ఎల్‌ఐసి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరు

సంతకాల ఉద్యమం చేపట్టనున్న ఎల్‌డిఎఫ్‌

తిరువనంతపురం,మార్చి18  (జనంసాక్షి):  జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసి ప్రయివేటుపరం కాకుండా పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపైనా ఉందని కేరళలోనివామపక్ష ప్రజాతంత్ర సంఘటన ఎల్‌డిఎఫ్‌ పిలుపునిచ్చింది. ’ఐక్యంగా పోరాడుదాం..ఎల్‌ఐసినికాపాడుకుందాం’ నినాదంతో ఖాతాదారులను,
ఉద్యోగ సంఘాలను ఒక్కతాటిపై తీసుకొచ్చి పోరు సల్ఫేందుకుసిద్ధమైంది. ఇందులో భాగంగా ఉద్యోగుల సంఘాలు, ఎల్‌ఐసి పాలసీదార్లతో కొచ్చిలో భారీ సదస్సు నిర్వహించినట్లు సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు థామస్‌ ఐజాక్‌ ట్వీట్‌ చేశారు. ప్రయివేటీకరణకువ్యతిరేకంగా మే నెల ఒకటో తేదీ నుంచి పాలసీదార్లతో దాదాపు 10 వేల సమావేశాలు నిర్వహించనునుట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటు కంపెనీలకు కట్టబెట్టే విధానాలు మానుకోవాలనికేంద్ర ప్రభుత్వాని డిమాండ్‌ చేస్తూ సంతకాల సేకరణోద్య మాన్ని కూడా ఇందులో భాగంగా చేపట్టనునుట్లు ఆయన పేర్కొన్నారు. ఎల్‌ఐసి ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రవేశపెట్టిన తీర్మానాని కేరళ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించిన సంగతి తెలిసిందే.