AL NEWS

 

1.విశ్వాసపరీక్ష జరగకుండానే పాక్‌ జాతీయ అసెంబ్లీ రద్దు
` ఆపద్ధర్మ ప్రధానిగా ఇమ్రాన్‌ ఖాన్‌!
` 90 రోజుల్లోనే ఎన్నికలు
ఇస్లామాబాద్‌,ఏప్రిల్‌ 2(జనంసాక్షి): పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ జరుగుతుందనుకున్న వేళ అక్కడ కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.ప్రధానిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ నేషనల్‌ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ ఖాసీం ఓటింగ్‌ను తిరస్కరించారు. ఇదే సమయంలో జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌.. ముందస్తు ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రధాని చేసిన సూచన మేరకు జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తూ పాకిస్థాన్‌ అధ్యక్షుడు ఆరిఫ్‌ అల్వీ ప్రకటించారు. జాతీయ అసెంబ్లీ రద్దు అయినప్పటికీ పాకిస్థాన్‌ ఆపద్ధర్మ ప్రధానిగా ఇమ్రాన్‌ ఖాన్‌ కొనసాగనున్నారు. అయితే, తాజా పరిణామాలపై ప్రతిపక్షాలు సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్లు ప్రకటించాయి.ప్రధానిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం ఓటింగ్‌ నేపథ్యంలో ఇమ్రాన్‌ ఖాన్‌ సభకు హాజరుకాలేదు. ముందస్తు వ్యూహం ‘ప్లాన్‌`బీ’తో ఉన్న ఇమ్రాన్‌ ఖాన్‌.. పాకిస్థాన్‌ అధ్యక్షుడు ఆరిఫ్‌ అల్వీతో భేటీ అయ్యారు. అక్కడ నెలకొన్న రాజకీయ పరిస్థితులను అధ్యక్షుడికి వివరించిన ఇమ్రాన్‌, జాతీయ అసెంబ్లీని రద్దు చేయాలని కోరినట్లు జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ఇమ్రాన్‌ వెల్లడిరచారు. అందుకు అనుగుణంగానే జాతీయ అసెంబ్లీ రద్దు చేస్తున్నట్లు అధ్యక్షుడు ఆరిఫ్‌ అల్వీ ప్రకటించారు. దీంతో 90 రోజుల్లోనే పాకిస్థాన్‌లో ఎన్నికలు జరుగనున్నాయి.జాతీయ అసెంబ్లీ రద్దుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ ఛైర్మన్‌ బిలావల్‌ భుట్టో జర్దారీ పేర్కొన్నారు. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ జరగకుండా చేసిన ఇమ్రాన్‌ ప్రభుత్వం, రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందన్నారు. పాకిస్థాన్‌ రాజ్యాంగాన్ని పరిరక్షించడంలో భాగంగా అన్ని వ్యవస్థల తలుపులు తడుతామన్నారు. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామన్న ఆయన.. ఈ కేసును ఈరోజే విచారించాలని కోరుతామని వివరించారు. ఈ విషయంలో విపక్ష పార్టీలన్నీ ఒకే తాటిపై ఉన్నాయని జర్దారీ స్పష్టం చేశారు.అంతకు ముందు ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని నేషనల్‌ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ ఖాసీం ఖాన్‌ సూరీ తిరస్కరించారు.తీర్మానం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించారు. చివరి నిమిషంలో స్పీకర్‌ అసద్‌ ఖైసర్‌పైనా ప్రతిపక్షాలు అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టడంతో సూరీ సభకు అధ్యక్షత వహించారు. సభలో ప్రధాని ఇమ్రాన్‌ లేకపోవడం గమనార్హం. సభాపతి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. దీంతో సభ వాయిదా పడిరది.స్పీకర్‌ తీర్మానాన్ని తిరస్కరించినట్లు తెలిసిన కొన్ని నిమిషాల్లోనే ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ జాతినుద్దేశించి ప్రసంగించారు. జాతీయ అసెంబ్లీని రద్దు చేయాలని అధ్యక్షుడు ఆరిఫ్‌ అల్వీకి సిఫార్సు చేసినట్లు ప్రకటించారు. కొత్తగా ఎన్నికలు నిర్వహణకు ఆదేశించాలని సూచించినట్లు తెలిపారు. పాక్‌ ప్రభుత్వాన్ని కూల్చాలన్న విదేశీ కుట్రలను డిప్యూటీ స్వీకర్‌ తిరస్కరించారని వ్యాఖ్యానించారు. అందుకు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తనకు వ్యతిరేకంగా చట్టసభ సభ్యులను కొనేందుకు కోట్లాది రూపాయలు ప్రతిపక్షాలు ఖర్చు చేశాయని ఆరోపించారు. డబ్బులు తీసుకున్నవారు వాటిని అనాథలు, పేదలకు పంచిపెట్టాలని హితవు పలికారు. పాకిస్థాన్‌ భవిష్యత్తును ప్రజలే నిర్ణయిస్తారన్నారు.యావత్తు దేశం గమనిస్తుండగానే దేశద్రోహానికి పాల్పడ్డారని ఇమ్రాన్‌ వ్యాఖ్యానించారు. ఎన్నికలకు సిద్ధం కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అవినీతి శక్తులకు దేశ భవిష్యత్తును నిర్ణయించే అవకాశం ఇవ్వొద్దని వ్యాఖ్యానించారు. అసెంబ్లీని రద్దు చేస్తే తర్వాతి ఎన్నికల ప్రక్రియ మొదలవుతుందని వ్యాఖ్యానించారు.అంతకంటే ముందు ఇమ్రాన్‌ తన తన పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందని ఇస్లామాబాద్‌ వర్గాల్లో జోరుగా ప్రచారం జరిగింది. ఆయనతో పాటు నేషనల్‌ అసెంబ్లీలో ఆయన వెంట ఉన్న మరో 155 మంది సభ్యులు కూడా రాజీనామా చేసే అవకాశం ఉందని సమాచారం. అంతకంటే ముందు పాక్‌ అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్‌ రషీద్‌ అహ్మద్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అవిశ్వాసంలో ఓడిపోతే.. ఇమ్రాన్‌ ఖాన్‌ను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. ప్రతిపక్షాలు ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నాయని ఆరోపించారు. ఎట్టిపరిస్థితుల్లో వారు ఇమ్రాన్‌ను ఇబ్బంది పెట్టాలని నిర్ణయించుకున్నారన్నారు. పాక్‌ రాజకీయాల్లో విదేశీ శక్తుల ప్రమేయాన్ని ప్రస్తావిస్తూ.. తమ దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని చెప్పుకొచ్చారు.

