.భారీగా పెరిగిన ఆర్టీసీ బస్‌పాస్‌ ఛార్జీలు


` పెరిగిన ధరలు ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి
హైదరాబాద్‌,మార్చి 28(జనంసాక్షి): ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ (టీఎస్‌ ఆర్టీసీ) వరుస షాక్లు ఇస్తోంది. ఇప్పటికే ప్యాసింజర్‌ సెస్‌ పేరుతో ఎక్స్ప్రెస్‌, డీలక్స్‌ సూపర్‌ లగ్జరీ, రాజధాని, గరుడ బస్సుల్లో టికెట్‌ రేట్లు పెంచింది. ఇవి పెంచిన కొన్ని గంటల వ్యవధిలోనే జనరల్‌, ఎన్జీవోస్‌ బస్పాస్‌ ఛార్జీలను అమాంతం పెంచుతూ టీఎస్‌ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. బస్పాస్ల ధరలను గరిష్ఠంగా రూ.500 పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
జనరల్‌ బస్పాస్‌.. పెరిగిన ఛార్జీల వివరాలు ఇలా..
ఆర్డినరీ బస్పాస్‌ ` రూ.950 నుంచి రూ.1,150కి పెంపు,మెట్రో ఎక్స్ప్రెస్‌ బస్పాస్‌ ` రూ.1,075 నుంచి రూ.1,300కి పెంపు.మెట్రో డీలక్స్‌ బస్పాస్‌ ` రూ.1,185 నుంచి రూ.1,450కి పెంపు.పుష్పక్‌ పాస్‌ ` రూ.2,500 నుంచి రూ.3,000కి పెంపు.
ఎన్జీవోల బస్పాస్‌.. పెరిగిన ఛార్జీల వివరాలు ఇలా..
ఆర్డినరీ బస్పాస్‌ ` రూ.320 నుంచి రూ.400కి పెంపు.మెట్రో ఎక్స్ప్రెస్‌ బస్పాస్‌ ` రూ.550కి పెంపు.మెట్రో డీలక్స్‌ బస్పాస్‌ ` రూ.575 నుంచి రూ.700కి పెంపు.ఎంఎంటీఎస్‌`ఆర్టీసీ కాంబో టికెట్‌ ఛార్జీని రూ.1,350కి పెంచుతూ టీఎస్‌ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. పెరిగిన బస్పాస్‌ ఛార్జీలు ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది.