all news

 


1.బడుగుల బతుకులుపై బుల్డోజర్లు

విద్వేష విషం నింపుకున్న పాలకులు

పేదరికాన్ని నిర్మూలించ లేని రాజ్యం

పేదల్ని నిర్మూలించే పనిలో సర్కారు

న్యూఢల్లీి,ఏప్రిల్‌ 24(జనంసాక్షి):దేశాన్ని ప్రగతిపథం వైపు నడిపిస్తూ ఉపాధి అవకాశాలను మెరుగుపరచడంలో దృష్టిసారించాల్సిన కేనీద్రంలో అధికారంలో ఉన్న బిజేపి నేతృత్వంలోని ప్రభుత్వం విద్వేష రాజకీయాల విూద పునాథులు వేసుకుంటుందా. అన్న ప్రశ్నకు  ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అవుననే సమాధానం చెపుతున్నట్లు అన్పిస్తుంది ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నార్ధకం చేస్తు ఇటీవల దేశ రాజధాని ఢల్లీి జహంగీర్‌పురలో జరిగి న కూల్చివేతలు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి భారతీయ జనతా పార్టీ ఎజెండాను ఏమైనా తెరపైకి తెచ్చిందా అని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఢల్లీిలో సరిగ్గా మూడువందల 71 అనధికారిక కాలనీలు ఉన్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. కాలనీల పరిధిలో 50 లక్షలకు పైగా నిరుపేదలు జీవనం సాగిస్తున్నట్లు తెలుస్తుంది. సరిగ్గా కూల్చివేతలకు జహంగీర్‌ పురలోని ఈ ప్రాంతాన్ని ఎన్నుకోవడం వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నట్లు స ఎష్టంగా తెలుస్తుంది. పైకి ఎలాంటి మత రాజకీయాలు లేవంటూ సెలవిస్తున్న జరిగిన పరిణామాలు మాత్రం  మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నట్టు స్పష్టం అవుతుంది. అధికారులు నిర్దేశించిన సమయం ప్రకారం కూల్చివే తలు ప్రారంభించాల్సి ఉండగా ముందస్తుగానే ఉదయం 9 గంటలకే కూల్చివేతలు ప్రారంభించడాన్ని భాధితుల తరపున న్యాయవాది దుష్యంత్‌ దవే ఉదయం కోర్టు ప్రారంభమైన 10.30 గంటలకు ఈ విషయాన్ని ప్రస్తావిస్తామనే ఉద్దేశ్యంతోనే కూల్చివేతలను కొనసాగించారని కోర్టు దృష్టికి తీసుకురావడం గమనంలోకి తీసుకుంటే ఉద్దే శ్యపూర్వకంగానే కూల్చివేతలు కొనసాగాయని అర్ధమవుతుంది. యదాతదా స్థితిని కొనసాగించాలంటూ కోర్టు తెలిపినా కోర్టు ఆర్డర్‌ కాపీలు అందించినా కూల్చివేతలు కొనసాగిన పరస్థితి..ఈ విషయంలో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినా అధికారుల్లో చలనం లేకుండా పోవడం గమనార్హం. అధికారుల వాదన మరీ చిత్రంగా కనిపి స్తుంది. రొటీన్‌ గా కూల్చివేతలు జరుగుతాయంటూ చేతులు దులిపేసుకోవడం వెనుక భారతీయ జనతా పార్టీ అ ధికారులను ఏ విధంగా ప్రభావితం చేస్తుందో అర్ధం చేసుకోవచ్చు. ప్రజాస్వామ్యం వ్యవస్థను పటిష్టంగా కాపాడ వలసిన బాధ్యతలు భుజాన వేసుకున్న పాలకులే బేఖాతరుగా ప్రజాస్వామ్యాన్ని బుల్‌ డోజర్లతో కూల్చివేస్తున్న పరి స్థితి. చిన్నచిన్న చిరువ్యాపారాలు చేసుకుంటున్న నిరుపేదలను మతం రంగు పులిమి విద్వేషాలను రెచ్చగొట్టేందుకు జహంగీర్‌ పూర్‌ ప్రాంతంలో కూల్చివేతలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీలన్నీ ఈ ఘటన పై తీవ్రంగానే స్పందించాయి. భారతీయ జనతా పార్టీ ఉద్దేశపూర్వకంగానే కూల్చివేతలకు పాల్పడిరదని ఆరోపిం చాయి. ఆరోపణల విషయం అలా పక్కన పెడితే కూలిపోయిన నిరుపేదల బతుకులు మాత్రం ప్రశ్నార్ధకంగానే మిగిలాయి.2.ప్రశాంత్‌ కిషోర్‌తో కేసీఆర్‌ కీలకభేటి