 

2.ఉక్రెయిన్‌లో శవాలగుట్టలు..
ఎటు చూసిన హృదయవిదారక దృశ్యాలు
` వీధుల్లో చెల్లాచెదురుగా పడిఉన్న మృతదేహాలు
` పలు చోట్ల 300 మంది సామూహిక ఖననం..
` శవాల దిబ్బగా మారిన బుచ్చా నగరం
` మృతదేహాల్లో మందుపాతరలను అమరుస్తున్న రష్యా సైనికులు
కీవ్‌,ఏప్రిల్‌ 2(జనంసాక్షి):ఉక్రెయిన్‌ రష్యా భీకర యుద్ధం నేపథ్యంలో అక్కడ ఎటుచూసినా శవాల గుట్టలే కనిపిస్తున్నాయి. రష్యా దాడుల్లో బాగా ధ్వంసమైన కీవ్‌కు సవిూపంలోని బుచ్చా నగరంలో సుమారు 300 మందిని పూడ్చిపెట్టిన సామూహిక సమాధిని గుర్తించినట్లు మేయర్‌ అనటోలీ ఫెడోరుక్‌ తెలిపారు. వీరి తల వెనుక కాల్పులు జరిపి చంపారని ఆరోపించారు. అలాగే రోడ్లపైన, పలు చోట్ల సాధారణ దుస్తుల్లో ఉండి మరణించిన సుమారు 20 మృతదేహాలను కనుగొన్నట్లు తెలిపారు. షాకులో ఉన్న ఉన్న ప్రజలకు ఆహారం, మందులను ఉక్రెయిన్‌ సైనికులు అందజేస్తున్నారని చెప్పారు. కాగా, రష్యా ఆధీనంలోని దక్షిణాది సిటీ ఎనర్హోదార్‌లో శాంతియుతంగా నిరసన చేస్తున్న జనంపై రష్యా సైనికులు కాల్పులు జరిపారని, దీంతో పలువురు గాయపడ్డారని ఉక్రెయిన్‌ మానవ హక్కుల అంబుడ్స్‌మెన్‌ లియుడ్‌మిలా డెనిసోవా ఆరోపించారు.మరోవైపు ఉక్రెయిన్‌లో చర్యలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు త్వరగా అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేయాలని ప్రముఖ యుద్ధ నేరాల ప్రాసిక్యూటర్‌ కార్లా డెల్‌ పోంటే అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టును డిమాండ్‌ చేశారు. కాగా, కీలకమైన ఉక్రెయిన్‌ ప్రతిపాదనలకు రష్యా మౌఖికంగా అంగీకరించిందని రష్యాతో శాంతి చర్చలు జరుపుతున్న ఉక్రెయిన్‌ టాప్‌ మధ్యవర్తి తెలిపారు. దాడులను ముగించే దిశగా చర్చలు ముందుకు సాగుతున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు.ఉక్రెయిన్‌తో ఒకవైపు చర్చలు కొనసాగిస్తున్న రష్యా, మరోవైపు వ్యూహాత్మక ప్రాంతాలపై దాడులు చేస్తున్నది. నల్ల సముద్రంలోని పోర్ట్‌ సిటీ ఒడెస్సాపై ఆదివారం ఉదయం వైమానిక దాడులు చేసింది. దీంతో భారీగా మంటలు, పొగలు ఎగసిపడినట్లు ఉక్రెయిన్‌ మంత్రి అంటోన్‌ హెరాష్చెంకో తెలిపారు. మరోవైపు ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ సవిూప నగరాల నుంచి రష్యా దళాలు వెనక్కి మళ్లాయి. దీంతో ఆ ప్రాంతాలను ఉక్రెయిన్‌ ఆర్మీ తిరిగి తన ఆధీనంలోకి తెచ్చుకున్నది.ఫిబ్రవరి 24న యుద్ధం మొదలైన తర్వాత రష్యా సేనలు కీవ్‌ దిశగా వేగంగా వచ్చాయి. కానీ, వీటికి తొలి ప్రతిఘటన బుచ్చాలో ఎదురైంది. ఇక్కడ ఉక్రెయిన్‌ దళాలు రష్యా సైనిక కాన్వాjైు్ప ఎదురుదాడి చేశాయి. యుద్ధం తొలినాళ్లలో రష్యా దళాలపై ఎదురుదాడి చేసిన అతికొద్ది ఘటనల్లో ఇది కూడా ఒకటి. ఈ దాడిలో రష్యా కాన్వాయ్‌ మొత్తం ధ్వంసమైంది. కీవ్‌ చుట్టుపక్కల అత్యంత భీకర పోరు జరిగిన ప్రాంతం ఇదే అని అధికారులు చెబుతున్నారు.యుద్ధం మొదలైన తొలి రోజు హోస్ట్మాల్లోని యాంటోనోవ్‌ ఎయిర్‌ పోర్టుపై పట్టు సాధించేందుకు రష్యా సేనలు భీకర దాడులు చేశాయి. తొలిరోజు దాడిలో వారి ప్రయత్నాలు విఫలం కాగా.. రెండో రోజు చేపట్టిన దాడిలో ఆ విమానాశ్రయాన్ని స్వాధీనం చేసుకొన్నారు. ఈ క్రమంలో ప్రపంచంలోనే అతిపెద్దదైన యాంటోనోవ్‌ విమానం ధ్వంసమైంది. కీవ్ను చుట్టుముట్టేందుకు వీలుగా బుచ్చాను స్వాధీనం చేసుకోవడానికి భారీ ఎత్తున రష్యా సైనిక దళాలు వచ్చాయి. వీటిల్లో పారాట్రూపర్లు, 36వ కంబైన్డ్‌ ఆర్మ్స్‌ఆర్మీ, స్పెషల్‌ ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ యూనిట్‌, స్పెషల్‌ పర్పస్‌ మొబైల్‌ యూనిట్‌, నేషనల్‌ గార్డ్‌ ఆఫ్‌ రష్యా బలగాలు ఉన్నాయి. ఈ క్రమంలో రష్యా దళాలు అక్కడి భవనాలపై నిర్దయగా శతఘ్నులతో కాల్పులు జరిపాయి.