పూర్తయిన ఇళ్లు ఇచ్చేదెప్పప్పుడు


-ముళ్లకొంపలుగా మారిన గోనుపాడు డబుల్ బెడ్ రూమ్స్

-గద్వాల జిల్లా లోని దౌలుసాబ్ దగ్గర 500 ఇళ్లు పూర్తి

- పేదల ఇళ్ల తో ఆటలాడుతున్న రాజకీయ నాయకులు,అధికారులు..

- కనికరించని సీఎం కేసీఆర్, కేటీఆర్,హరీష్ రావు

-2 నెలలుగా ఐనా ఇవ్వని వైనం

- ఎదురుచూస్తున్న లబ్ది దారులు

గద్వాల ప్రతినిధి (జనంసాక్షి):- డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలు పూర్తయినా ఇంకా కేటాయింపులు జరగడంలేదు. దీంతో తమకు ఎప్పుడెప్పుడు తమకు ఇళ్లు కేటాయిస్తారా అని లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు.  గద్వాల పరిధిలోని, గోనుపాడు దగ్గర 500 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. వీటి ప్రారంభానికి నోచుకోవడం లేదు కోసం మూడు నెలలుగా లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. పేదల సొంతింటి కల నెరవేర్చడానికి ప్రభుత్వం డబుల్‌ బెడ్‌ ఇళ్ల నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే.ఇందులో భాగంగా గగద్వాల పరిధిలోని దౌలుసాబ్ దగ్గర, గోనుపాడు దగ్గర కలిపి 500 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు నిర్మాణం అన్ని హంగులతో పూర్తయిు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ ప్రాజెక్టుకు కొన్ని వేల కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది. మూడు నెలల క్రితం ఇళ్ల నిర్మాణం పూర్తి అయ్యింది. అన్ని విధాలుగా పూర్తయిపోయిన వీటిని వెంటనే లబ్ధిదారులకు కేటాయించాలని కోరుకుంటున్నారు..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిరుపేద కుటుంబంలో వెలుగులు విరజిమ్మే విధంగా రెండు పడకల గృహాలను నిర్మించి ఇస్తామని ఎన్నికలలో.. ఎక్కడ సభలు సమావేశాలు జరిగిన పదేపదే రెండు పడకల ఇల్లు ఇస్తామని చెప్పడమే కాకుండా ఇంతవరకు అందుబాటులోకి తీసుకుని రాలేదని నిరుపేద బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..ఇప్పటి వరకు పూర్తి అయిన ఇండ్లను నిరుపేద కుటుంబాలకు ఇచ్చి వినియోగంలోకి తీసుకురావడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు..మంత్రులు తారక రామారావు..హరీష్ రావు..స్థానిక ఎమ్మెల్యేలు,అధికారులు త్వరితగతిన చర్యలు చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వాని నడిగడ్డ ప్రజలు కోరుతున్నారు...

పూర్తి అయిన డబుల్ బెండ్ రూమ్ లు పూర్తి అయిన ఇంట్లో నిరుపేద లకు బదులుగా రాజకీయ నాయకులు తమ స్వంత ప్రయోజనాలకు అనుగుణంగా వాడుకుంటున్నారని విశ్వసనీయ సమాచారం... అందుకు కారణం అధికారుల నిర్లక్ష్యం వీడి ఇప్పటికైనా అధికారులు డబుల్ బెండ్ రూమ్ లపై నిఘా ఉంచాలని ఆరోపణలు వస్తున్నాయి...
Attachments area