` పీకే ‘ఐప్యాక్‌’ సేవలు కొనసాగింపునకు తెరాస నిర్ణయం

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 24(జనంసాక్షి): ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ (పీకే) నేతృత్వంలోని ‘ఐప్యాక్‌’ సేవలను కొనసాగించాలని తెరాస నిర్ణయించింది.రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఆ సంస్థ సేవలను అందించనుంది. ఈ విషయంపై తెరాస అధినేత, సీఎం కేసీఆర్‌తో రెండురోజులుగా ప్రశాంత్‌కిశోర్‌ చర్చలు జరిపారు. హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌ వేదికగా వీరి చర్చలు సుదీర్ఘంగా కొనసాగాయి.సర్వేలు, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, కొత్త ఓటర్లను ప్రభావితం చేయడం ఇతరత్రా వాటి కోసం ఈ ఐప్యాక్‌ సేవలు అందించనుంది. రెండో రోజూ సుదీర్ఘంగా సాగిన సమావేశంలో రాష్ట్ర, జాతీయ రాజకీయాలపైనా కేసీఆర్‌, ప్రశాంత్‌కిశోర్‌ చర్చించినట్లు సమాచారం. జాతీయస్థాయిలో ప్రత్యామ్నాయం లేకపోతే కూటమి లేదా కేసీఆర్‌ కొత్త పార్టీ ఏర్పాటుపై చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఇతర నేతల పట్ల ప్రజాభిప్రాయంపై సర్వేలను ఈ సందర్భంగా కేసీఆర్‌, పీకే చర్చించినట్లు సమాచారం. కాంగ్రెస్‌లో పీకే చేరనున్నారనే ప్రచారం నేపథ్యంలో ఆయనతో కేసీఆర్‌ రెండురోజులుగా భేటీ కావడం చర్చనీయాంశమైంది.ఇదిలా ఉండగా టీఆర్‌ఎస్‌లో ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ టెన్షన్‌ మొదలైంది. అయితే కేసీఆర్‌కు ప్రశాంత్‌ కిషోర్‌కు పలు నియోజకవర్గాకుల సంబంధించిన సర్వే రిపోర్టులు అందజేసినట్లు సమాచారం.ముఖ్యంగా ఆదివారం జరిగిన భేటీలో జాతీయ రాజకీయాలపై పీకే.. సీఎం కేసీఆర్‌తో సుధీ ర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే తెలంగాణలో పీకే టీమ్‌ సర్వేలు చేస్తున్న విషయం తెలిసిందే.కాంగ్రెస్‌ పార్టీలో పీకే చేరుతారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీతో ముందుకు కొనసాగుతారా? లేదా? అనే విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇక ఈ భేటీలో ఐప్యాక్‌ టీమ్‌ చేసిన సర్వే రిపోర్టులను టీఆర్‌ఎస్‌ పార్టీకి అందిస్తుందని పీకే.. కేసీఆర్‌కు చెప్పినట్లు తెలుస్తోంది.తాను కాంగ్రెస్‌లో చేరిన తన సంస్థ ఐప్యాక్‌ టీఆర్‌ఎస్‌ కోసం పని చేస్తుందని కేసీఆర్‌కు ప్రశాంత్‌ కిషోర్‌ తెలిపినట్లు తెలుస్తోంది. జాతీయ రాజకీయాలు, బీజేపీని ఢీకొట్టడంపై ఇద్దరి మధ్య సుదీర్ఘ చర్చ కొనసాగింది. భవిష్యత్తులో మూడో కూటమి ఏర్పాటు చేస్తే కాంగ్రెస్‌ను కూడా కలుపుకుపోవాలనే  విషయంపై ఆలోచించాలని కేసీఆర్‌ను  ప్రశాంత్‌ కిషోర్‌ కోరినట్లు సమాచారం. బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఒక్కతాటిపై ఉంటేనే ఆ పార్టీని గద్దె దింపాలని పీకే వివరించారు. ఐప్యాక్‌.. తెలంగాణలో వచ్చే ఎన్నికల వరకు టీఆర్‌ఎస్‌ కోసం పని చేయనుంది.  పీకేతో భేటీ అనంతరం సీఎం కేసీఆర్‌.. ప్రగతి భవన్‌ నుంచి ఎర్రవల్లి ఫామ్‌ హౌస్‌కు వెళ్లారు.3.గ్రామాలకు నిధులిస్తున్నాం