బుచ్చా నుంచి కీవ్‌ వైపు వెళ్లే మార్గంలో ఓ చోట రోడ్డు ఇరుకుగా.. పొడవుగా ఉంది. ఇది ఉక్రెయిన్‌ దళాలకు మాటువేసి ప్రత్యర్థిపై దాడి చేయడానికి అత్యంత అనుకూలమైన ప్రదేశం. అప్పటికే అక్కడ ఉన్న ఉక్రెయిన్‌ వాలంటీర్లు, టర్కీ నుంచి తెప్పించిన బైరక్తర్‌ సాయుధ డ్రోన్ల సాయంతో రష్యా కాన్వాjైు్ప భారీగా దాడి చేసి ధ్వంసం చేశాయి. ఈ దాడిలో 100 యూనిట్ల రష్యా సాయుధ సామగ్రి ధ్వంసమైంది. ఆ కాన్వాయ్లో ఉన్న కాన్స్క్రిప్ట్‌ (నిర్బంధంగా సైన్యంలో చేరిన వారు) దళాలు ప్రాణాలను కాపాడుకోవడానికి వాహనాలను వదిలి చుట్టుపక్కల ఇళ్లల్లో ఆశ్రయం కోసం ప్రాధేయపడ్డారని ఓ ప్రత్యక్ష సాక్షి ఆంగ్లపత్రికకు వెల్లడిరచారు. వారంతా 18`20 ఏళ్ల లోపువారే అని తెలిపారు. బుచ్చా`ఇర్పిన్‌ ప్రాంతల మధ్య ఉన్న ఓ వంతెనను కూడా ఉక్రెయిన్‌ దళాలు పేల్చేశాయి. దీంతోపాటు స్పెషల్‌ పర్పస్మొబైల్‌ యూనిట్‌ కీలక అధికారిని ఉక్రెయిన్‌ దళాలు మట్టుబెట్టడంతో రష్యా దళాలు ముందుకుసాగడం నిలిచిపోయింది. మార్చి 3వ తేదీన బుచ్చాపై తిరిగి పట్టు సాధించినట్లు ఉక్రెయిన్‌ ప్రకటించింది. పట్టువదలని రష్యా సేనలు ఈ నగరంపై దాడులను కొనసాగించాయి. మార్చి 6వ తేదీ నుంచి దాడులను తీవ్రతరం చేశాయి. రెండు రోజుల్లోనే ఇక్కడి ప్రధాన హైవేలు రష్యా చేతిలోకి వెళ్లిపోయాయి. 12వ తేదీ నాటికి రష్యన్లు ఈ ఊరిపై పూర్తి పట్టు సాధించారు. ఆ మర్నాడే రష్యన్ల శతఘ్ని దాడుల్లో మరణించిన 67 మందిని సామూహిక ఖననం చేశారు. దీంతో కీవ్ను రక్షించుకొనేందుకు ఉక్రెయిన్‌ సేనలు.. రష్యా సేనలు ఇర్పిన్‌ నదిని దాటకుండా చూడటమే ప్రథమ కర్తవ్యంగా భావించాయి. బుచ్చాలో రష్యా సేనలు ఇళ్లు, దుకాణాలను కొల్లగొట్టినట్లు ఉక్రెయిన్‌ అధికారులు ఆరోపించారు.కీవ్‌, చర్నీహివ్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో దళాల కార్యకలాపాలు తగ్గిస్తామని మార్చి 29న రష్యా డిప్యూటీ డిఫెన్స్‌ మినిస్టర్‌ ప్రకటించారు. దీంతో ఉక్రెయిన్‌ దళాలు ఎదురు దాడులు చేస్తూ బుచ్చాలోకి ప్రవేశించాయి. మార్చి 31 నాటికి ఈ ప్రాంతాన్ని ఉక్రెయిన్‌ సేనలు తిరిగి పూర్తిగా స్వాధీనం చేసుకొన్నాయి.
3.సీఎం కేసీఆర్‌ ఢల్లీి దౌర...
` ధాన్యం కొనుగోలుపై అమీతుమీ తేల్చుకోనున్న తెలంగాణ ప్రభుత్వం
` ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు పలువురు కేంద్రమంత్రులతో సమావేశం కానన్న ముఖ్యమంత్రి
న్యూఢల్లీి,ఏప్రిల్‌ 2(జనంసాక్షి):ధాన్యంపై దంచుడే. కేంద్రంతో తేల్చుకునుడే.. అని సూటిగా చెప్పిన సీఎం కేసీఆర్‌.. ఢల్లీి చేరుకున్నారు. యాసంగి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందా.. లేదా.. అన్నదే ప్రధాన అంశం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు.. పలువురు కేంద్రమంత్రులతో సమావేశం కానున్నారు. ఏడాది లెక్కన ఎంత ధాన్యం కొనుగోలు చేస్తారో కూడా సూటిగా చెప్పాలన్నది ముఖ్యమంత్రి ప్రధాన డిమాండ్‌. జాతీయ రాజకీయాలపైనా ఫోకస్‌ చేస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి. రైతు చట్టాల రద్దుకు ఉద్యమించిన రైతులకు సంఫీుభావం ప్రకటించారు. పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన రైతు కుటంబాలకు అండగా ఒక్కో ఫ్యామిలీకి 3 లక్షల రూపాయల సాయం అందించనున్నారు. కేంద్రం పాతిక లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలన్నది కేసీఆర్‌ డిమాండ్‌.అటు.. రైతు సంఘాలు కూడా ప్రధానమంత్రి సారీతో చల్లబడలేదు. తమ డిమాండ్లన్నీ నెరవేరే వరకు ఉద్యమాన్ని కంటిన్యూ చేస్తామని ప్రకటించాయి. త్వరలోనే భవిష్యత్‌ కార్యాచరణ కూడా ప్రకటించబోతున్నారు. ఈ నేపథ్యంలో.. సీఎం కేసీఆర్‌ ఢల్లీి పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.రైతు సమస్యలతో పాటు.. విభజన చట్టంలోని అంశాల అమలుపైనా ఫోకస్‌ చేస్తున్నారాయన. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల కేటాయింపులపై స్పష్టతకు, వివాదాల పరిష్కారానికి ఇంకెన్నేళ్లు కావాలంటూ సూటిగా ప్రశ్నించారు. నీటి పంచాయతీకి ఫుల్‌స్టాప్‌ పెట్టేలా టైమ్‌బౌండ్‌ పరిష్కారం కోరుతున్నారాయన.

