మహిళాదినోత్సవ వేడుకలు జరుపుకుంటాం: మేయర్
నిజామాబాద్,మార్చి4 (జనం సాక్షి ) : గత ప్రభుత్వాల్లో మహిళలకు తగిన అవకాశాలు లేవని, తెలంగాణ వచ్చిన తరవాతనే అవకాశాలు పెరిగాయని నిజామాబాద్ మేయర్ నీతుకిరణ్ అన్నారు. మహిళలు ఆకాశంలో సగం ఉన్నా..గత ప్రభుత్వాల తీరుతో అవకాశాల్లో అట్టడుగున ఉండాల్సి వచ్చిందన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చాక 70 ఏండ్లలో సాధ్యం కానిది సీఎం కేసీఆర్ ఏడేండ్లలో సుసాధ్యం చేశారని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మూడు రోజుల పాటు మహిళా దినోత్సవ వేడుకలు జరపాలని పార్టీ నిర్ణయించిందని తెలిపారు. ఇది ఓ మంచినిర్ణయమని, మహిళలకరు దక్కిన అవకాశాల గురించి చర్చించే అవకాశం ఏర్పడిరదన్నారు. ఈ కార్యక్రమాల్లో కేసీఆర్ ప్లెక్సీలకు రాఖీ కట్టడం, పని చేస్తున్న మహిళలను గౌరవించడం, సన్మానించడం, ప్రాంతంలో మహిళలకు జరిగే అభివృద్ధి వివరించడం వంటి పనులు చేపడుతామన్నారు. రాష్ట్రంలో మహిళల కోసం జరుగుతున్న అభివృద్ధిని వివరిస్తామన్నారు. ఇందులో మహిళలంతా భారీ ఎత్తున పాల్గొనాలని మేయర్ పిలుపునిచ్చారు.