` బండి సంజయ్‌

నారాయణపేట,ఏప్రిల్‌ 24(జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వం నిధులిస్తుంటే కేసీఆర్‌ తన పథకాలుగా చెప్పుకుంటున్నారని భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు. కొలువులు, నిరుద్యోగ భృతి అంటూ హావిూలిచ్చిన కేసీఆర్‌ అన్నీ మరచి కుటుంబసభ్యులకు పదవులు కట్టబెట్టారని విమర్శించారు. ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా 11వ రోజైన ఇవాళ బండి సంజయ్‌ నారాయణపేటలో పర్యటించారు.ఆరు నెలల్లో ఆర్డీఎస్‌ పూర్తి చేస్తామని కేంద్రం చెప్పిందన్న ఆయన ఎనిమిదేళ్లుగా తెరాస సర్కారు కాలయాపన చేసిందన్నారు. కేసీఆర్‌.. మూడు ఎకరాల భూమి, దళితబంధు అంటూ ఎస్సీలను మోసం చేస్తున్నారని సంజయ్‌ ఆరోపించారు. రాష్ట్రంలో చిన్న రోడ్లకు కూడా మరమ్మతులు చేయలేకపోతున్నారని ఎద్దేవా చేశారు.4.ఎన్‌పీఏ ప్రభుత్వానికి సిగ్గులేదు.. 

` ఏనిమిది సంవ్సతరాలైనా కృష్ణా నదీజాలల విషయంలో రాష్ట్రానికి ఇంకా అన్యాయమే..

` నదీ జలాల వివాదాల పరిష్కారానికి కొత్త ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయాలని 

` కేంద్రంపై ట్విట్టర్‌ వేదికగా మరోసారి మంత్రి కేటీఆర్‌ ఫైర్‌ 

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 24(జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్‌ మరోసారి మండిపడ్డారు. కృష్ణా నదీజాలల విషయంలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. నదీ జలాల వివాదాల పరిష్కారానికి కొత్త ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయాలని, లేదంటే ఇప్పుడున్న ట్రిబ్యునల్‌`2 కి సంబంధించిన నిబంధనలను సవరించాలనే ప్రతిపాదనను కేంద్ర న్యాయశాఖ తిరస్కరించడంపై ట్విట్టర్‌ వేదికగా ఘాటుగానే స్పందించారు.‘ఎనిమిదేళ్లు గడుస్తున్నా.. తెలంగాణ రైతులకు కృష్ణా జలాల్లో సరైన వాటా అందించలేని ఎన్‌పీఏ (నాన్‌ పెర్ఫార్మింగ్‌ అసెట్‌) ప్రభుత్వానికి సిగ్గుండాలి. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడే రాజకీయాలు చేయకూడదు. వెన్నెముక లేని టీఎస్‌ బీజేపీ ఈ అన్యాయానికి వ్యతిరేకంగా గళం వినిపిస్తుందా..? లేదా?’ అంటూ కేటీఆర్‌ ప్రశ్నించారు. కేటీఆర్‌ ట్వీట్‌పై రాష్ట్ర నేతలు, నెటిజన్లు స్పందించారు.’తెలంగాణ విషయంలో భారత ప్రభుత్వానికి ద్వంద్వ ప్రమాణాలు ఎందుకు..? వాళ్లు చేసిన వాగ్ధానాల అమలులో ఎప్పుడో విఫలమయ్యారని, అర్థం లేని మాటలు మాట్లాడే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు తెలంగాణ ప్రజలకు ఉపయోగపడే ఇలాంటి విషయాలను మాట్లాడే దమ్ము ఎందుకు లేదు? లేదంటూ మండిపడ్డారు. సిగ్గులేని బీజీపీ.. దమ్ములేని నాయకులు.. రాష్ట్ర సమస్యలపై మాట్లాడని బీజేపీ రాష్ట్రానికి పట్టిన శని’ అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
5.రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం

` భవిష్యత్‌ కార్యచరణ ప్రకటిస్తాం:భట్టి

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 24(జనంసాక్షి):త్వరలో రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని,రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌కిషోర్‌ అంశం విూడియాలో మాత్రమే చర్చ జరుగుతుందని కాంగ్రెస్‌ పార్టీ సీఏల్పీనేత భట్టి విక్రమార్క అన్నారు. ఆయన ఆదివారం విూడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీలో పీకేకి సంబంధ ఎలాంటి చర్చలేదని స్పష్టం చేశారు. సోనియా గాంధీ ఏ నిర్ణయం తీసుకున్నా తాము అందరం ఆమోదం తెలుపుతామని పేర్కొన్నారు.తమకు సమయం దొరికినప్పుడల్లా రాహుల్‌ గాంధీ సభ కోసం విూడియాతో మాట్లాడుతామని చెప్పారు. వరంగల్‌లో రాహుల్‌ గాంధీ సభ విజయవంతం చేయాలని కోరుతున్నామని తెలిపారు. కాంగ్రెస్‌ సిద్ధాంతాలు నమ్మే వాళ్లందరూ రావాలని కోరుతున్నామని చెప్పారు. రైతులు.. రైతు కూలీలు అంతా రాహుల్‌ సభకి రావాలని పిలుపునిచ్చారు.వ్యవసాయంపై కాంగ్రెస్‌ ఏం చేస్తుందనేది సభలో చెబుతామని భట్టి తెలిపారు. తాము ఇచ్చిన సబ్సిడీలు అన్ని బంద్‌ అయ్యాయని చెప్పారు. రుణమాఫీ భారం లక్ష పోయి.. నాలుగు లక్షలు అయ్యిందని తెలిపారు. తాము పంచిన భూములు.. ప్రభుత్వం ప్లాటింగ్‌ చేస్తుందని అన్నారు. వ్యవసాయ రంగంపై కాంగ్రెస్‌ పార్టీ ఏం చేస్తుందనేది రాహుల్‌ గాంధీ సందేశం ఇస్తారని చెప్పారు.
6.అభివృధ్ధి కొత్త పుంతలు తొక్కుతోంది