 

4.బంజారా హిల్స్‌ డ్రగ్స్‌ ఘటనపై సర్కారు సీరియస్‌
హైదరాబాద్‌,ఏప్రిల్‌ 2(జనంసాక్షి):బంజారాహిల్స్లోని ఫుడిరగ్‌ అండ్‌ మింక్‌ పబ్లో డ్రగ్స్‌ పట్టుబడిన వ్యవహారంపై పోలీసుల దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు పబ్లోకి మత్తు పదార్థాలు ఎలా వచ్చాయనే దానిపై ఆరా తీస్తున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను డీసీపీ జోయల్‌ డేవిస్‌ విూడియాకు వెల్లడిరచారు. ‘‘ఫుడిరగ్‌ అండ్‌ మింక్‌ పబ్లో తెల్లవారుజామున 4గంటల వరకు లిక్కర్‌, ఫుడ్‌ సరఫరా చేస్తున్నారు. వీటితో పాటు డ్రగ్స్‌ కూడా సరఫరా చేస్తున్నట్టు సమాచారం అందడంతో తెల్లవారుజామున 2గంటలకు టాస్క్ఫోర్స్‌ బృందం, బంంజారాహిల్స్‌ పోలీసులు రెయిడ్‌ చేశారు. ఆ సమయంలో పబ్లో మొత్తం 148 మందిని గుర్తించాం. అందులో 20మంది వరకు సిబ్బంది, పురుషులు 90 మంది, మహిళలు 38 మంది ఉన్నారు. పబ్లో తనిఖీలు చేయగా... పబ్‌ మేనేజర్‌ క్యాబిన్‌ వద్ద 5 ప్యాకెట్లు కొకైన్‌ దొరికింది. మొత్తం అందరినీ స్టేషన్కు తీసుకొచ్చి వారి వివరాలు తీసుకున్నాం. పూర్తి వివరాలు సేకరించిన తర్వాత ఫుడిరగ్‌ అండ్‌ మింక్‌ యజమాని అర్జున్‌ వీరమాచినేని, అభిషేక్‌ ముప్పాల, జనరల్‌ మేనేజర్‌ అనిల్‌ పై కేసు నమోదు చేశాం. ఈ పబ్లో యాప్‌ ద్వారా 250 మందిని ఎన్రోల్‌ చేసుకుని లిమిటెడ్‌ గ్రూప్గా పెట్టుకుని ఓటీపీ మాదిరి ఒక పిన్‌ కోడ్‌ జనరేట్‌ చేస్తున్నారు. ఆ కోడ్‌ నమోదు చేస్తేనే పబ్‌ లోపలికి ఎంట్రీ వస్తుంది. పబ్కు ఎవరైతే వస్తున్నారో వారు ముందుగా కాల్చేసి రిజిస్టర్‌ చేసుకోవాలి. పబ్కు వచ్చిన తర్వాత కోడ్‌ ఎంటర్‌ చేసి లోపలికి వెళ్లాలి. రద్దీ తక్కువ ఉన్న సమయంలో మెంబర్షిప్లేని వారిని కూడా అనుమతిస్తున్నారు. గత ఆగస్టు నుంచి పబ్‌ మేనేజ్మెంట్‌ మారింది. ఇదంతా ఓ పథకం ప్రకారం చేస్తున్నారు.పబ్లో పట్టుబడిన కొకైన్‌ ఎక్కడి నుంచి తెచ్చారు? కస్టమర్స్‌ ఎవరెవరు వినియోగిస్తున్నారు? అనేది ఇంకా మేనేజర్‌ చెప్పలేదు. మేనేజర్‌ గతంలో గోవాలో ఒక పబ్‌ చేసి ఇక్కడకు వచ్చారు. గోవా లింకులు ఇంకా బయటపడలేదు. పబ్‌ యజమానులకు తెలియకుండా ఏదీ జరగదు కాబట్టి వారిపై కూడా కేసు నమోదు చేశాం. కస్టమర్స్‌ డ్రగ్స్‌ వినియోగించారా? లేదా? ఎవరెవరు తీసుకున్నారు? అనేది తేలాల్సి ఉంది. మత్తు పదార్థాలు సేవించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తేలేదు. డ్రగ్స్‌ ఎక్కడి నుంచి తీసుకొచ్చారనేది ఆరా తీస్తున్నాం. 148 మందిలో ప్రతి ఒక్కరినీ క్షుణ్నంగా పరిశీలిస్తాం. పబ్కు వచ్చిన కస్టమర్ల పేర్లు బయటపెట్టడం సమంజసం కాదు. కేవలం నిందితుల పేర్లు మాత్రమే చెప్పాం. విూడియాలో కస్టమర్ల జాబితా చూపిస్తున్నారు. అది కరెక్టు కాదు. నిందితులను పోలీసు కస్టడీకి తీసుకుని విచారిస్తాం. పబ్కు 24గంటల అనుమతి ఉందని చెప్పి కస్టమర్లను ఆహ్వానించారు. వారు చెప్పింది నమ్మి కస్టమర్లు పబ్కు వచ్చి ఉండొచ్చు. అనుమానం ఉన్నవారి నమూనాలు తీసుకుంటాం. డ్రగ్స్‌ వినియోగించినట్టు తేలితే వారి పేర్లు మేమే వెల్లడిస్తాం’’ అని డీసీపీ వెల్లడిరచారు.

