హరితశోభితం ..!

మనిషి నాగరికత పేరిట …

నీచానికి ఒడిగడుతున్నాడు


అభివృద్ధి మాటున ...

పచ్చటి వృక్షాల తెగనరికి

వనాల అన్యాక్రాంతం చేసి


మట్టి పొరల కుళ్లబోడిచి

ఖనిజ సంపదలను కాజేసే

పుడమిని ఎడారి చేస్తున్నాడు


పరిశ్రమలు, కర్మాగారాల

విసర్జిత కల్మసాల విరజిమ్మి

జలాల విషం గావిస్తున్నాడు

దాహార్తితో తల్లడిల్లుతున్నాడు


సకల ప్రాణుల కడతేర్చి 

కడుపార భుజిస్తున్నాడు

జీవరహిత లోకంగా మార్చి

ఏకాకిగా దుఃఖపోస్తున్నాడు


అహంకారం తలకెక్కి

సహజ సంపదల కొల్లగొట్టి

పర్యావరణానికి సామాది కట్టి

ప్రకృతిని  పరిహాషిస్తున్నాడు

పంచభూతాల వంచిస్తున్నాడు


ఈ వికృత వైఖరి వీడకుంటే

వినాశక చేష్టలు మానకుంటే

మనుగడ అంధకార బంధురం

ప్రపంచం శిథిల శకలాల చందం


ఇకనైనా ...

మార్పుకు శ్రీకారం చుడితే

మనిషి అస్తిత్వం సుస్థిరం 

జగతి హరితవర్ణ శోభితం

              """"""""""""""""

              కోడిగూటి తిరుపతి

             Mbl no :9573929493