` కాశ్మీర్‌సభలో ప్రధాని

` ప్రధాని పర్యటనవేళ కొనసాగుతున్న ఎన్‌కౌంటర్‌లు

శ్రీనగర్‌,ఏప్రిల్‌ 24(జనంసాక్షి): దేశంలో అభివృద్ధి కొత్తపుంతలు తొక్కుతోందని ప్రధాని మోదీ అన్నారు.దేశంలో గొప్ప పంచాయితీరాజ్‌ వ్యవస్థ ఉన్నప్పటికీ జమ్మూ కశ్మీర్‌ మాత్రం ఆ ఫలాలను అందుకోలేకపోయిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తం చేశారు.కానీ ప్రస్తుతం జమ్మూలో ప్రజాస్వామ్యం క్షేత్రస్థాయికి చేరుకోవడం గర్వకారణంగా ఉందన్నారు. సాంబా జిల్లాలోని పల్లీ గ్రామంలో సౌర విద్యుత్‌ ప్లాంట్‌ను ప్రారంభించిన మోదీ.. దేశంలోనే తొలి కర్బన్‌ రహిత పంచాయితీగా ఈ గ్రామం చరిత్ర సృష్టించిందన్నారు. 370 అధికరణ రద్దు తర్వాత తొలిసారి జమ్మూ కశ్మీర్‌లో పర్యటించిన ప్రధాని.. రూ.20వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన అనంతరం ఈ విధంగా మాట్లాడారు.’గత రెండు, మూడేళ్లలోనే జమ్మూ కశ్మీర్‌ ఎన్నో మైలురాళ్లను చేరుకుంది. గత ప్రభుత్వాలు ఇక్కడ కేంద్ర పథకాలను అమలు చేయలేకపోయాయి. కానీ మేము దాన్ని సాధ్యం చేశాం. గడిచిన ఆరు దశాబ్దాల్లో ఈ ప్రాంతంలో రూ.17వేల కోట్ల ఖర్చు పెట్టగా.. కేవలం రెండేళ్లలోనే మేము రూ.38వేల కోట్లను ఖర్చుచేశాం. ఎన్నోఏళ్లుగా రిజర్వేషన్లకు దూరమైన జమ్మూ ప్రజలు ఇప్పుడు వాటికి అర్హులు. మునుపటి తరాలు చూసిన సమస్యలు నేటి జమ్మూ యువత ఎదుర్కోదు’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇక దేశవ్యాప్తంగా పంచాయితీలను ఉద్దేశించి మాట్లాడిన మోదీ.. సేంద్రీయ వ్యవసాయం వైపు అడుగులు వేయడంలో గ్రామ పంచాయితీలు కీలకంగా వ్యవహరించాలన్నారు. రసాయనాల వాడకాన్ని పూర్తిగా తగ్గించి మాతృభూమిని కాపాడుకోవాలని పిలుపునిచ్చిన ప్రధాని.. గ్రామపంచాయితీ స్థాయిలోనే దీనిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.కేంద్ర ప్రభుత్వ పథకమైన ‘గ్రామ్‌ ఊర్జా స్వరాజ్‌’ కార్యక్రమం కింద జమ్మూకశ్మీర్‌లోని సాంబా జిల్లా పల్లీ గ్రామంలో నిర్మించిన 500 కిలోవాట్ల సౌర విద్యుత్‌ ప్లాంట్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ ప్లాంటులో 1500 సోలార్‌ ప్యానెళ్ల ద్వారా గ్రామంలోని 340 ఇళ్లకు క్లీన్‌ ఎలక్ట్రిసిటీని అందించనున్నారు. అంతేకాకుండా గ్రామంలో రోడ్లు, విద్యుత్‌ బస్సు సదుపాయం, పంచాయితీ కార్యాలయం, ప్రభుత్వ పాఠశాల భవనం మరమ్మత్తులు, ఇతర అభివృద్ధి కార్యాక్రమాలను చేపట్టారు.ఇదిలాఉంటే, కశ్మీర్‌ పర్యటనలో భాగంగా రూ.3,100 కోట్లతో నిర్మించిన బనిహాల్‌`కాజీగుండ్‌ సొరంగ రహదారిని ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. రూ.7,500 కోట్లతో నిర్మించనున్న దిల్లీ`అమృతసర్‌`కాట్రా ఎక్స్‌ప్రెస్‌ రహదారి, చీనాబ్‌ నదిపై నిర్మించనున్న రెండు జలవిద్యుత్‌ ప్రాజెక్టులకూ ప్రధాని శంకుస్థాపన చేశారు. వీటితోపాటు ‘అమృత్‌ సరోవర్‌ మిషన్‌’ను ప్రధాని మోదీ ప్రారంభించారు.