 

5.చైనాలో రికార్డుస్థాయిలో కరోనా కేసులు
న్యూఢల్లీి,ఏప్రిల్‌ 2(జనంసాక్షి):భారత్‌లో కరోనా రోజురోజుకు తగ్గుముఖంపడుతున్నది. ఇదే సమయంలో పలు దేశాల్లో కొవిడ్‌ మళ్లీ విధ్వంసం సృష్టిస్తున్నది. చైనా, అమెరికా, బ్రిటన్‌ సహా అనేక దేశాల్లో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. చైనాలో పరిస్థితి భయానకంగా ఉన్నది. షాంఘై నగరంలో ప్రమాదకరంగా మారింది. కరోనా కారణంగా చైనా పరిస్థితి రోజురోజుకు దిగజారుతున్నది. గడిచిన 24 గంటల్లో ఆ దేశంలో కొత్తగా 13,143 కొత్త కేసులు రికార్డయ్యాయి. రెండు సంవత్సరాల క్రితం మొదటి వేవ్‌ తర్వాత ఇదే అత్యధికం, షాంఘై నగరంలో ఒకే రోజు రికార్డు స్థాయిలో 8,226 కేసులు నమోదయ్యాయి.దేశంలోని చాలా ప్రావిన్సుల్లో ప్రమాదకరమైన ఒమిక్రాన్‌ వేరియంట్‌ విస్తరించింది. దీంతో జనం భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే చైనా ప్రభుత్వం ఆర్థిక రాజధాని షాంఘైలో లాక్‌డౌన్‌ విధించింది. ఈ సమయంలో ప్రజలు ఇంట్లోనే ఉండాలని కోరింది. బయటకు వస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది. దీంతో నగరంలో ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయి. విదేశాలకు సైతం ఎగుమతులు నిలిచిపోయాయి. భారీగా పెరిగిన కేసుల నేపథ్యంలో ప్రస్తుతం దవాఖానాల్లో రోగులను చేర్చుకునేందుకు బెడ్లు కరువయ్యాయి. పరిస్థితులు దారుణంగా మారినా.. ఇప్పటి వరకు కరోనాతో ఎవరూ మరణించలేదని చైనా పేర్కొంది.యూకేలో కరోనా కేసులు మళ్లీ రికార్డు స్థాయికి చేరుకున్నాయి. దీంతో ఆసుపత్రిలో చేరే బాధితుల సంఖ్యతో పాటు మరణాల రేటు మళ్లీ పెరుగుతున్నది. మార్చి 19`26 వరకు దాదాపు 50లక్షల కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసుల వ్యాప్తికి ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ బీఏ.2 వేరియంట్‌ కారణంగా భావిస్తున్నారు.దక్షిణ కొరియాలో గత 24 గంటల్లో 2,64,171 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. 306 మంది మహమ్మారి కారణంగా మరణించారు. ప్రస్తుతం కేసుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ రోగులకు చేర్చుకునేందుకు ఆసుపతుల్లో బెడ్లు ఖాళీలు లేవు. ఇప్పటికే చాలా నగరాల్లో లాక్‌డౌన్‌ను విధించారు.అమెరికాలో జనాభా గణన తర్వాత..గ్భ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత రెండేళ్లలో, కరోనా కారణంగా పెద్ద సంఖ్యలో మరణాలు నమోదయ్యాయి. అమెరికాలోని 73 శాతం కౌంటీల్లో జనాభా తగ్గిందని తేలింది. 2019లో ఈ కౌంటీల్లో మరణాల సంఖ్య 45.5శాతం కాగా.. 2020లో దాదాపు 10 శాతానికి పెరిగింది. 2020లో 55.5 శాతం మరణాలు రికార్డయ్యాయి.

 

