంతేగాని యుద్ద నివారణ చర్యలకు ముందుకు రావాడం లేదు. దీంతో
ఏది జరగకూడదని అనుకున్నామో చివరకు అదే జరిగింది. ఉక్రెయిన్‌ నుంచి ముప్పుందనీ, నిస్సైని కీకరణ తమ లక్ష్యమంటూ పొరుగున ఉన్న రష్యా ఆ దేశంపై భూ, వాయు, జల మార్గాల్లో ముప్పేటదాడికి దిగింది. తూర్పు ఉక్రెయిన్‌లో తాను స్వతంత్రమైనవిగా గుర్తించిన రెండు తిరుగుబాటు రిపబ్లిక్‌లలోకి చొచ్చుకువచ్చి, మిగతా దేశంపై దురాక్రమణకు తెగబడిరది. సైనిక ఆపరేషన్లు మాత్రమేనని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ చెబుతున్నా, రాజధాని కీవ్‌ సహా కనీసం 8 నగరాలపై దాడులతో వందలకొద్దీ ప్రాణాలు పోతున్నాయన్న వార్త ఆందోళన కలిగిస్తోంది. పది రోజులవుతున్నా యూరప్‌ దేశాలు రష్యాను రెచ్చగొడుతూనే ఉన్నాయి తప్ప యుద్ద నివారణకు పూనుకోవడం లేదు. 1990ల తర్వాత యూరప్‌ చూడని యుద్ధమిది. అమెరికా, బ్రిటన్‌, జర్మనీ, యూరోపియన్‌ యూనియన్‌ సహా వివిధ దేశాలు ఉక్రెయిన్‌పై దాడిని ఖండిస్తున్నాయి. ఇది ఉద్దేశపూర్వకంగా, దీర్ఘకాలిక పథకంతో రష్యా చేసిన దురాక్రమణ అంటూ నాటో ప్రకటించింది. ఆధునిక కాలంలో మునుపటి ప్రభావం కోల్పోయిన ఐక్యరాజ్యసమితి (ఐరాస) సహా ఈ దేశాలు పరిస్థితి చేయి దాటే దాకా ఏం చేస్తున్నాయన్నది ప్రశ్న. మిత్రదేశం బెలారస్‌తో కలసి రష్యా సైనిక విన్యాసాలు చేసినా, మూడు నెలలుగా ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో 1.5 లక్షల సైనిక బలగాలను మోహరిస్తున్నా నివారించలేకపోయాయి. దాడికి తెగబడితే ఊరుకోబోమంటూ మాటలు చెప్పడమే తప్ప, శాంతి స్థాపనకు చిత్తశుద్ధితో కృషి చేయ లేదు. ఉక్రెయిన్‌ను ’నాటో’లో చేర్చుకోబోమంటూ ఒకప్పుడిచ్చిన మాటకు నేటికీ కట్టుబడి ఉంటామని అమెరికా చెప్పలేకపోయింది. ఉక్రెయిన్‌ గనక ’నాటో’లో చేరితే, అప్పుడిక ’నాటో’ సైన్యాల దాడికి తాము కూతవేటు దూరంలోనే ఉంటామన్న రష్యా భయాందోళనల్నీ పోగొట్టలేకపోయింది. అయితే, ఎవరు,
నిజానికి, అమెరికాకు ఉన్న యుద్ధప్రీతి మరే దేశానికీ లేదనేది ప్రపంచ చరిత్ర. ఇప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్‌లో దాగిన నియంతృత్వ ధోరణికీ ఉక్రెయిన్‌ సంక్షోభం ఓ ఉదాహరణగా చూడాలి. అలాగే ఉక్రెయిన్‌ కూడా తన మాతృసంస్థ అయిన సోవియట్‌లో భాగంగా ఉన్నరష్యాను నమ్మకుండా అమెరికా లాంటి దేశాన్ని నమ్మి యుద్దాన్ని కోరి తెచ్చుకోవడం కూడా తప్పే. అమెరికన్‌ పాశ్చాత్య ప్రపంచానికి పాఠం నేర్పాలనే రష్యా వైఖరి వెనుక చైనా హస్తం కూడా ఉందన్న విమర్శలు లేదా ఆరోనణలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో ఉక్రెయిన్‌కు మద్దతిస్తున్న దేశాలు, రష్యా అనుకూల దేశాలు, తటస్థ దేశాలు అంటూ ప్రపంచం మూడు ముక్కలైంది. ఇటు రష్యా, అటు అమెరికాలలో ఎటువైపూ మొగ్గకుండా, ఉక్రెయిన్‌ వ్యవహారంలో భారత్‌ సంయమనం పాటించిన తీరు కూడా అవసరమే. ఈ క్రమంలోనే మనవాళ్ళను సురక్షితంగా స్వదేశానికి తేవడమే ప్రాధాన్యంగా కేంద్రం కదిలిన తీరు కూడా అభినందనీయమే. యుద్ధ ప్రభావంతో స్టాక్‌మార్కెట్‌ పతనం, పసిడి ధర 30 శాతం పెరగడం, అంతర్జాతీయ చమురు ధరకూ రెక్కలు రావడం రానున్న గడ్డుకాలానికి సూచన. రేపు రవాణా ఖర్చులు సహా అన్నీ ఎక్కువై, ధరలు పెరిగి, మన సామాన్యులూ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇది పూర్తిస్థాయి ప్రపంచ యుద్ధంగా పరిణమిస్తే మరింత సంక్షోభం తప్పదు. ఐరాస నిర్వీర్యమైన నేపథ్యంలో ఉక్రెయిన్‌ కథ స్ఫూర్తితో రేపు తైవాన్‌ విూద చైనా దాడి లాంటివీ మొదలైతే కష్టమే. అందుకే ఈ యుద్దాన్ని నివారించి శాంతి స్థాపన లక్ష్యంగగా ప్రపంచ దేశాలు ముందుకు రావాలి.