ప్రధాని మోదీ సభావేదికకు 12 కి.విూ. దూరంలో పేలుడు

జమ్ముకశ్మీర్‌లో ఆదివారం ప్రధాని పర్యటనకు కొన్నిగంటల ముందు సభావేదికకు 12 కిలోవిూటర్ల దూరంలో పేలుడు సంభవించింది.జమ్ము జిల్లాలోని లాలియాన గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో ఒక పొలంలో పేలుడు చోటు చేసుకొంది. ప్రధాని బహిరంగ సభ జరగనున్న సాంబా జిల్లాలోని పల్లీ గ్రామానికి ఇది సవిూపంలోనే ఉంటుంది. సమాచారం అందుకొన్న పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకొన్నారు. ఇది ఉగ్రదాడి కాకపోవచ్చని పోలీసులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు వెల్లడికాలేదు.జమ్మూ`కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి హోదానిచ్చే 370 అధికరణం ఉపసంహరణ తర్వాత తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీ నేడు జమ్మూ`కశ్మీర్‌లో పూర్తిస్థాయి పర్యటన చేయనున్నారు. ఈ పర్యటనలో ఆయన బనిహాల్‌`కాజీగుండ్‌ సొరంగ మార్గంతో పాటు, రూ.20 వేల కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ‘జాతీయ పంచాయతీ రాజ్‌’ దినోత్సవం సందర్భంగా సాంబా జిల్లాలోని పల్లీ గ్రామం నుంచి దేశవ్యాప్తంగా గ్రామసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అక్కడ సౌర విద్యుత్‌ ప్లాంట్‌ను కూడా ప్రారంభించనున్నారు. శుక్రవారం సుంజ్వాన్‌ ప్రాంతంలో ఇద్దరు జైషే`మహమ్మద్‌ తీవ్రవాదుల ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో ప్రధాని భద్రతను అధికారులు మరింత పటిష్ఠం చేశారు. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అధిపతి కుల్‌దీప్‌ సింగ్‌ శనివారం సుంజ్వాన్‌ ప్రాంతానికి చేరుకున్నారు. మోదీ పర్యటించనున్న పల్లీ గ్రామానికి కూడా చేరుకొని అక్కడి భద్రతా పరిస్థితినీ సవిూక్షించారు. సాయంత్రం మోదీ కశ్మీర్‌ నుంచి నేరుగా ముంబయికు చేరుకుంటారు.
7.కోర్టులో లొంగిపోయిన లఖింపూర్‌ నిందితుడు

లఖ్‌నవూ,ఏప్రిల్‌ 24(జనంసాక్షి):లఖింపుర్‌ ఖేరీ హింసాత్మక ఘటన కేసులో నిందితుడైన కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్ర కుమారుడు ఆశిష్‌ మిశ్ర సరెండర్‌ అయ్యాడు.జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో ఆదివారం లొంగిపోయాడు. అనంతరం అధికారులు ఆశిష్‌ను లఖింపుర్‌ ఖేరీ జిల్లా జైలుకు తరలించారు. ఈ కేసుకు సంబంధించి అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను ఈనెల 18న పరిశీలించిన సుప్రీంకోర్టు రద్దు చేసింది. వారం రోజుల్లోగా కోర్టులో లొంగిపోవాలని ఆశిష్‌ మిశ్రాను ఆదేశించింది. ఈ నేపథ్యంలో తుది గడువుకు ఒకరోజు ముందుగానే ఆశిష్‌ సరెండర్‌ అయ్యాడు.లఖింపుర్‌ ఖేరీ హింసాత్మక ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న ఆశిష్‌ మిశ్రకు అలహాబాద్‌ హైకోర్టు ఫిబ్రవరి 10న బెయిల్‌ మంజూరు చేసింది. దీన్ని సవాల్‌ చేస్తూ బాధిత కుటుంబాల సభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ ఎన్‌.వి. రమణ నేతృత్వంలోని ధర్మాసనం.. కొన్ని ప్రశ్నలు లేవనెత్తింది. కేసు విచారణ ప్రారంభం కాకముందే.. పోస్టుమార్టం నివేదిక, గాయాల గురించి బెయిల్‌ ఉత్తర్వుల్లో హైకోర్టు ప్రస్తావించటాన్ని తప్పుపట్టింది. అసంబద్ధ విశ్లేషణలతో హైకోర్టు బెయిల్‌ ఇచ్చిందని అసహనం వ్యక్తం చేసింది. దీనిపై గతంలో తీర్పును రిజర్వ్‌లో పెట్టిన న్యాయస్థానం.. హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనబెట్టింది. ఆశిష్‌కు బెయిల్‌ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.గతేడాది అక్టోబరులో లఖింపుర్‌ ఖేరీలో ఆందోళన చేస్తోన్న రైతులపైకి ఆశిష్‌ మిశ్ర కారు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నలుగురు రైతులు మరణించగా.. అనంతరం జరిగిన అల్లర్లలో మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. కాగా ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. అనేక పరిణామాల అనంతరం ఆశిష్‌ను పోలీసులు అరెస్టు చేశారు.8.రష్యా దాడులతో ఉక్రెయిన్‌ అతలాకుతలం