6.ఉక్రెయిన్‌ రష్యా యుద్ధం
భారత్‌ ఆర్థికవృద్ధిపై ప్రభావం చూపొచ్చు
నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ కీలక వ్యాఖ్యలు..!
న్యూఢల్లీి,ఏప్రిల్‌ 2(జనంసాక్షి):రష్యా`ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా, భారతదేశ జిడిపి వృద్ధి అంచనాను మార్చవచ్చని నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ తెలిపారు. అయితే, అప్పుడు కూడా భారత్‌ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని ఆయన అన్నారు. అన్ని ఇతర ఆర్థిక పారామితులు ఒకే పరిధిలో ఉంటాయన్నారు. రష్యా ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై సైనిక చర్యను ప్రారంభించింది. ఈ చర్య తర్వాత అమెరికాతో సహా పాశ్చాత్య దేశాలు రష్యాపై పెద్ద ఆర్థికపరంగా, ఇతర అనేక రకాల ఆంక్షలు విధించాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణంపై, ఆర్‌బిఐ తన అంచనాలను నిశితంగా గమనిస్తోందని నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ అన్నారు.భారతదేశం ఒక పెద్ద ఆర్థిక పునరుద్ధరణను తలపిస్తోందని అన్నారు. సాధ్యమైన ప్రతిష్టంభన గురించి చర్చలు జరుగుతున్నాయని అన్నారు. గత ఏడేళ్లలో ప్రభుత్వం సంస్కరణలతో బలమైన ఆర్థిక పునాది వేస్తోందన్నారు. ఖుఎ ప్రకారం, రష్యా`ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా ఏర్పడిన అనిశ్చితులను కుమార్‌ వ్యతిరేకించారు. ఇది ప్రపంచ సరఫరా గొలుసును కూడా ప్రభావితం చేస్తుందని చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్‌ కొనసాగుతుందని అన్ని కారణాల వల్ల స్పష్టమవుతోందని ఆయన ఉద్ఘాటించారు.పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కుమార్‌ మాట్లాడుతూ, గత సంవత్సరంలో అన్ని రంగాల్లో మెరుగుదల నమోదైనట్లు పేర్కొన్నారు.కోవిడ్‌ `19 మహమ్మారి ముగింపును చూస్తున్నామని ఆశిస్తున్నాము. దీంతో ఈ ఏడాది 7.8 శాతం వృద్ధి నమోదు కానుంది. రాబోయే సంవత్సరాల్లో ఆర్థిక వృద్ధిలో మరింత వేగవంతమైన వృద్ధికి ఇప్పుడు చాలా బలమైన పునాది వేయడం జరిగిందని రాజీవ్‌ కుమర్‌ స్పష్టం చేశారు.ఆసియాలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ 2021`22లో 8.9 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేశామన్నారు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 2022`23 ఆర్థిక వృద్ధి రేటు 7.8 శాతంగా అంచనా వేసింది. కాబట్టి, భారతదేశం పెద్ద ఆర్థిక పునరుద్ధరణ, ఆర్థిక వృద్ధికి దగ్గరగా నిలుస్తుందని వారు భావిస్తున్నారని కుమార్‌ చెప్పారు.ఇది కాకుండా, పెట్రోలియం ఉత్పత్తులు, ఇంజనీరింగ్‌ వస్తువులు, రత్నాలు, ఆభరణాలు, రసాయన రంగాల మెరుగైన పనితీరు కారణంగా, 2021`22 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ వస్తువుల ఎగుమతి రికార్డు స్థాయి వి 418 బిలియన్లకు చేరుకుంది. డేటా ప్రకారం, దేశం మార్చి 2022లో 40 బిలియన్‌ డాలర్లను ఎగుమతి చేసింది. ఇది ఒక నెలలో అత్యధిక ఎగుమతులు. అంతకుముందు మార్చి 2021లో ఎగుమతి సంఖ్య 34 బిలియన్‌ డాలర్లు మాత్రేమ కావడం విశేషం.

 

7.అమెరికాలో పెరిగిన గన్‌ కల్చర్‌
` మళ్లీ కాల్పుల మోత..ఆరుగురి మృతి
కాలిఫోర్నియా,ఏప్రిల్‌ 2(జనంసాక్షి): అమెరికా మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. కాలిఫోర్నియాలోని శాక్రమెంటో నగరంలో ఆదివారం తెల్లవారుజామున గుర్తుతెలియని దుండగుడు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఆరుగురు పౌరులు మృతిచెందారు. మరో తొమ్మిది మందికి బులెట్‌ గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న శాక్రమెంటో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. ఆ ప్రాంతంలో కర్ఫ్యూ తరహా నిబంధనలు విధించారు. అయితే ఈ కాల్పులకు తెగబడిరది ఒకే దుండగుడా? లేక మరికొందరు ఉన్నారా అనే దానిపై స్పష్టమైన సమాచారం లేదు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

8.విశ్వవిజేతగా ఆస్ట్రేలియా..
` ఏడోసారి ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌ టైటిల్‌ సాధించిన కంగారు జట్టు
` ఫైనల్‌లో ఇంగ్లండ్‌పై 71 పరుగుల తేడాతోఘన విజయం

9.ఆగని పెట్రోమంట
` వరుసగా పదకొండో సారి పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు
న్యూఢల్లీి,ఏప్రిల్‌ 2(జనంసాక్షి): పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరోసారి పెరిగాయి. వరుస వడ్డింపునకు శుక్రవారం విరామం ఇచ్చిన దేశీయ చమురు కంపెనీలు శనివారం నుంచి ప్రజలపై మళ్లీ భారం మోపుతున్నాయి. దీంతో మార్చి 22 నుంచి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచడం ఇది పదకొండో సారి. శుక్రవారం (ఏప్రిల్‌ 1) వాణిజ్య సిలిండర్‌పై ఒక్కసారే రూ.250 అధికం చేసిన విషయం తెలిసిందే.తాజాగా లీటరు పెట్రోల్‌పై 92 పైసలు, డీజిల్‌పై 87 పైసల చొప్పున బాదాయి. దీంతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్‌ ధర 117.25కు చేరగా, డీజిల్‌ ధర రూ.103.32కు పెరిగింది. మొత్తంగా పదకొండు రోజుల్లో లీటరుపై సుమారు రూ.9 వరకు చమురు ధరలు పెరిగాయి.దేశరాజధాని న్యూఢల్లీిలో లీటరుపై 80 పైసల చొప్పున పెరగడంతో పెట్రోల్‌ ధర రూ.103.41, డీజిల్‌ రూ.94.67కు చేరాయి. ముంబైలో పెట్రోల్‌ రూ.118.41 (84 పైసలు), డీజిల్‌ రూ.102.64గా (85 పైసలు), చెన్నైలోలో 75 పైసల చొప్పున పెరగడంతో పెట్రోల్‌ రూ.108.96, డీజిల్‌ రూ.108.96, కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.113.03 (84 పైసలు), డీజిల్‌ రూ.97.82 (80 పైసలు)కి చేరాయి.

