సమాజమనుగడకు మూలం మహిళలు


` మంత్రి నిరంజన్‌రెడ్డి
హైదరాబాద్‌,మార్చి 10(జనంసాక్షి): ఆడబిడ్డలను గౌరవించుకోలేని సమాజం ఉన్నతంగా ఎదగలేదు. భారతీయ సంస్కృతిలో మహిళలకు విశిష్ట స్థానం ఉందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గురువారం శాసనసభలోని తన ఛాంబర్‌ లో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునిత, ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యేలు సీతక్క, బానోతు హరిప్రియ, పద్మా దేవేందర్‌ రెడ్డి, రేఖా నాయక్‌ను సత్కరించారు.ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌ రెడ్డి మాట్లాడుతూ..మహిళలకు మన సమాజంలో ఇస్తున్న గౌరవం, స్వేచ్ఛ మరింత పెరగాలన్నారు. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే మన దేశంలో ఆడబిడ్డలకు అంత గౌరవం లభించడం లేదన్నారు. ఈ పరిస్థితిలో మరింత మార్పు రావాలన్నారు. అలాగే వ్యవసాయరంగంలో మహిళల పాత్ర ఎంతో కీలకం అన్నారు. మహిళలు నాయకత్వం వహించే ఏ రంగమైనా ఖచ్చితంగా ఉన్నతస్థానంలో ఉంటుందన్నారు.