కీవ్‌,ఏప్రిల్‌ 24(జనంసాక్షి):రష్యా దాడులతో ఉక్రెయిన్‌  ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇదిలా ఉండగా రాజధాని కీవ్‌ను ఇద్దరు అమెరికా మంత్రలు సందర్శించనున్నారు.అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకన్‌, రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌లు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ఆదివారం భేటీ కానున్నారు. ఈ విషయాన్ని కీవ్‌ మెట్రో వ్యవస్థలో నిర్వహించిన ఓ విలేకర్ల సమావేశంలో జెలెన్‌స్కీ స్వయంగా వెల్లడిరచారు. ఈ క్రమంలో భారీ ఆయుధాలను అందించాలని అమెరికాను కోరనున్నట్లు తెలిపారు. రష్యా ఆక్రమించుకొన్న ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకోవడంలో ఈ ఆయుధాలు చాలా కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు.ఈ పర్యటనకు కొద్ది గంటల ముందు జెలెన్‌స్కీ మాట్లాడుతూ మేరియుపొల్‌లో మా సేనలకు అపకారం చేసినా.. కొత్తగా ఆక్రమించిన ప్రాంతాల్లో రెఫరెండం నిర్వహించినా.. శాంతి చర్చల నుంచి వైదొలగుతామని తేల్చిచెప్పారు. ఒక దశలో రష్యా అణ్వాయుధాలను కూడా వాడుతుందని తాను భావించినట్లు ఆయన వెల్లడిరచారు. ప్రస్తుత సమయంలో ఉక్రెయిన్‌కు ఆయుధాలు అత్యంత కీలకమైనవని పేర్కొన్నారు. శాంతి చర్చల కోసం రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.’’మా చేతికి తగినన్ని ఆయుధాలు వీలైనంత తొందరగా అందితే.. రష్యా ఆక్రమణలో ఉన్న మా భూభాగాలను వెంటనే స్వాధీనం చేసుకొంటాం’’ అని జెలెన్‌స్కీ పేర్కొన్నారు. మేరియుపోల్‌లో రష్యా సేనల ఉచ్చులో చిక్కుకొన్న సైన్యాన్ని విడిపించేందుకు అవకాశం ఉన్న ఏ ఒప్పందానికైనా కీవ్‌ సిద్ధమని తెలిపారు. శనివారం ఉక్రెయిన్‌ దళాలకు అత్యంత కఠినమైన రోజుగా ఆయన అభివర్ణించారు.

10.చమురు శుద్ధి కర్మాగారంలో భారీ పేలుడు.. 

` వంద మందికిపైగా మృతి 

పోర్ట్‌ హార్కోర్ట్‌,ఏప్రిల్‌ 24(జనంసాక్షి):నైజీరియాలోని చమురు శుద్ధి కర్మాగారంలో (ూతిశ్రీ ఖీవటతినివతీవ) భారీ పేలుడు సంభవించింది. దీంతో వంద మందికిపైగా సజీవదహనం అయ్యారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత దక్షిణ నైజీరియాలోని ఓ అక్రమ చమురు శుద్ధి కర్మాగారంలో.. నిర్వాహకులు, విక్రేతలు సమావేశమయ్యారు. అయితే ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో వందమందికి పైగా మరణించారని, మరికొందలు ప్రాణాలు కాపాడుకోవడానికి చెట్లపైకి ఎక్కారని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పారు. మృతదేహాలు గుర్తించలేనంతగా కాలిపోయాయని వెల్లడిరచారు. రివర్స్‌, ఇమో స్టేట్‌ మధ్య సరిహద్దులో ఈ ఘటన జరిగిందని రివర్స్‌ స్టేట్‌ పోలీస్‌ ప్రతినిధి గ్రేస్‌ ఇరింగే కోకో తెలిపారు.ఆఫ్రికాలో భారీగా ముడి చమురు ఉత్పత్తి చేసే దేశాల్లో నైజీరియాలో ఒకటి. అక్కడ రోజుకు సుమారు రెండు మిలియన్‌ బ్యారెల్స్‌ క్రూడాయిల్‌ ఉత్పత్తి అవుతుంది. అయితే నైజీరియాలో అక్రమంగా ముడిచమురును శుద్ధిచేయడం సర్వసాధారణం. పైప్‌లైన్‌లను ధ్వంసం చేసి ముడిచమురు దొంగిలించిన అనంతరం.. దానిని శుద్ధి చేసినతర్వాత బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయిస్తారు.