 

10.ఇది నిజమా..(కిక్కర్‌
సీబీఐ పంజరంలో చిలక కాదట!
` కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు
దిల్లీ,ఏప్రిల్‌ 2(జనంసాక్షి):సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (అఃఎ) ఇప్పుడు ‘పంజరంలో చిలుక’ కాదని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు ఉద్ఘాటించారు. అయితే, గతంలో ప్రభుత్వంలో ఉన్న కొందరు కొన్నిసార్లు సీబీఐ దర్యాప్తులో సమస్యలు సృష్టించేవారన్నారు. కానీ, ప్రస్తుతం దేశ అత్తున్నత దర్యాప్తు సంస్థగా సీబీఐ తన విధులను పకడ్బందీగా నిర్వర్తిస్తోందని అన్నారు. దిల్లీలో జరుగుతోన్న సీబీఐ అధికారుల సమావేశంలో ప్రసంగించిన ఆయన.. గతంలో కొంతమంది సీబీఐ అధికారులు ఎదుర్కొన్న సవాళ్లు కూడా ప్రస్తుతం లేవని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.‘అధికారంలో ఉన్న వ్యక్తులు అవినీతికి పాల్పడితే ఎదురయ్యే ఇబ్బందుల గురించి నాకు అవగాహన ఉంది. వారిని ఇబ్బందుల నుంచి గట్టేక్కించేందుకు వారికి అనుగుణంగా నడుచుకుంటే సీబీఐ కష్టాల్లో పడినట్లే. ఆ క్రమంలో గతంలో న్యాయవ్యవస్థ నుంచి కొన్ని అవాంఛనీయ వ్యాఖ్యలు కూడా విన్నాం. కానీ, ప్రస్తుతం అటువంటి వాటికి ఎంతో దూరంగా ఉన్నాం’ అని కిరణ్‌ రిజుజు పేర్కొన్నారు. ఒకప్పుడు ప్రభుత్వంలో ఉన్న కొందరు సీబీఐ దర్యాప్తులో సమస్యలు సృష్టించేవారన్న ఆయన.. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసే కీలక వ్యక్తే ప్రస్తుతం ప్రధానమంత్రిగా ఉన్నారని అన్నారు. 2013లో బొగ్గు గనుల కేటాయింపునకు సంబంధించిన కేసు విచారణ సందర్భంగా.. సీబీఐ ‘పంజరంలో చిలుక’గా మారిందని భారత అత్యున్నత న్యాయస్థానం అభివర్ణించిన విషయాన్ని కేంద్రమంత్రి పరోక్షంగా ప్రస్తావించారు.

 

