తిరుపతి,మార్చి1 (జనం సాక్షి):కపిల తీర్థంలోని ఈశ్వరాలయం వద్ద పోలీస్, అటవీశాఖల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దర్శనం చేసుకుని వెలుపలకు వచ్చే భక్తుల కోసం అటవీశాఖ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన క్యూ వద్ద పోలీసు, అటవీశాఖ సిబ్బంది మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ జరిగింది. క్యూ లైన్ విూదుగా అటవీశాఖ సిబ్బంది తమ కార్యాలయానికి వెళ్లాలని ప్రయత్నించారు. ఈ ప్రయత్నానికి పోలీసులు తిరస్కరించారు. అటవీశాఖ సిబ్బంది గుర్తింపు కార్డులు చూపించి కార్యాలయానికి వెళ్లాలని విధుల్లో ఉన్న
పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ పరిస్థితుల్లో అటవీశాఖ, పోలీసుల మధ్య తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు జరిగాయి. ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకున్నారు. దీంతో కొంత రెచ్చిపోయిన అటవీశాఖ సిబ్బంది పోలీసులపై దురుసు ప్రవర్తనకు దిగారు. వీరిద్దరి వాగ్వాదంతో భక్తులు నివ్వెరపోయి చూస్తూ ఉండిపోయారు.
కపిలేశ్వరాలయం వద్ద ఉద్రిక్తత