11.శ్రీలంక ప్రధాని మహింద రాజపక్స రాజీనామా!
` దేశంలో, రాజకీయాల్లో సుస్థిరత కోసం నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి
` ఇంకా ఆమోదించని అధ్యక్షుడు గోటబయ రాజపక్స
` సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించిన ఆ దేశప్రభుత్వం
కొలంబో,ఏప్రిల్‌ 2(జనంసాక్షి):శ్రీలంక ప్రధాని మహింద రాజపక్స తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను అధ్యక్షుడు గోటబయ రాజపక్సకు సమర్పించారు. అయితే, రాజీనామాను ఇంకా ఆమోదించలేదు. దేశంలో, రాజకీయాల్లో సుస్థిరత కోసం తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన నేపథ్యంలో ప్రధాని, అధ్యక్షుడు రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు ఇప్పటికే డిమాండ్‌ చేస్తున్నాయి. గోటబయ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటారా? అనే ఊహాగానాలు సాగుతున్నాయి. ప్రస్తుతం శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో ఉన్నది.అప్పుల ఊభిలో కూరుకుపోయింది. కొద్ది కాలం కిందటనే సమస్యలు ప్రారంభమైనా.. ఈ ఏడాది నుంచి పరిస్థితి మరింత దిగజారింది. ఫిబ్రవరిలో ద్రవ్యోల్బణం 18.5శాతానికి పెరిగింది. ఆహార ఉత్పత్తుల విషయంలో ద్రవ్యోల్బణం 25శాతానికి పెరిగింది. దీంతో పేద, మధ్య తరగతి ప్రజల తీవ్ర భారం పడిరది. బియ్యం, పప్పులు, గోధుమలు, ఇలా అన్ని రకాల ధాన్యాలు సామాన్యులకు కొనుగోలు చేయలేని స్థితికి చేరాయి. ప్రస్తుతం శ్రీలంక రాజధాని కొలంబోలో బియ్యం కిలో ధర రూ.200 దాటింది. కిలో గోధుమలు కొనుగోలు చేసేందుకు రూ.190 చెల్లించాల్సి వస్తున్నది.కిలో చక్కెర ధర రూ.240కి చేరింది. లీటర్‌ కొబ్బరి నూనె ధర రూ.750, ఒక్క కోడిగుడ్డుకు కొనాలంటే రూ.30 చెల్లించాల్సిన పరిస్థితి ఎదురైంది. అలాగే పిల్లలకు సంబంధించిన పాలపొడి సైతం కిలో రూ.1900కు చేరింది. ఇక కూరగాయలు కొనలేని పరిస్థితి. ఈ క్రమంలో ప్రధాని మహింద రాజపక్స, గోటబయ రాజపక్సపై దేశ ప్రజలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ అసమర్థత వల్లే దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని ఆరోపిస్తున్నారు. అయితే, ఇందులో వాస్తవం లేదని లంక నిపుణులు పేర్కొంటున్నారు. లోటు బడ్జెట్‌ను పూడ్చలేమని, రాజపక్స ప్రభుత్వ పన్ను విధానం మోకాలడ్డిన విషంలా మారిందన్నారు.రాజపక్స 2019లో ఎన్నికల వాగ్ధానంలో భారీ పన్ను తగ్గింపులు చేస్తామని హావిూ ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక అమలులోకి తెచ్చారన్నారు. అయితే ఆ తర్వాత కొవిడ్‌ విజృంభించిన తర్వాత పరిస్థితి చేయిదాటిపోయిందని పేర్కొంటున్నారు. శ్రీలంక ప్రభుత్వం పర్యాటక నుంచి భారీ లాభాలను ఆర్జించింది. కరోనా సమయంలో అక్కడ పని చేస్తున్న విదేశీయుల జీతాల్లోనూ కోత విధించారు. దీంతో పర్యాటక రంగంలో శ్రీలంక పత్రిష్ట మసకబారింది. పర్యాటకరంగంపై ప్రభావం చూపింది. అదే సమయంలో చైనా నుంచి తీసుకున్న భారీ రుణం కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ వెన్నుముక విరిగినట్లయ్యింది.ఎందుకంటే గత రెండేళ్లలో పేరుకుపోయిన విదేశీ మారకద్రవ్య నిల్వలు 60శాతానికి పడిపోయాయి. అదనంగా రాజపక్స 2021లో వ్యవసాయంలో రసాయన ఎరువుల వాడకాన్ని నిషేధించారు. తర్వాత నిషేధం ఎత్తివేసినా అప్పటికే వ్యవసాయం విపరీతంగా నష్టపోయింది. 2010లో అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత గోటబయ.. మహిందను ప్రధానిగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. దేశ పార్లమెంట్‌లో మెజారిటీ ఉన్నప్పటికీ రణిల్‌ విక్రమసింఘే దూరమయ్యారు. అంతకుముందు, అక్టోబర్‌ 26, 2016న అప్పటి అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఆయనను ప్రధానమంత్రిగా నియమించారు.మహింద తర్వాత ఆయన సన్నిహితుడు సిరిసేన అధికారంలోకి వచ్చారు. మహిందను ప్రధానిగా కొనసాగించలేకపోయారు. శ్రీలంక రాజకీయాల్లో సుదీర్ఘ ప్రతిష్టంభన, రాజ్యాంగ సంక్షోభం నెలకొన్నది. ఆ సమయంలో, దేశ అత్యున్నత న్యాయస్థానం మహింద అధికారంలో ఉండడం చట్టవిరుద్ధమని ప్రకటించింది.శ్రీలంకలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు అక్కడి ప్రజానీకాన్ని అతలాకుతలం చేసేస్తున్నాయి. కనీసం జీవించడానికి కూడా అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు అమాంతంగా పెరిగిపోవడంతో బతుకులు దుర్భరమైపోతున్నాయి. కూరగాయల ధరలు ఎప్పటి కంటే రెండిరతలు పెరిగాయి. బియ్యం, గోధుమలు కిలో 220 గా అమ్ముతున్నారు. ఇక పాల పౌడర్‌ కేజీ 1900 రూపాయలకు అమ్ముతున్నారు. ఇక చక్కెర కిలో 240 రూపాయలు, కొబ్బరి నూనె లీటర్‌ 850 రూపాయలు. ఒక్క గుడ్డు ధర 30 రూపాయలుగా వ్యాపారస్థులు అమ్ముతున్నారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఆర్థిక సంక్షోభంలో పూర్తిగా కూరుకుపోయిన శ్రీలంకలో ప్రజా నిరసనలు ఉద్ధృతం కావడంతో అధ్యక్షుడు రాజపక్స దేశవ్యాప్త ఎమర్జెన్సీ విధించారు. భద్రతా బలగాలకు అపరిమిత అధికారాలనిచ్చారు. నిరసన ప్రదర్శనలు ఎవరు నిర్వహించినా అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల భద్రత, అత్యవసర సేవల కోసం, నిత్యావసర వస్తువుల సరఫరాలో ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకే ఎమర్జెన్సీ నిర్ణయం తీసుకొన్నట్టు రాజపక్స పేర్కొన్నారు. ఎమర్జెన్సీ శుక్రవారం నుంచే అమల్లోకి వచ్చింది. ఎమర్జెన్సీతో పాటు అధ్యక్షుడు రాజపక్స 36 గంటల దేశవ్యాప్త కర్ఫ్యూ విధించారు. కర్ఫ్యూ శనివారం సాయంత్రం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చింది. సోమవారం ఉదయం 6 గంటల వరకు అమల్లో ఉంటుంది.
శ్రీలంక ప్రభుత్వం మరో కీలక నిర్ణయం!
ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సామాజిక మాధ్యమాలపై నిషేధం విధిస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది.దీంతో వాట్సాప్‌, ట్విటర్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌ సహా ఇతర సామాజిక మాధ్యమాలు శనివారం`ఆదివారం మధ్యరాత్రి నుంచి నిలిచిపోయాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెలరేగుతున్న ఆందోళనలను అణచివేయడానికే పాలకులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతోంది.సంక్షోభ నివారణలో ప్రభుత్వం విఫలమైందంటూ వివిధ ప్రజాసంఘాలు శనివారం పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలకు పిలుపునిచ్చాయి. వీటి నియంత్రణకు ఉపక్రమించిన అక్కడి ప్రభుత్వం 36 గంటల అత్యవసర పరిస్థితి విధించింది. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఆ వెంటనే సామాజిక మాధ్యమాలపై కూడా నిషేధం విధించడం గమనార్హం. కొన్ని ప్రాంతాల్లో సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే కార్యకర్తలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో కొన్నిరోజులుగా ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు, నిరసనలు చేపడుతున్నారు. గురువారం అర్ధరాత్రి అధ్యక్షుడి ఇంటిని వారు ముట్టడిరచారు. ఆదివారం దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ ఆందోళనలను అణచివేయడానికి రాజపక్స హుటాహుటిన అత్యవసర పరిస్థితి సహా ఇతర కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సంక్షోభం తమ నిర్ణయాల ఫలితం కాదని.. కరోనా మహమ్మారి మూలంగానే ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని విదేశీ మారక నిల్వలు కరిగిపోయాయని తమ చర్యలను సమర్థించుకున్నారు.